Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Wednesday, March 18, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత..!

Posted: 18 Mar 2020 07:09 AM PDT

కరోనా ప్రభావంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్టే విధించమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో ఈసీ ఎన్నికల కోడ్ ఎత్తేసింది. కాగా, ఎన్నికల కోడ్ ఎత్తివేత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి రానుంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకి లేకుండా పోయింది. […]

కరోనా ఎఫెక్ట్ : విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Posted: 18 Mar 2020 06:00 AM PDT

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. పలు క్రీడా ఈవెంట్లు, సభలు, సమావేశాలు రద్దు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల విద్యాసంస్థలు, బార్లు, మాల్స్, థియేటర్లు ఈ నెల 31 వరకు మూసేయాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటంతో అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపటి (మార్చి 19) నుంచి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు […]

“సునిశిత”మైన అంశంపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

Posted: 18 Mar 2020 03:45 AM PDT

హీరోయిన్లుగా మారిన తర్వాత పుకార్లు సహజం. ఫలానా సినిమా ఆఫర్ ఎగరేసుకుపోయిందంట అనే పుకారుతో పాటు.. ఫలానా వ్యక్తితో డేటింగ్ అంటగా అనే రూమర్ వరకు ఎన్నో పుకార్లు వినిపిస్తుంటాయి. చాలా పుకార్లను చాలామంది హీరోయిన్లు లైట్ తీసుకుంటారు. కానీ కొన్ని రూమర్లు మాత్రం శృతిమించిపోతాయి. అలాంటప్పుడు మాత్రం హీరోయిన్లు బయటకు రాక తప్పదు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా అదే చేసింది. ఈమధ్య సునిశిత్ అనే వ్యక్తి లావణ్య త్రిపాఠిపై అవాకులు చవాకులు పేలుతున్నాడు. తామిద్దరం […]

టాలీవుడ్ ప్రముఖుల సెల్ఫ్-క్వారంటైన్

Posted: 18 Mar 2020 02:52 AM PDT

కరోనా అనేది ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అందుకే ఎవరికి వారు ఇళ్లలో ఉండడం సురక్షితం అనేది అంతా చెప్పే మాట. ఇప్పుడిదే మాటను సెలబ్రిటీలు చెబుతున్నారు. కొంతమంది ఆచరించి చూపిస్తున్నారు కూడా. ఇందులో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా ఉంది. రీసెంట్ గా హాలిడే ట్రిప్ పూర్తిచేసుకొని విదేశాల నుంచి వచ్చిన ప్రగ్యా జైశ్వాల్, తనకుతాను స్వీయ నిర్బంధం విధించుకుంది. 2 వారాల పాటు ఎవర్ని కలవకుండా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఇలా […]

వరల్డ్ ఫేమస్ లవర్ ఫైనల్ కలెక్షన్

Posted: 18 Mar 2020 02:50 AM PDT

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా మొదటి రోజే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. స్టోరీలైన్ వీక్ గా ఉండడంతో పాటు చాలా చోట్ల అర్జున్ రెడ్డి ఛాయల్ని రిపీట్ చేయడంతో సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ క్రమంలో తాజాగా తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది వరల్డ్ ఫేమస్ లవర్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం 8 కోట్ల […]

మతతత్వాన్ని ఓడించిన స్థానిక శక్తి

Posted: 18 Mar 2020 01:38 AM PDT

ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై వ్యాఖ్యాతల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయినాయి. ఈ అభిప్రాయాల్లో చాలావరకు విమర్శనాత్మకమైనవే. తాము నిఖార్సైన సెక్యులర్ వాదులం అనుకునే వారు ఈ విజయాన్ని సానుకూలంగా చూడలేదు. ఈ విజయం రాజకీయంగా తమకు పొసగనిది అనుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని అంశాలపై ఉన్న వైఖరి ప్రభావం సెక్యులరిజం మీద ఉంటుంది కనక వీరు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ విమర్శ చేసే వారు షాహీన్ బాగ్ విషయంలో ఆమ్ […]

ధోనీకి ఇక జట్టులో చోటు కష్టమే – వీరేంద్ర సెహ్వాగ్

Posted: 18 Mar 2020 01:30 AM PDT

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌ మాన్‌గా జట్టుకు సేవలందించిన ధోనీకి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పలువురు యువ క్రికెటర్లు ఉన్నారని సెహ్వాగ్ చెప్పాడు. టీం ఇండియాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌‌లోనూ రాణిస్తున్న విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత ఇప్పటి వరకు ధోనీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ […]

కరోనా భయంతో బీసీసీఐ వర్క్ ఫ్రమ్ హోమ్

Posted: 17 Mar 2020 10:39 PM PDT

అదేదారిలో బెంగాల్ క్రికెట్ సంఘం ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ప్రధానకార్యాలయం…కరోనా వైరస్ భయంతో తలుపులు మూసుకొంది. ముంబై వాంఖెడీ స్టేడియంలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. ఎప్పుడూ వచ్చేవారు, పోయేవారితో కళకళలాడుతూ కనిపించే బీసీసీఐ ఇప్పుడు అసలు ఉందా…లేదా అన్నట్లుగా మారిపోయింది. బీసీసీసీ తన ప్రధాన కార్యాలయానికి తాళాలు వేసి…తన సిబ్బందిని ఇంటినుంచే పని చేయాలంటూ …వర్క్ ప్రమ్ హోమ్ వెసలు బాటు కల్పించింది. బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan