Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Friday, March 20, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఆచార్యలో మరో హీరోయిన్

Posted: 20 Mar 2020 09:48 AM PDT

ఆచార్య ప్రాజెక్ట్ నుంచి త్రిష తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లను ప్రయత్నించి ఎట్టకేలకు మరోసారి కాజల్ కే ఫిక్స్ అయ్యారు మేకర్స్. అయితే ఇప్పుడీ సినిమాకు మరో హీరోయిన్ కూడా కావాలి. ఆమె ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే కియరా అద్వానీ, రష్మిక పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆచార్యలో 10 నిమిషాల ఫిమేల్ క్యారెక్టర్ ఉంది. ఈ పాత్రను ఎవరైనా స్టార్ హీరోయిన్ పోషిస్తే బాగుంటుంది. అందుకే కియరా, రష్మికలో ఒకర్ని తీసుకోవాలనేది […]

కాల్షీట్లు కేటాయించిన శృతిహాసన్

Posted: 20 Mar 2020 09:40 AM PDT

పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారనే సంగతి తెలిసిందే. కాటమరాయుడు తర్వాత ఇలా మరోసారి వకీల్ సాబ్ రూపంలో పవన్-శృతి కలుస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ, కాల్షీట్ల విషయంలోనే మరోసారి ఈ కాంబినేషన్ అనుమానంలో పడింది. ప్రస్తుతం శృతిహాసన్ చాలా బిజీగా ఉంది. ఇంత బిజీ టైమ్ లో కూడా దిల్ రాజు అడిగాడు కాబట్టి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఏప్రిల్ రెండో వారం నుంచి […]

మరో మెరుపు పాత్రలో హెబ్బా

Posted: 20 Mar 2020 06:09 AM PDT

ఎప్పుడో 30 దాటేసింది హెబ్బా. ఆమెకిప్పుడు స్టార్ హీరోల సరసన పాత్రలు రావడం కష్టం. కుర్రహీరోల సరసన నటిద్దామంటే ఏజ్ బార్ అయిపోయింది. దీంతో ప్రత్యేక పాత్రలు, గీతాలకే పరిమితమైపోయింది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా రెడ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది హెబ్బా పటేల్. తమిళ్ లో సూపర్ హిట్టయిన తడమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది రెడ్. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు హీరో రామ్. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్ర ఇంట్రడక్షన్ […]

ఎంపీ దుష్యంత్‌కు కరోనా…. పార్లమెంట్‌లో కలవరం

Posted: 20 Mar 2020 06:01 AM PDT

పార్లమెంటులో కరోనా కలకలం. దేశమంతా ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఓ వైపు చర్చించుకుంటున్న తరుణంలో.. ఎంపీల్లోనే ఒకరికి కరోనా సోకడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొన్ని రోజులుగా లండన్‌లో ఉన్న కనికా మార్చి 15న లక్నోకు వచ్చింది. లక్నో చేరుకున్న తర్వాత కనికా తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. దానికి చాలా […]

పోలవరం నిర్మాణం ఇప్పుడు గాడిన పడింది

Posted: 20 Mar 2020 03:00 AM PDT

పోలవరం పరుగులు పెడుతోంది. అటు నిర్మాణ పరంగానూ ఇటు ఇంజనీరింగ్ అనుమతుల్లోనూ గోదావరి వరద ప్రవాహాన్ని తలపించే విధంగా ప్రాజెక్ట్ వేగం అందుకుంది. సకాలంలో పనులు పూర్తిచేసేందుకు ఆగమేఘాల మీద ఉరకలువేస్తోంది. రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనులను పూర్తిస్థాయి ఇంజనీరింగ్, శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి ప్రాధాన్యత ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, లోటుపాట్లు, ముఖ్యంగా అశాస్త్రీయ (నాన్-ఇంజనీరింగ్) పద్ధతిలో […]

తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

Posted: 20 Mar 2020 03:00 AM PDT

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల విస్తృతంగా వ్యాపిస్తోంది. తెలంగాణలోని కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియన్ల వల్ల ఇప్పటికే పలువురికి కరోనా సోకి ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిపై తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో కరోనా విజృంభించింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా.. తాజాగా జైపూర్ లో ఇటాలియన్ కరోనాతో చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల […]

మన దేశంలో కరోనాతో ఐదో మరణం

Posted: 20 Mar 2020 02:57 AM PDT

భారత దేశంలో కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటివరకూ నలుగురు కరోనా కారణంగా చనిపోగా శుక్రవారం మరొకరు ఈ కరోనాకు బలి అయ్యారు. దేశంలో స్టేజ్ లు దాటుకుంటూ చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ధాటికి ఇప్పుడు అంతా ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా నలుగురు చనిపోయారు. తాజాగా ఐదో ప్రాణం పోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఇటలీ టూరిస్ట్ ఒకరు మృతి చెందారు. దీంతో కోవిడ్-19 కారణంగా ఐదుగురు […]

తెలంగాణ పదవ తరగతి పరీక్షలు వాయిదా

Posted: 20 Mar 2020 02:10 AM PDT

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల ఆరోగ్యంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్షను యధాతథంగా నిర్వహించాలని.. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను మాత్రం […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan