telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


కుల అఘాయిత్యాలు, సామాజిక మాధ్యమం

Posted: 02 Mar 2020 04:32 PM PST

దళితుల మీద తరచుగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషాదకర పరిస్థితి గురించే డా. బి.ఆర్. అంబేద్కర్ అనేక దశాబ్దాల కిందే ఆవేదన వ్యక్తం చేశారు. అంటరాని వారి మీదే అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయని ఆయన నిలదీశారు. ఈ విషాదం ఈ మధ్య మరింత తీవ్రంగా కొనసాగుతోంది. దళితుల మీద అత్యాచారాలు ఒక జాతరలా సాగుతున్నాయి. ఒక వేపున ఈ అఘాయిత్యాలను చూసి ఆనందించే వారు ఉన్నారు. మరో వేపున ఇది అగ్రకులాధిపత్యానికి సంకేతం అన్న వాస్తవమూ […]

జగన్ సలహాదారుగా సుభాష్… ఈయన హిస్టరీ తెలుసా?

Posted: 02 Mar 2020 06:40 AM PST

పరిపాలనలో అనుభవం ఉన్న వారిని తన సలహాదారులుగా నియమించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. అందులో భాగంగా.. సీనియర్ అధికారి, కేంద్ర స్థాయిలో పని చేసిన సుభాష్ చంద్ర గార్గ్ ను.. తన అడ్వైజర్ గా అపాయింట్ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు కీలకమైన నిధుల సమీకరణ బాధ్యతలను ఆయన చేతికి ఇచ్చారు. వేల కోట్ల రూపాయలతో ముడి పడి ఉన్న ఈ వ్యవహారాన్ని జగన్.. ఆయనకే ఎందుకు అప్పగించారు.. అసలు సుభాష్ చంద్ర గార్గ్ కు ఆ […]

రజినీతో బీజేపీ పొత్తు… తమిళనాట ఫలితం ఇస్తుందా?

Posted: 02 Mar 2020 06:30 AM PST

తమిళనాడులో రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖాయమైంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. ఈ దిశగా స్పష్టత ఇస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి రజినీ పూర్తి రాజకీయ నాయకుడిగా మారిపోతారన్న మాట.. తమిళ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజినీ రాజకీయాల్లోకి వచ్చాక.. ఆయన పార్టీతో తాము పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్టు నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. […]

సొంతంగానే పరీక్షలు రాస్తాం… వీణా వాణి

Posted: 02 Mar 2020 06:26 AM PST

తెలంగాణకు చెందిన అవిభక్త కవలలు వీణా వాణి.. పట్టుదలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. తలలు అతుక్కుని పుట్టిన ఆ ఇద్దరు అమ్మాయిలు.. శారీరక సమస్యలు అధిగమిస్తూ.. చదువుపై ప్రదర్శిస్తున్న శ్రద్ధతో అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పూర్తి చేసే దశలో ఉన్న వీణావాణి.. పరీక్షలను తాము సొంతంగానే రాస్తామని.. ఎవరి పరీక్షలను వారే రాసుకుంటామని.. తమకు ఏ ట్యూటర్ అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టేట్ హోంలో ఉంటున్న ఈ ఇద్దరిని అధికారులు గత ఏడాది […]

చాలా కాలానికి తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మాట..!

Posted: 02 Mar 2020 06:24 AM PST

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారానికి రావడంలో.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ కూడా కాస్త ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్, టీడీపీ సంప్రదాయ ఓట్లు కూడా.. టీఆర్ఎస్ కు బదలాయింపు కావడంలో ఈ హామీ పని చేసిందన్న అభిప్రాయం అప్పట్లో వినిపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో తొలి దశను బాగానే అమలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో అయితే.. మంత్రిగా కేటీఆర్ చేసిన శంకుస్థాపనలు, శిలాఫలకాల […]

టీడీపీలో స్పష్టమైన మార్పు… ఇదే తాజా ఉదాహరణ

Posted: 02 Mar 2020 06:06 AM PST

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం సంధికాలంలో ఉంది. తెలంగాణలో దాదాపుగా కనుమరుగై… ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోసం పోరాడుతున్న ఆ పార్టీ… అస్తిత్వ ముప్పుపై ఆందోళన చెందుతోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలు.. వైసీపీకి 150కి పైగా సీట్లు కట్టబెట్టి.. క్లీన్ స్వీప్ లాంటి ఫలితాలు ఇచ్చారు. తెలుగుదేశాన్ని పాతిక స్థానాల లోపునకే పరిమితం చేసి.. ఆ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. అయినప్పటికీ చంద్రబాబు మేలుకోలేదన్న ఆరోపణలు.. స్వయంగా ఆ పార్టీ […]

కేసీఆర్ సంకల్పం… వాళ్లకు అధికారులు షాకిచ్చారు

Posted: 02 Mar 2020 05:39 AM PST

హరితహారం.. తెలంగాణ సీఎం కేసీఆర్ మానస పుత్రిక. మదిలోంచి వచ్చిన పథకం. అందుకే ఆయన దానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కోట్ల మొక్కలు నాటినా కనీసం వందల్లో బతికినా కేసీఆర్ లక్ష్యం నెరవేరినట్టే. అయితే తాజాగా హరితహారంలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్ల పోస్టులు ఊడిపోతాయని కేసీఆర్ సర్కారు అల్టీమేటం జారీ చేసింది. అయితే అయినా కొందరిలో అదే నిర్లక్ష్యం. మానవాళి మనుగడకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లపై అదే నైరాశ్యం. వాటిని తుదిముట్టించి బిల్డింగ్ […]

ఆర్ఆర్ఆర్: టైటిల్ ఇదే.. వైరల్

Posted: 02 Mar 2020 05:33 AM PST

దేశంలోనే ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఎన్టీఆర్, చరణ్ లాంటి అగ్రహీరోలు, బాహుబలి దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఈ మూవీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు అసలు టైటిల్ ఏంటో చెప్పకుండా రాజమౌళి సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి లీక్స్ బయటకు వచ్చాయి. చిత్రం ప్రారంభమై సంవత్సరం గడిచిపోయింది. జూలై 30 నుంచి 2021 […]

Comments