Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Saturday, March 7, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


బీజేపీ, వైసీపీ మధ్య ట్విట్టర్ వార్

Posted: 07 Mar 2020 12:52 AM PST

ఏపీ సీఎం జగన్, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో స్నేహ పూర్వక సంబంధాలను నెరుపుతున్నారు. మోడీ, అమిత్ షాలతో కలిసి సఖ్యత మెయింటేన్ చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అధికార వైసీపీతో ఏపీ బీజేపీ శాఖ మాత్రం ఘర్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తోంది. జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. గురువారం బీజేపీ ఏపీ శాఖ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. 'ఆంధ్రప్రదేశ్, వైసీపీ, 150 […]

గవర్నర్ తమిళిసైతో పంతం నెగ్గించుకున్న కేసీఆర్

Posted: 07 Mar 2020 12:49 AM PST

తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేయాల్సిన ప్రసంగం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని ఆమెకు పెద్ద ఇబ్బందిని నివారించారు. శుక్రవారం బడ్జెట్ సమావేశంలో మొదటి రోజు రాష్ట్ర శాసనసభలో ఈ చిత్రం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటీజన్ (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా ఈ అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి రెడీ అయ్యారు. అయితే గవర్నర్ ప్రసంగంలో ఈ […]

రామ్ చరణ్ కు బ్రహ్మరథం

Posted: 06 Mar 2020 10:27 PM PST

సినిమా ఫంక్షన్లకు, ప్రారంభోత్సవాలకు స్టార్ హీరోలు వెళ్లడం కామన్. అక్కడ వాళ్లకు అతిథి మర్యాదలు జరగడం కూడా అంతే కామన్. అయితే ఓ హీరో సినిమా ప్రారంభోత్సవానికి మరో హీరో వెళ్లినప్పుడు మాత్రం ఇలాంటి సత్కారాలు పెద్దగా ఉండవు. మరీ ముఖ్యంగా సినిమా ప్రారంభోత్సవం కాబట్టి ఓ గంట సేపు అలా కారులో వెళ్లి క్లాప్ కొట్టి వచ్చేస్తాడు ఏ స్టార్ హీరో అయినా. అయితే ఇక్కడ రామ్ చరణ్ విషయంలో మాత్రం వ్యవహారం వేరేలా ఉంది. […]

పాన్ ఇండియా వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న అల వైకుంఠ‌పురంలో ఆడియో మ్యూజిక్ ఆల్బ‌మ్

Posted: 06 Mar 2020 10:25 PM PST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్ ఇండ‌స్ట్రీ హిట్ రికార్డ్ బ్రేక‌ర్ అల‌వైకంఠ‌పురంలో ఆడియో కి వ‌చ్చిన క్రేజ్ గురించి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ఖ్యాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఆల‌వైకుంఠ‌పురం ఆడియో విడుద‌లైంది. ఈ మ్యూజిక్ ఆల్బ‌మ్ లో ఉన్న అన్ని పాట‌ల‌కి ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛాన‌ల్ లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ రావ‌డ‌మే కాకుండా తాజాగా ఈ పాట‌లు పాన్ ఇండియా వైడ్ ఉన్న ప్ర‌ఖ్యాత మ్యూజిక్ ప్లాట్ […]

ఐపీఎల్ బోర్డు పొదుపు బాట!

Posted: 06 Mar 2020 10:13 PM PST

ప్రైజ్ మనీలో భారీగా కోత, ప్రారంభవేడుకలు రద్దు సగానికి సగం ఖర్చు తగ్గించుకొనే పనిలో బోర్డు ప్రపంచంలో అత్యంత భాగ్యవంతమైన టీ-20 క్రికెట్ నిర్వాహక సంఘం ఐపీఎల్ బోర్డు ఆలస్యంగానైనా పొదుపుబాట పట్టింది. గత 12 సీజన్లుగా విలాసాలు, దుబారా ఖర్చులతో విపరీతంగా ఖర్చు పెట్టిన ఐపీఎల్ బోర్డు 2020 సీజన్ నుంచి పొదుపు మంత్రాన్ని జపిస్తోంది. ఖర్చులను సగానికి సగం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది. ప్రారంభవేడుకలకు స్వస్తి…. ప్రపంచ క్రికెట్లోనే అత్యధికంగా 47 వేల […]

ఎట్టకేలకు ఒడ్డెక్కిన “హిట్”

Posted: 06 Mar 2020 10:03 PM PST

వాపు-బలుపు మధ్య చాలా తేడా ఉంది. మొదటి రోజు టాక్ ను గుడ్డిగా నమ్మితే అది వాపు అవుతుంది తప్ప బలుపు అవ్వదు. హిట్ సినిమా విషయంలో ఇదే జరిగింది. రిలీజైన మొదటి రోజు హోరెత్తించారు. చిన్న సినిమాల్లోనే పెద్ద హిట్ అన్నారు. పైరసీ అవ్వకుండా ఉన్నట్టయితే, చిన్న సినిమాల్లో ఇదే బాహుబలి అని స్వయంగా నాని ప్రకటించుకున్నాడు. కట్ చేస్తే, అతి కష్టమ్మీద హిట్ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. గురువారంతో మొదటి వారం పూర్తిచేసుకున్న […]

కరోనా దెబ్బకు వాయిదా పడిన ఐఫా వేడుకలు

Posted: 06 Mar 2020 09:53 PM PST

ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా కలవర పెడుతోంది. ఏ ఇద్దరి మధ్య చూసినా కరోనాపై చర్చలే. ఈ సందర్భంగా భారీ సభలు, వేడుకలను రద్దు చేసుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత చూద్దాంలే అంటూ వాయిదాలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా ప్రభావం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) వేడుకలపై పడింది. బాలీవుడ్ సినిమాకు సంబంధించి అత్యంత ఆడంబరంగా జరిగే ఈ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సారి 21వ ఐఫా ఫంక్షన్ మూడు రోజుల […]

ఢిల్లీ అల్లర్లపై హోం మంత్రి వివరణ..?

Posted: 06 Mar 2020 08:05 PM PST

దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లకు సంబంధించిన అంశం పార్లమెంటులో చర్చకు రానుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీనిపై మార్చి 11న వివరణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఢిల్లీ అల్లర్ల ఘటనపై చర్చ చేపట్టాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, రెండు రోజుల్లో హోలీ పండుగ వస్తున్న సమయంలో అల్లర్లపై చర్చ జరిగితే శాంతి […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan