Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Monday, March 23, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఏపీలో ఇంటింటికి సర్వే… బెజవాడలో 144 సెక్షన్‌ !

Posted: 23 Mar 2020 08:40 AM PDT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. విశాఖ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో స్ధానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటికి సర్వే చేస్తున్నారు. ప్యారిస్‌ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నెల 17, 18వ తేదీల్లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 18న జ్వరం రావడంతో అనుమానంతో […]

‘లాక్ డౌన్’ అంటే ఏంటో తెలుసా?

Posted: 23 Mar 2020 08:22 AM PDT

కరోనా.. కరోనా.. కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న పేరు. కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. అంతలా ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. చైనాలో కరోనాకు విరుగుడుగా అక్కడి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ చేపట్టింది. ఈ చర్య వల్ల చైనా కొత్తగా కరోనా కేసుల పెరుగుదలను అరికట్టగలిగింది. లాక్‌డౌన్‌ చర్య సత్ఫలితాలిస్తుండటంతో అన్ని దేశాలు ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయి. అసలు లాక్‌డౌన్‌ […]

మహేష్ పై మండిపడుతున్న నాగార్జున

Posted: 23 Mar 2020 08:06 AM PDT

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనికి కింగ్ నాగార్జున హర్ట్ అయినట్లు తెలుస్తోంది. తన సినిమాలతో బీజీగా ఉండే సూపర్ స్టార్.. కింగ్ ను హర్ట్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా.. అదేమీ లేదండీ.. ఓ సినిమా దర్శకుడి విషయంలో వచ్చిన క్లాష్ వీరిద్దరి మధ్య గ్యాప్ కు దారితీసేలా ఉండటంతో అసలు విషయం తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. దర్శకుడు పరశురామ్ నాగార్జున కుమారుడు నాగచైతన్యతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ […]

బయట తిరిగితే ఊరుకోం

Posted: 23 Mar 2020 05:26 AM PDT

తెలంగాణలో స్టేజ్ 3 రానివ్వొద్దు ఇండ్లు దాటి బయటకు రాకండి రాష్ట్రంలో 33 కరోనా పాజిటీవ్ కేసులు వైద్యారోగ్య మంత్రి ఈటెల కరోనా మహమ్మారిని కట్టడి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించడం పట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజు చూపించిన స్పూర్తి ఇవాళ ఏమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల […]

ఈసారి వర్మకు బాగానే మద్దతు

Posted: 23 Mar 2020 05:18 AM PDT

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ వేశాడంటే దానికి ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తుంటాయి. వర్మ ట్వీట్లపై బూతులతో విరుచుకుపడే బ్యాచ్ కూడా ఉంది. అలాంటి వర్మ నుంచి సమాజానికి పనికొచ్చేదిగా, కాస్త మంచి విషయం అనిపించే ట్వీట్ ఒకటి వచ్చింది. దీంతో చాన్నాళ్ల తర్వాత వర్మ వేసిన ఓ ట్వీట్ కు జనాల నుంచి మంచి స్పందన, మద్దతు వచ్చింది. అందుకే ఇదొక విశేషమైంది. జనతా కర్ఫ్యూను దేశమంతా గొప్పగా పాటించింది. […]

లాక్ డౌన్ లో దర్శకురాలి చిట్కాలు…

Posted: 23 Mar 2020 05:13 AM PDT

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. ఈనెల 31 వరకు అంటే మరో వారం రోజుల పాటు అంతా ఇళ్లలోనే ఉండాలి. బయట తిరగకూడదు. షాపింగ్స్ మాల్స్, థియేటర్లు, రవాణా వ్యవస్థ అన్నీ బంద్ అన్నమాట. మరోవైపు కూరగాయల్లాంటి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. మరి ఇలాంటి టైమ్ లో బతకడం ఎలా. దీనికి చక్కటి చిట్కా చెబుతోంది దర్శకురాలు నందినీరెడ్డి. లాక్ డౌన్ టైమ్ లో తక్కువ వనరులతో ఎక్కువగా, గొప్పగా బతకాలంటే ఒక పూట […]

చేతిలో 2 రీమేక్స్… ఓటు దేనికి?

Posted: 23 Mar 2020 05:10 AM PDT

తెలుగు సినిమా రీమేక్స్ కు ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డికి రీమేక్ గా హిందీలో వచ్చిన కబీర్ సింగ్ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో మరోసారి తెలుగు రీమేక్స్ కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన రెండు సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నాడు. వాటిలో ఒకటి డియర్ కామ్రేడ్ కాగా, రెండోది భీష్మ సినిమా. ఈ రెండు […]

మనసున్న ప్రకాష్ ‘రాజు’

Posted: 23 Mar 2020 12:53 AM PDT

సినిమా నటుడు ప్రకాష్ రాజ్ తెరపై విలనిజాన్ని పండిస్తాడేమో కాని బయట మాత్రం ఎంతో మంచి మనసున్న వ్యక్తి. గ్రామాలను దత్తత తీసుకోవడం నుంచి తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వాళ్లకు చేతనైనంత చేయడం ఆయనకు అలవాటు. ఇదే విషయాన్ని పలుమార్లు ఇతర నటులు కూడా చెప్పారు. బయట ప్రకాష్ రాజ్ దాతృత్వాన్ని చూసి అందరూ మెచ్చకుంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా వ్యాపారాలు, సినిమాలు, ఆటలు బంద్ అయిన నేపథ్యంలో ఎంతో మంది పనుల్లేక […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan