telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Posted: 09 Mar 2020 06:27 AM PDT

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిర్వహించనున్న ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎన్నికల నామినేషన్లు ఈ నెల 11 నుంచి 13 వరకు స్వీకరించనుండగా.. 14న నామినేషన్ల పరిశీలన, 16న ఉపసంహరణ గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో నిలిచే తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 23న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, […]

స్థానిక సమరంలో… భారతీయ “జన”తా “సేన”!

Posted: 09 Mar 2020 06:15 AM PDT

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ మిత్రులు జనసేన, బీజేపీ.. అంగీకారానికి వచ్చాయి… కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. సమయం తక్కువగా ఉన్న కారణంగా.. పొత్తులు కూడా త్వరలో ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఈ విషయాన్ని ఇరు పార్టీల సమావేశం అనంతరం.. అగ్ర నేతలు పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మండల, జిల్లా స్థాయిలతో పాటు శాసనసభ నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయ కమిటీలు వేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ నెల […]

ఈసారి చరణ్ ఓటు ఎవరికి?

Posted: 09 Mar 2020 05:30 AM PDT

ఓవైపు అనీల్ రావిపూడి. మరోవైపు గౌతమ్ తిన్ననూరి. ఇంకోవైపు వంశీ పైడిపల్లి. ఈ ముగ్గురిలో ఎవరికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ మారింది. ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయిన వెంటనే వీళ్ల ముగ్గురిలో ఒకరితో చరణ్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరు సక్సెస్ అయిన వెంటనే రామ్ చరణ్, అనీల్ రావిపూడి మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. అటు గౌతమ్ తిన్ననూరి కూడా రామ్ చరణ్ కు ఓ […]

మాట నిలబెట్టుకున్న జగన్… రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

Posted: 09 Mar 2020 05:20 AM PDT

మాట తప్పను మడమ తిప్పను అని ఎప్పుడూ చెప్పే సీఎం జగన్ మరో సారి తన నైజాన్ని చాటుకున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇద్దరు తమ మంత్రి, ఎమ్మెల్సీ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో వైసీపీ పార్టీ మండలిని రద్దు చేయాలని […]

బాలయ్య, బి గోపాల్ మళ్లీ కలుస్తున్నారా?

Posted: 09 Mar 2020 02:45 AM PDT

ఇప్పుడంటే అంతా బాలయ్య-బోయపాటి కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నారు కానీ, ఒకప్పుడు కాంబినేషన్ అంటే బాలయ్య-బి.గోపాల్ దే. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన రౌడీ ఇన్ స్పెక్టర్, లారీడ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ను విడగొట్టిన ఘనత పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాకే దక్కుతుంది. పల్నాటి బ్రహ్మనాయుడు ఫ్లాప్ తర్వాత తిరిగి బాలయ్య-గోపాల్ కలవలేదు. ఇన్నాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. ఈ కాంబినేషన్ ను కలిపే […]

కల్యాణి కొత్త అవతారం

Posted: 09 Mar 2020 02:43 AM PDT

ఒకప్పటి హీరోయిన్ కల్యాణి కొన్నాళ్ల పాటు కెరీర్ కు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మారారు. ఇప్పుడీ నటి ఏకంగా దర్శకురాలిగా మారబోతున్నారు. అంతేకాదు.. ఒకేసారి నిర్మాతగా కూడా మారబోతున్నారు. అవును.. స్వీయదర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారు కల్యాణి. ఈమె డైరక్ట్ చేయబోయే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశాడు. కే2కే ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించారు కల్యాణి. ఈ బ్యానర్ పై […]

ఓవర్సీస్ లో భీష్మ కష్టాలు

Posted: 09 Mar 2020 02:34 AM PDT

సినిమా సూపర్ హిట్టన్నారు. వసూళ్ల పరంగా నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అన్నారు. కట్ చేస్తే, జస్ట్ కమీషన్లతో ఒడ్డెక్కింది భీష్మ సినిమా. అటు ఓవర్సీస్ లో అయితే మిలియన్ మార్క్ అందుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. దీనంతటికీ కారణం రిలీజ్ రాంగ్ టైమ్ లో పడ్డమే. పండగలు, శెలవులు ఉంటేనే సినిమాలు చూస్తున్నారు జనం. అందుకే పెద్ద హీరోలంతా ఇలాంటి అకేషన్లలోనే సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి స్పెషల్ అకేషన్ ఏదీ లేకుండా […]

టీడీపీకి డొక్కా రాజీనామా

Posted: 09 Mar 2020 12:59 AM PDT

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ కూడా రాశారు. ఎమ్మెల్సీగా ఉన్న డొక్కకు 2019లో పత్తిపాడు అసెంబ్లీ టికెట్‌ను ఆఖరి నిమిషంలో కేటాయించారు. తాను ఓటమిపాలవుతానని తెలిసినా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీ చేశానని చెప్పారు. ఇక గత కొంత […]

Comments