Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Wednesday, March 4, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ ఫస్ట్ లుక్

Posted: 04 Mar 2020 08:59 AM PST

హీరో మంచు మనోజ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్నాడు. రీసెంట్ గా ‘అహం బ్రహ్మాస్మి’ అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన మనోజ్.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశాడు. ఈ మూవీ మార్చి 6న గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఫస్ట్ లుక్ లో శివభక్తుని తరహాలో మంచు మనోజ్ కనిపిస్తున్నాడు. పోస్టర్లో మనోజ్ మూడు రకాల హావభావాలు.. హాస్యం, రౌద్రం, శాంతం.. ప్రదర్శిస్తున్నాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ కు […]

గుండె జారి ఒరేయ్ బుజ్జిగా అయినట్టుందే

Posted: 04 Mar 2020 08:57 AM PST

కొద్దిసేపటి కిందట విడుదలైంది ఒరేయ్ బుజ్జిగా టీజర్. రాజ్ తరుణ్ ఇందులో హీరోగా నటించాడనే విషయాన్ని పక్కనపెడితే.. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత విజయ్ కుమార్ కొండా డైరక్ట్ చేసిన సినిమాగా దీన్ని ఎక్కువమంది చూస్తున్నారు. ఎందుకంటే గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఈ దర్శకుడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అయితే ఒరేయ్ బుజ్జిగా టీజర్ చూసిన ప్రేక్షకులకు మరోసారి గుండెజారి గల్లంతయ్యిందే సినిమానే గుర్తొచ్చింది. అందులో కథ మొత్తం ఫోన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో కూడా […]

ఏపీలో ఎన్నికల వేడి… పవన్ కు సినిమాల వేడి

Posted: 04 Mar 2020 08:55 AM PST

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చేసి సినిమాలు చేస్తున్నారు. జనసేనకు ఆర్థికబలం చేకూర్చడం.. కుటుంబ పోషణ, పిల్లల ఫీజులకోసం, పార్టీని నడపాలంటే డబ్బులు కావాల్సి రావడంతోనే తప్పని సరి పరిస్థితుల్లోనే సినిమాలు చేయాలనుకుంటున్నానని పవన్ కళ్యాణ్  చెప్పారు కూడా. అయితే పవన్ ను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వడం లేదు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఈ ఎండాకాలంలో రెండు సినిమాలు పూర్తి చేసి వాటి ద్వారా ఆదాయం పొందాలని శరవేగంగా షూటింగ్ లో […]

రోజా సవాల్… టీడీపీ వాళ్లు స్వీకరిస్తారా?

Posted: 03 Mar 2020 05:29 PM PST

మద్య నిషేధాన్ని చిత్తశుద్ధితో దశల వారీగా అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలున్న ప్రతిసారీ చెబుతూ వస్తోంది. అందుకు తగినట్టే రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులను ప్రభుత్వం నిర్మూలించిందని… మద్యం షాపుల పని వేళలు కుదించామని.. అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగితే అడ్డుకుంటున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకు తగినట్టే మద్య నిషేధం కూడా నెమ్మదిగా అమల్లోకి వస్తోంది. ఈ వ్యవహారంపై.. టీడీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో […]

ఇంట్రెస్టింగ్: జగన్ సర్కార్ పొలిటికల్ థ్రిల్లర్.. టార్గెట్ ఫోర్!

Posted: 03 Mar 2020 05:22 PM PST

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజులు.. రాజకీయంగా వేసవిని మించిన వేడిని రగిలించనున్నాయి. వైఎస్ జగన్ సర్కారు తీసుకోబోతున్న చర్యలు.. వాటి ఫలితంగా ఎదురు కానున్న పరిణామాలు.. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాలు.. అన్నీ ఓ వరుసలో పరిశీలిస్తే.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. ఆ వివరాలపై.. ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. అధికార పార్టీ చర్యలకు, ప్రతిపక్షం ప్రతి చర్యలు ఎలా ఉంటాయన్నదే ఆసక్తికరంగా మారింది. అసలు విషయానికి వస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలకు జగన్ ప్రభుత్వం […]

ఐపీఎల్ కు కరోనా ముప్పులేనట్లే!

Posted: 03 Mar 2020 05:19 PM PST

యధావిధిగా పోటీలంటున్న నిర్వాహక సంఘం ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలకు కరోనా వైరస్ ముప్పులేనట్లేనని నిర్వాహక సంఘం చైర్మన్ బ్రిజేష్ పటేల్, బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ధీమాగా చెబుతున్నారు. మార్చి 29 నుంచి మే 24 వరకూ ఐదువారాలపాటు జరిగే ఈ టోర్నీ ప్రారంభమ్యాచ్ ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ఈనెల 29న డిఫెండింగ్ చాంపియన్ ముంబై, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది. కరోనా వైరస్ దెబ్బతో […]

కరోనా ఎఫెక్ట్: విశాఖకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

Posted: 03 Mar 2020 05:17 PM PST

విశాఖ సాగర తీరాన్ని కూడా కరోనా పరోక్షంగా తాకింది. ఓ చేదు వార్తను.. విశాఖ వాసులకు మిగిల్చింది. నావికాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో మరికొద్ది రోజుల్లో జరగాల్సి ఉన్న వేడుకకు.. కరోనా వైరస్ నిర్దాక్షిణ్యంగా బ్రేకులు వేసింది. వేడుక పేరు.. మిలాన్. మార్చి 18 నుంచి 28 వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవం జరగాల్సి ఉంది. మునుపెన్నడూ లేనంతగా.. 32 దేశాల నావికాదళాలు విన్యాసాలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ తీరం వేదికగా […]

తెలంగాణకు కరోనా… అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్

Posted: 03 Mar 2020 05:12 PM PST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్ తెలంగాణకు విస్తరించింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కరోనాపై ఆందోళనతో ఉన్నారు. కనీసం ఒకరికొకరు షేక్ హాండ్ ఇచ్చేందుకూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొరుగునే ఉన్న.. ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అప్రమత్తమైంది. ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది. ఈ వైరస్ కారణంగా రాష్ట్రానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ప్రజలు ఆందోళన పడవద్దని భరోసా […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan