Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Thursday, March 5, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


మరో బ్లాక్ బస్టర్ కోసం బన్నీ ప్లాన్ అదుర్స్…

Posted: 05 Mar 2020 12:21 AM PST

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన బన్నీ 'అల వైకుంఠపురం' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పుడు అల వైకుంఠపురం కంటే మెరుగైన హిట్ కోసం అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడట.. భారీ కలెక్షన్లు సాధించడానికి ఈ అవకాశాన్ని మలుచుకుంటున్నాడట. అల వైకుంఠపురాన్ని మంచి సీజన్ అయిన సంక్రాంతికి రిలీజ్ చేసి బన్నీ మంచి పనిచేశాడు. ఈ సినిమా తనకు పోటీ అయిన మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని అధిగమించి మంచి వసూళ్లు […]

అధికారుల అత్యుత్సాహంతో జగన్‌ కు చెడ్డ పేరు

Posted: 05 Mar 2020 12:12 AM PST

ఉగాదినాడు ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మందికి ఇళ్ళపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎన్నికల హామీలలో భాగంగా పార్టీ అధ్యక్షుడు జగన్‌ చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోనున్నారు. అంతవరకూ సంతోషమే. నిరుపేదలకు నిలువనీడ దొరకడం ఆనందదాయకమే. అయితే అధికారుల అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ అది గుర్తించినట్లే ఉన్నారు. అందుకే బలవంతపు భూసేకరణ చేయవద్దని అధికారులకు పదేపదే చెప్పారు. అయినా చాలామంది అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోవడం లేదు. అనేకచోట్ల అసైన్డ్‌ భూములను బలవంతంగా సేకరిస్తున్నారు. […]

మరో సినిమా ప్రారంభించిన నిఖిల్

Posted: 04 Mar 2020 10:30 PM PST

మొన్ననే తిరుపతిలో కార్తికేయ-2 సినిమాను ప్రారంభించాడు నిఖిల్. ఈరోజు మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో కొద్దిసేపటి కిందట కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈ మూవీకి చాలా ప్రత్యేకతలున్నాయి. సుకుమార్ ఈ సినిమాకు కథ అందించాడు. స్క్రీన్ ప్లే కూడా అతడే సమకూర్చి పెట్టాడు. సూర్యప్రతాప్ దర్శకత్వం మాత్రం వహిస్తాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సుకుమార్ సహ-నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. ఎప్పట్లానే అల్లు అరవింద్ సమర్పకుడిగా […]

చిరంజీవి సపోర్ట్ వైసీపీకా? జనసేనకా? నాగబాబు క్లారిటీ

Posted: 04 Mar 2020 10:02 PM PST

ఓవైపు తమ్ముడు , జనసేనాని పవన్ కళ్యాణ్… వైసీపీ అధినేత, సీఎం జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఆయన అన్నయ్య మాత్రం ఆ మధ్య ఏపీ సీఎం జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటి నుంచి మొదలైంది లొల్లి. చిరంజీవి సపోర్టు ఆయన తమ్ముడు జనసేనకు అని వాళ్లు…. కాదు కాదు వైసీపీకేనని వీళ్లు చిరంజీవిని ఓన్ చేసుకుంటున్నారు. తాజాగా మరో రూమర్ ప్రచారంలోకి వచ్చేసింది. ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక […]

నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చేందుకు ఆ హీరో చాలా కష్టపడుతున్నాడట

Posted: 04 Mar 2020 10:00 PM PST

ఒక్క సినిమా హిట్ అయితే చాలు కోట్లకు కోట్ల కలెక్షన్లు. డబ్బు. స్టార్ హీరోలకు అయితే చెప్పలేనంత ఆదాయం వస్తుంది. ఇన్ కం టాక్స్ కు చూపించేది తక్కువే. ఇతర మార్గాలకు మళ్లించేది ఎక్కువ. అందుకే తరచుగా సినీ తారల సినిమాలు హిట్ అయినప్పుడు వారి మీద ఐటీ రైడ్స్ జరుగుతుంటాయి. పరిశ్రమలోని ఇతరులతో పోల్చినప్పుడు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు నల్లధనం (బ్లాక్ మనీ) సమస్యలను ఎదుర్కొంటారనే టాక్ ఉంది. ఈ బ్లాక్ మనీని ఎలా […]

రంజీట్రోఫీ పైనల్స్ వేదిక రాజ్ కోట

Posted: 04 Mar 2020 09:58 PM PST

సౌరాష్ట్ర్రకు బెంగాల్ సవాల్ రంజీట్రోఫీ 2019-2020 సీజన్ టైటి్ల సమరానికి మాజీ చాంపియన్లు బెంగాల్, సౌరాష్ట్ర్ర జట్లు అర్హత సంపాదించాయి. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా మార్చి 9 నుంచి ఐదురోజులపాటు జరిగే టైటిల్ సమరంలో ఈ రెండుజట్లూ తలపడనున్నాయి. సౌరాష్ట్ర్ర బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్… ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర్ర జట్టు రంజీట్రోఫీ ఫైనల్స్ కు వరుసగా రెండోసారి అర్హత సంపాదించింది. గత సీజన్ ఫైనల్లో విదర్భ చేతిలో […]

బిగ్ బాస్ విజేత రాహుల్ పై దాడి

Posted: 04 Mar 2020 08:28 PM PST

బిగ్ బాస్ సీజన్-3 విజేతగా పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ పై రాత్రి దాడి జరిగింది. తీవ్ర గాయాలతో అతడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తలకు మాత్రం బలమైన గాయం అయిందని చెబుతున్నారు వైద్యులు. నిన్నరాత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు వెళ్లాడు రాహుల్. అక్కడే ఉన్న మరో గ్రూప్ రాహుల్ బ్యాచ్ పై కన్నేసింది. రాహుల్ బ్యాచ్ లో […]

ఇంత రిస్క్ అవసరమా ప్రభాస్

Posted: 04 Mar 2020 08:00 PM PST

యూరోప్ ను కరోనా వణికిస్తోంది. స్పెయిన్, ఇటలీతో పాటు మరెన్నో దేశాలు ఈ వైరస్ తో ఇబ్బంది పడుతున్నాయి. టూరిస్టులంతా విదేశీ పర్యటనలు రద్దుచేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో యూరోప్ వెళ్లాడు ప్రభాస్. అవును.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ యూరోప్ వెళ్లాడు. అతడు ఏ దేశం వెళ్లాడనేది ప్రస్తుతానికి తెలియకపోయినా, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న యూరోప్ కు ప్రభాస్ వెళ్లడం మాత్రం ఎవరికీ నచ్చలేదు. నిన్న ఎయిర్ పోర్ట్ లో ముఖానికి […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan