Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Friday, March 6, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


మీడియాను చూసి పారిపోయిన కరోనా అనుమానితుడు..!

Posted: 06 Mar 2020 03:27 AM PST

ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా కరోనా సంబంధిత వార్తలే. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా లేదని చెబుతున్నా సరే అదిగో కరోనా.. ఇదిగో కరోనా అంటూ వార్తలు వస్తున్నాయి. ఎవరికైనా కాస్త దగ్గు, జలుబు ఉన్నా సరే వారితో మాట్లాడటానికి జంకుతున్నారు. ఒకవైపు మీడియా కరోనా నుంచి ఎలా రక్షించుకోవాలో చెబుతూనే.. కరోనా బాధితులు అంటూ వార్తలు ప్రసారం చేస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. అవి ఎంతగా అంటే ఆసుపత్రులకు వచ్చే బాధితులు […]

ఏపీలో జెడ్పీ రిజర్వేషన్లు ఖరారు

Posted: 06 Mar 2020 03:01 AM PST

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభించారు. కాగా, శుక్రవారం ఏపీలోని 13 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి జిల్లాల వారీ రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల సంఘానికి పంపారు. జిల్లా  […]

ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు

Posted: 06 Mar 2020 02:36 AM PST

ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత మంది ఐపీఎస్‌లను ఒకే దఫా బదిలీ చేయడం ఇదే తొలిసారి. కాగా, చాలా మంది అధికారులు పదోన్నతులు కూడా పొందారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోనికి వస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. బదిలీ స్థానం/పదోన్నతి – ఐపీఎస్ విశాఖ పోలీసు కమిషనర్‌ – ఆర్కే మీనా పోలీసులు రిక్రూట్‌మెంట్ బోర్డు […]

ఐటీ ఉచ్చులో అహ్మద్ పటేల్… బాబులో ఆందోళన?

Posted: 06 Mar 2020 12:54 AM PST

తీగలాగితే కొండ కదులుతోందా? కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు తాజాగా ఐటీ నోటీసులు రెండోసారి జారీ కావడం… ఈసారి హాజరు కావాలని కోరడం టీడీపీ అధినేత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. బీజేపీని గద్దెదింపడమే ధ్యేయంగా సార్వత్రిక ఎన్నికల వేళ తన బద్ధశత్రువైన కాంగ్రెస్ తో జట్టుకట్టాడు చంద్రబాబు. అంతేకాదు.. అంతకుముందు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని కోట్ల రూపాయలను కాంగ్రెస్ […]

యస్ బ్యాంకు దెబ్బ… ఫోన్ పే ఆగిపోయింది..!

Posted: 06 Mar 2020 12:51 AM PST

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. యస్ బ్యాంక్ సంక్షోభం పేమెంట్ బ్యాంక్ ‘ఫోన్ పే’ను చుట్టుకుంది. యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ దానిపై పలు ఆంక్షలు విధించింది. కాగా ఫోన్ పే చెల్లింపులకు మధ్యవర్తిగా యస్ బ్యాంకే వ్యవహరిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఫోన్ పే ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ యాప్ ద్వారా చేసే యూపీఐ చెల్లింపులు కూడా ఆగిపోయాయి. అకస్మాత్తుగా ఫోన్ పే పని చేయకపోవడంతో […]

కడపలో స్విస్‌ స్టీల్‌ ప్లాంట్…. మీడియాకు మింగుడు పడడం లేదు

Posted: 05 Mar 2020 10:50 PM PST

వైసీపీ ప్రభుత్వం కొలువుదీరినప్పటినుంచీ ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అనుకూల పత్రికలు, టీవీ ఛానల్స్‌…. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతినిర్ణయానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం… పత్రికలు వార్తలను వండి వార్చడం, వాటిని ప్రచారం చేయడం చేస్తున్నాయి. ఇసుక నుంచి మొదలుకుని గ్రామ వాలంటీర్ల నియమకాలు, మద్యం పాలసీని, మూడు రాజధానుల విషయం వరకూ వరుసగా వ్యతిరేక కథనాలతో హోరెత్తించాయి. అయితే స్థానికంగా ప్రజలనుంచి కానీ, సోషల్‌ మీడియాలో కానీ కనీస స్పందన కూడా కరువవడంతో… ప్రభుత్వాన్ని ఇరుకున […]

తాడిప‌త్రిలో జేసీ అప్పుడే జెండా దించేశారా?

Posted: 05 Mar 2020 07:07 PM PST

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాలేదు. టీడీపీలో ఒక్కో వికెట్ డౌన్ అవుతోంది. ఎన్నిక‌ల్లో తాము గెల‌వ‌లేమ‌ని అస్త్ర స‌న్యాసాలు చేస్తున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తాజాగా చేసిన చట్టం విషయంలో టీడీపీ నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి మాటలు ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి… ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు జగన్ స‌ర్కార్‌ కొత్తగా చట్టం చేసింది. కొత్త చట్టం ప్రకారం ఎవరైనా డబ్బు, మద్యం పంచుతూ […]

మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్

Posted: 05 Mar 2020 07:05 PM PST

వానదెబ్బతో ఇంగ్లండ్ తో సెమీస్ రద్దు 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు నాలుగో ర్యాంకర్ భారత్ తొలిసారిగా చేరుకొంది. టైటిల్ సమరంలో నాలుగుసార్లు విజేత ఆస్ట్ర్రేలియాతో భారత్ తలపడనుంది. సిడ్నీ వేదికగా ఇంగ్లండ్ తో జరగాల్సిన తొలిసెమీఫైనల్స్ కుండపోత వర్షం కారణంగా రద్దు కావడంతో..మెరుగైన రన్ రేట్ తో పాటు లీగ్ దశలో అత్యధిక విజయాలు సాధించిన భారత్ ను ఫైనల్స్ చేరినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. గ్రూప్ -ఏ లీగ్ లో భారత్ ఆడిన నాలుగుకు […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan