Translate

Monday, August 12, 2019

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


బందోబస్తులో ఉన్న సీఐని ఒరేయ్ అని పిలిచిన ఎంపీ…. ఎందుకో తెలుసా?

Posted: 12 Aug 2019 11:06 AM PDT

ఆయన కొత్తగా గెలిచిన ఎంపీ. వన సమారాధనకు ముఖ్య అతిథిగా పిలవడంతో ఆ కార్యక్రమానికి వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక బందోబస్తులో ఉన్న సీఐని చూసి.. ఒరేయ్ అంటూ పిలిచాడు. కాని ఆ సీఐ ఏ మాత్రం బాధపడకుండా వెళ్లి ఆ ఎంపీని కౌగిలించుకున్నాడు. ఈ దృశ్యం చూసిన అక్కడి వాళ్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అసలు ఆ ఎంపీ ఎవరు..? ఆ సీఐని ఎందుకు ఒరేయ్ అన్నాడు.. అయినా ఆ సీఐ ఎందుకు కోప్పడలేదని అనుకుంటున్నారా..? హిందూపురం […]

కేటీఆర్ సార్… గుర్తులేవా ఆ మాటలు !

Posted: 12 Aug 2019 11:04 AM PDT

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుపై కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వారు మాత్రమే తెలంగాణవాదులని, మిగిలిన వారంతా తెలంగాణ ద్రోహులని గతంలో కేటిఆర్ చేసిన వ్యాఖ్యలపై శ్రవణ్ గుర్తుచేశారు. "బీజేపీలో చేరితే దేశభక్తులని, చేరకపోతే దేశద్రోహులని బీజేపీ ప్రకటనలు చేస్తోందంటున్న మీరు గతంలో తెలంగాణపై ఇలాంటి ప్రకటనలు చేయలేదా. అప్పుడు మీకు మంచి అనిపించనవి.. ఇప్పుడు మీకు వ్యతిరేకం కాబట్టి చెడుగా […]

స్టుడియో రౌండప్ (12-08-2019)

Posted: 12 Aug 2019 10:56 AM PDT

సరిలేరు నీకెవ్వరు మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి విజయశాంతి వచ్చిచేరింది. ఆమెకిది రీఎంట్రీ మూవీ. విజయశాంతి సెట్స్ పైకి వచ్చిన విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు. ఆమె మేకప్ వేసుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ షెడ్యూల్ తర్వాత రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజు సెట్ […]

విజయసాయి హెచ్చరికలు…. బాబు టీం బీ అలెర్ట్

Posted: 12 Aug 2019 06:14 AM PDT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ లో చెడుగుడు ఆడేశారు. ఏకంగా ఈసారి నలుగురు టీడీపీ ఉద్దండులను టార్గెట్ చేసి ఏకిపారేశారు. చంద్రబాబు, లోకేష్ తోపాటు కోడెల, దేవినేని ఉమాలపై విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు ఇటీవల పాలిచ్చే ఆవును వదిలి దున్నపోతును తెచ్చుకున్నారని జగన్ గెలుపుపై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చే ఆవు చంద్రబాబు, పాలు మరవని దూడ లోకేష్ […]

సోషల్ మీడియా లో ఫేమస్ అవుదామని…

Posted: 12 Aug 2019 06:10 AM PDT

సోషల్ మీడియా లో ఫేమస్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటిని వినియోగించుకుంటున్నారు నెటిజన్లు. ఈ పిచ్చిలో పడి కొందరు అత్యంత ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.  అటువంటివే ఈ కుర్రోడు చేసేవి కూడా. ఈ మధ్య యూ ట్యూబ్ లో రైలు పట్టాలపై అనేక వస్తువులు ఉంచి రైలు వచ్చినప్పుడు అవి స్మాష్ అవుతుంటే వీడియో తీసి యూట్యూబ్ లో ఉంచుతున్న వీడియోలు ఎక్కువయ్యాయి. అందులో కొన్ని వైరల్ అయ్యాయి. రైల్వే […]

వెబ్ సిరీస్ వైపు… శ్రద్ధా దాస్

Posted: 12 Aug 2019 05:54 AM PDT

టాలీవుడ్ లో హీరోయిన్ల సంఖ్య ఎక్కువే…. కానీ వాళ్ళకి వస్తున్న అవకాశాల సంఖ్య మాత్రం తక్కువే. అందుకే చాలా మంది హీరోయిన్లు వేరే భాషల్లో కి వెళ్లడం, లేకపోతే ఇతర మార్గాల ద్వారా పని కల్పించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే అప్పుడెప్పుడో తెలుగు లో అరంగేట్రం చేసిన శ్రద్ధా దాస్  ఇప్పుడు తెలుగు లో అవకాశాల్లేక వెబ్ సిరీస్ రంగం లో కి అడుగు పెడుతుంది. శ్రద్ధ దాస్ సుకుమార్ తీసిన […]

మన్మథుడు-2 ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Posted: 12 Aug 2019 05:47 AM PDT

తన సినిమాను ఎంత లేపడానికి నాగార్జున ట్రై చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మన్మథుడు-2 సినిమాకు మొదటి రోజే డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో, ఆ ప్రభావం వసూళ్లపై పడింది. ఈ సినిమా వసూళ్ళు రోజురోజుకు పడిపోతున్నాయి. చివరికి ఆదివారం కూడా ఆక్యుపెన్సీ లేకపోవడం మన్మథుడు-2ను నీరుగార్చింది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు కేవలం 8 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 18 కోట్ల రూపాయలకు అమ్మారు. […]

ఆగిపోయిన భారతీయుడు…. ముందుకు కదిలాడు…

Posted: 12 Aug 2019 05:42 AM PDT

ఎప్పటి నుంచో భారతీయుడు 2 సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది అనే వార్తలు వచ్చాయి… కానీ అది మాత్రం ముందుకు సాగలేదు. గత ఏడాది బిగ్ బాస్ ఫైనల్ అప్పుడు ఈ సినిమా ని ప్రకటించిన కమల్ హాసన్, దానిని త్వరగా గట్టెకించడం లో విఫలమయ్యారు. కొన్ని రోజులు షూటింగ్ చేసాక ఈ సినిమా ని ఆపేసారు. చాలా నెలలు ఈ సినిమా అలా ఆగిపోయి ఉంది. మొత్తానికి ఇప్పుడు  సినిమా షూటింగ్ భారీ స్థాయిలోనే సాగనుంది […]