telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఎన్నికలకు కరోనా ఉంటుందా… అమరావతి ఆందోళనలకు ఉండదా?

Posted: 17 Mar 2020 05:59 AM PDT

చంద్రబాబు రెండు నాలుకల సిద్ధాంతం.. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యింది. ఆ సిద్ధాంతం.. చివరికి టీడీపీ పుట్టి ముంచింది. తెలంగాణలో చిరునామా లేకుండా చేసింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోనూ అంతర్థానమయ్యే దశకు చేర్చింది. ఇలాంటి సందర్భాల్లోనూ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే సమర్థుడు చంద్రబాబు అని మరోసారి రుజువైంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై.. ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంపై చంద్రబాబు స్పందించిన తీరు చూస్తే.. రాజకీయాలపై కాస్తంత అవగాహన ఉన్న […]

ఈసీ రమేశ్ ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన గవర్నర్?

Posted: 17 Mar 2020 01:19 AM PDT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై సీఎం జగన్ సీరియస్ అయ్యి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ తాజాగా ఏపీ ఎన్నికల కమిషనర్ ను పిలిపించి మాట్లాడారు. ఆయన వివరణ కోరారు. కరోనాపై కేంద్రం సూచనలు, నివేదిక ఆధారంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రమేశ్ కుమార్ చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ నిర్ణయం ప్రకటించే ముందు కేంద్రంలోని ఆరోగ్య కార్యదర్శిని, రాష్ట్ర […]

నిజమైన శ్రీమంతుడు

Posted: 17 Mar 2020 01:17 AM PDT

జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన మూలాలను మరువకూడదు. మన ఇల్లు మన ఊరు అనేవి ఎప్పటికీ ఉండే జ్ఞాపకాలు. అందుకే మనకు ఎంతో ఇచ్చిన ఊరికి ఎంతో కొంత ఇవ్వాలనే కాన్సెప్టుతో శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది. కాని రియల్ లైఫ్‌లో కూడా కొంత మంది శ్రీమంతులు ఉంటారు. అలాంటి వ్యక్తే కామిడి నర్సింహారెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా వర్థన్నపేట నియోజకవర్గంలోని దమ్మన్నపేటకు చెందిన నర్సింహారెడ్డి తన ఊరికి ఏమన్నా చేయాలని తలంచారు. వెంటనే 25 […]

విధినే ఎదురించి విజేతగా నిలిచిన ధీర

Posted: 17 Mar 2020 01:15 AM PDT

స్పూర్తి దాయకం మానసీ జీవితం కృత్రిమ కాలితో ప్రపంచ టైటిల్ నెగ్గిన మానసీ జోషీ పీవీ సింధు…మానసీ జోషీ. ఇద్దరూ ఒకే వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలలో విశ్వవిజేతలుగా నిలిచిన భారత మహిళలు. ఒకరు రెండుకాళ్లతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఆడి టైటిల్ నెగ్గితే…మరొకరు కృత్రిమ కాలితో విశ్వవిజేతగా నిలిచిన ధీర. అయితే…రెండుకాళ్ళున్న పీవీ సింధుకు ఇచ్చిన ప్రచారం, ప్రాధాన్యం.. మన మీడియా…ఒంటికాలికి తోడు కృత్రిమకాలు ధరించిన మానసీ జోషీకి ఇవ్వలేదు. అయితేనేం…విధి చిన్నచూపు చూసినా, అదృష్టం […]

అనిల్ రావిపూడిని అవమానించిన ఆ టీవీ యజమాని ఎవరు?

Posted: 17 Mar 2020 01:12 AM PDT

అనిల్ రావిపూడి తొలిసారిగా డైరెక్ట్ చేసిన సినిమా 'పటాస్'. కళ్యాణ్ రామ్ హీరోగా తీసిన ఈ సినిమాతోనే రావిపూడి టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఘనవిజయంతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా తీశాక నిర్మాతలు, పత్రిక విలేకరుల కోసం స్పెషల్ షోలు వేశారట.. అప్పుడు ఓ టీవీ చానెల్ యజమాని వచ్చి 'ఇది సినిమానేనా.. ఇలాంటి సినిమా కూడా తీస్తారా? చెత్త సినిమా.. ఒక్క రోజు కూడా ఆడదు.. విడుదల చేసి కూడా వేస్ట్' అంటూ […]

ఆఫీస్ క్లోజ్ చేసిన పూరి జగన్నాధ్

Posted: 17 Mar 2020 01:10 AM PDT

కరోనా ఎఫెక్ట్ తో పూరి కనెక్ట్స్ ఆఫీస్ క్లోజ్ అయింది. ఈ మేరకు దర్శక-నిర్మాత పూరి జగన్నాధ్ నుంచి అఫీషియల్ నోట్ ఒకటి వచ్చింది. తమ సంస్థ నుంచి అడ్మినిస్ట్రేటివ్ వర్క్, ప్రొడక్షన్ వర్క్ ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ప్రకటించాడు పూరి. కరోనా కారణంగా కలిసి పనిచేయడం ఆపేశామని, కొన్నాళ్ల పాటు ఆఫీస్ కు తాళాలు వేస్తున్నామంటూ… పూరి జగన్నాధ్, చార్మి పేరిట ఓ లెటర్ బయటకొచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా […]

భారతదేశంలో మూడో కరోనా మరణం

Posted: 17 Mar 2020 12:48 AM PDT

చైనాలో పుట్టి ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ ధాటికి అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ భారత్ లోనూ ప్రభావం చూపుతోంది. తాజాగా భారత్ లో మరో వ్యక్తి కరోనా కారణంగా మరణించాడు. కరోనా సోకి ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మరణంతో భారత్ లో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. మొదటి మరణం కర్ణాటకలోని కలబుర్గికి […]

క్వారంటైన్ లో టాలీవుడ్ హీరోయిన్

Posted: 17 Mar 2020 12:45 AM PDT

మొన్నటివరకు ఇండోనేషియా, మలేషియాలో చక్కగా ఎంజాయ్ చేసింది ప్రగ్యా జైశ్వాల్. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టింది. అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఇక తన హాలిడే ట్రిప్ చాలించి ఇండియాకొచ్చిందో అప్పుడు ప్రగ్యాకు కష్టాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా విదేశాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కర్ని నిశితంగా పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రగ్యా జైశ్వాల్ ను కూడా అధికారులు పరీక్షించారు. కాస్త టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టు తేలడంతో.. 14 రోజుల పాటు […]

Comments