telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


శాకాహారిగా మారిన రష్మిక

Posted: 03 Mar 2020 04:33 PM PST

హీరోయిన్ రష్మిక పూర్తి శాకాహారిగా మారింది. ఈ విషయాన్ని తనే అధికారికంగా ప్రకటించింది. రీసెంట్ గా తను పూర్తి శాకాహారిగా మారిపోయానని, ఇకపై వెజిటేరియన్ మాత్రమే తింటానని రష్మిక స్పష్టంచేసింది. “అవును.. నేను పూర్తిగా శాకాహారిగా మారిపోయాను. ప్రతి రోజూ నేను మాంసాహారం తింటాను. కానీ ఇప్పుడు పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి పూర్తి వెజిటేరియన్ లైఫ్ ప్రారంభిస్తున్నాను.” ప్రస్తుతం రష్మిక టాప్ లీగ్ లో ఉంది. తెలుగులో పూజా హెగ్డేకు పోటీనిస్తున్న ఒకేఒక్క హీరోయిన్ […]

భీష్మకు 10 రోజులు… బయ్యర్లకు లాభాలు

Posted: 03 Mar 2020 04:30 AM PST

నితిన్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది. అతడు నటించిన భీష్మ సినిమా తాజాగా 10 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఇప్పటికే బ్రేక్-ఈవెన్ క్రాస్ చేసిన ఈ సినిమా, ప్రస్తుతం బయ్యర్లందరికీ లాభాలు అందించే పనిలో పడింది. ఇది ఏదో ఒక ఏరియాకు పరిమితం కాదు. ఉత్తరాంధ్ర నుంచి ఓవర్సీస్ వరకు ప్రతి బయ్యర్ కు లాభాలు వస్తున్నాయి. 10 రోజుల్లో భీష్మ సినిమాకు వరల్డ్ వైడ్ 26 కోట్ల 28 లక్షల రూపాయల […]

లోకేష్ కోసం సమావేశం…. బ్రహ్మణి హైలైట్ అయింది….

Posted: 03 Mar 2020 04:30 AM PST

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చంద్రబాబు శకం అయిపోయినట్టే కనిపిస్తోంది. తాజాగా జరిగిన సోషల్ మీడియా గ్రూపు సమావేశంలో అంతా బ్రహ్మణిని హైలైట్ చేశారు. సోషల్ మీడియాలో పార్టీ వింగ్ కు దాదాపుగా అన్నీ తానై నడిపిస్తున్న ఆమెతో ఫొటోలు దిగేందుకు కార్యకర్తలంతా ఆరాటపడ్డారు. టీడీపీకి ఆమెనే ఓ భవిష్యత్ ఆశాకిరణంగా అనుకుంటున్నారు. మీడియాతో పాటు.. సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఇది ఏ మాత్రం ఊహించని చంద్రబాబు అండ్ కో.. కాస్త షాక్ తిని […]

నక్సలైట్ గా చిరంజీవి… కొరటాల కథ లీక్?

Posted: 03 Mar 2020 02:37 AM PST

కొరటాల శివ.. కమర్షియల్ సినిమాల్లో సామాజిక అంశాలను జోడించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు. కొరటాల తీసిన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు తాజాగా చిరంజీవితో తీసే సినిమాలోనూ కొరటాల శివ మరో సామాజిక అంశాన్ని తీసుకున్నారట.. ఇప్పుడా కథ వైరల్ గా మారింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'ఆచార్య' టైటిల్ అనుకుంటున్నట్టు మెగా స్టార్ చిరంజీవి తాజాగా తెలిపారు. ఈ కోవలోనే […]

రిచా బాటలో నికీషా పటేల్

Posted: 03 Mar 2020 02:35 AM PST

సినిమాలు చేస్తూ చేస్తూ ఒక్కసారిగా మానేసింది రిచా గంగోపాధ్యాయ. అట్నుంచి అటు అమెరికా వెళ్లిపోవడం, లవ్ లో పడిపోవడం, పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడిదే బాటలో మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె పేరు నికీషా పటేల్. పవన్ నటించిన కొమరం పులి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ, ఇప్పుడు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. లండన్ చెక్కేసింది. ఇక అన్నీ అక్కడే. “నమ్మండి, ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఇలా ఆలోచించటానికే […]

దారి తప్పిన భర్తకు… ‘దిశ’ చూపించిన భార్య!

Posted: 03 Mar 2020 01:33 AM PST

దిశ యాప్. మహిళల భద్రతలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు.. మహిళలకు రక్షణలో సంపూర్ణ భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపిస్తున్న ఈ యాప్ తో.. సత్ఫలితాలు రావడం మొదలైంది. దారి తప్పిన ఓ వ్యక్తిని.. ఏకంగా అతని భార్యే దిశ యాప్ ద్వారా పోలీసులకు పట్టించింది. ఈ ఘటన.. గుంటూరు జిల్లా పరిధిలో వెలుగుచూసింది. తాడేపల్లికి చెందిన ఓ విద్యార్థినిని.. అనిల్ అనే వ్యక్తి వేధించేవాడు. అతనికి అప్పటికే […]

తెలంగాణలో మరో సంచలనం… కారెక్కనున్న దుద్దిళ్ల?

Posted: 03 Mar 2020 01:30 AM PST

తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి.. మంచికి పోతే చెడు ఎదురైన పరిస్థితే కనిపిస్తోంది. ఎటు చూసినా.. ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటు సమయం నుంచి కునారిల్లిపోతోంది. టీఆర్ఎస్ కు దక్కుతున్న ప్రజాదరణ ముందు.. కేసీఆర్ రాజకీయ చతురత ముందు కాంగ్రెస్ ఎత్తులు తేలిపోతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీని తెలంగాణలో గట్టిగా నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. ఇంతలో.. మరో వార్త.. ఆ పార్టీని ఆందోళనలో పడేస్తోంది. ప్రస్తుతం తెలంగాణకు పీసీసీ చీఫ్ ను మార్చే కసరత్తు […]

చిరంజీవితో రఘువీరా… ఇదే ఇప్పుడు పిక్చర్ ఆఫ్ ఆంధ్రా

Posted: 03 Mar 2020 01:28 AM PST

చిరంజీవి.. కేంద్ర మంత్రిగా పని చేసి.. ఇప్పుడు రాజకీయాలు వదిలి.. తన పని తాను చేసుకుంటున్నారు. హాయిగా సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని మునుపటిలా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ ఫుల్ గా లైఫ్ కానిచ్చేస్తున్నారు. రఘువీరారెడ్డి.. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జాతీయ స్థాయిలోనూ పరిచయాలు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొసగలేక.. పొలం పనికి మాత్రమే పరిమితమయ్యారు. పల్లెటూరి జీవనాన్ని.. హాయిగా అనుభవిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటున్నారు. […]

Comments