Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Saturday, March 21, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


తెలంగాణలో 24 గంటల పాటు కర్ఫ్యూ

Posted: 21 Mar 2020 05:01 PM PDT

అవసరమైతే షట్‌డౌన్ చేస్తాం వైరస్ ఉధృతమైతే ఇంటికే రేషన్ విలేకరు సమావేశంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తెలంగాణలో కర్ఫ్యూ 24 గంటల పాటు పాటించాలని కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం […]

ప్లేయర్ల ప్రాణాలతో చెలగాటమా?

Posted: 21 Mar 2020 04:45 PM PDT

బ్యాడ్మింటన్ సమాఖ్యను ప్రశ్నించిన సైనా-కశ్యప్ కరోనా ముప్పు ఉన్నా పోటీల నిర్వహణపై ఆందోళన భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, డబుల్స్ స్పెషలిస్ట్ అశ్వని పొన్నప్ప అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్యపై మండిపడుతున్నారు. ప్లేయర్ల విలువైన ప్రాణాలతో నిర్వాహక సంఘం ఆటలాడుతోందని, కరోనా వైరస్ హెచ్చరికలు ఉన్నా ఆల్ ఆంగ్లండ్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ద్వారా.. ప్లేయర్ల జీవితాలను వైరస్ కు ఎరగావేయాలని నిర్ణయించారా అంటు ప్రశ్నించారు. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో మార్చి […]

ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర… భగ్నం చేసిన పోలీసులు

Posted: 21 Mar 2020 04:34 PM PDT

ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి హత్యకు కొందరు కుట్న పన్నారు. ఈ కుట్రను కడప జిల్లా చిన్న చౌక్‌ పోలీసులు భగ్నం చేశారు. ఏవి సుబ్బారెడ్డిని హత మార్చేందుకు 50 లక్షలకు ముగ్గురు వ్యక్తులు డీల్ కుదుర్చుకున్నారు. నిందితులు ముగ్గురు కర్నూలు జిల్లాకు చెందిన వారే. కడపలో హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న సమయంలో చాకచక్యంగా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 3.20 లక్షల రూపాయల నగదు, […]

రవిప్రకాష్ ఇంట్లో సోదాలు…. కారణం ఇదే !

Posted: 21 Mar 2020 04:23 AM PDT

టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు రవిప్రకాశ్ చేసిన దందాలు, మోసాలపై ఇప్పటికీ బాధితులు కథలు కథలుగా చెబుతూనే ఉంటారు. టీవీ9 లాంటి అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని రవిప్రకాష్ ఆడిన ఆటలకు చెక్ పడింది. కొద్దిరోజుల క్రితమే ఆయనను తొలగించి బయటకు పంపారు. మోసం, మనీ లాండరింగ్ లాంటి కేసులను ఎదుర్కొంటున్నాడు రవిప్రకాష్. అయితే కేంద్రంలోని బీజేపీ సహా జాతీయ పార్టీలతో కలిసి మరో చానెల్ ను లాంచ్ చేసే పనిలో ఉన్న రవిప్రకాశ్ తన ప్రత్యర్థులను మరోసారి […]

నిమ్మగడ్డ రమేశ్, చంద్రబాబైనా… ఆ లేఖతో తప్పించుకోలేరు

Posted: 21 Mar 2020 04:15 AM PDT

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసిన లేఖ ఏపీ సర్కారును కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ లేఖను తాను రాయలేదన్న రమేశ్ కుమార్ మాటను పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం దానిపై విచారణ జరిపేందుకు నడుం బిగించింది. నిమ్మగడ్డ పేరుతో విడుదలైన లేఖను ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు తప్పవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం […]

మెట్రో పూర్తిగా…. ఎంఎంటీఎస్ పాక్షికంగా బంద్

Posted: 21 Mar 2020 04:05 AM PDT

కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రేపు మెట్రో రైలు సేవలను పూర్తిగా నిలివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అవగాహన కల్పిస్తున్న మెట్రో.. రేపు పూర్తిగా రైళ్లు నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకే అయినా.. మెట్రో రైళ్లు మాత్రం రోజంతా నడువవు. అలాగే […]

కిమ్‌కి కరోనా కంటే ఇదే ఎక్కువై పోయింది..!

Posted: 21 Mar 2020 04:01 AM PDT

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుత కాలపు నియంత అయిన కిమ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెది మరో దారి అన్నట్లు.. అతడి రూటే సపరేటు. అయితే ఇదంతా మామూలు సమయంలో చేసుకుంటే ఓకే.. కానీ ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే.. కిమ్‌కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కువయ్యాయి. చైనాకి ఆనుకొని ఉన్న […]

ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

Posted: 21 Mar 2020 12:40 AM PDT

కరోనాపై పోరాటానికి ప్రధాని మోడీ ఈ నెల 22 (ఆదివారం) జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ఇవాళ […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan