telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఎన్నికల వేళ… ఏమిటిది పవన్ కల్యాణ్ గారూ..!

Posted: 15 Mar 2020 06:40 AM PDT

పవన్ కల్యాణ్ రాజకీయ అయోమయ విధానాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన.. వెతుక్కోవాల్సిన పని లేదు. ఆ అవకాశాన్ని ఆయనే పదే పదే ఇచ్చేస్తుంటారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుతున్న వేళ.. రాజమహేంద్రవరం వేదికగా ఆయన నిర్వహించిన ”మన నది మన నుడి” కార్యక్రమం ఈ కోవలోకే వస్తుంది. వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో.. రాష్ట్రమంతా రాజకీయ వేడి అలుముకున్న వేళ.. ఈ కార్యక్రమంతో.. పవన్ జనం ముందుకు వచ్చారు. ప్రజల […]

మహేంద్రసింగ్ ధోనీ పీఛే ముడ్

Posted: 15 Mar 2020 06:38 AM PDT

చెన్నై నుంచి రాంచీకి తిరుగుటపా కరోనా వైరస్ హెచ్చరికతో ప్రాక్టీస్ కు విరామం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రీ-ఎంట్రీ ఎప్పుడాఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. గత ఏడుమాసాలుగా అంతర్జాతీయ క్రికెట్ కు తనకుతానుగా దూరమై కుటుంబవ్యవహారాలకు మాత్రమే పరిమితమైన ధోనీ…ఐపీఎల్ 13వ సీజన్ ద్వారా రీ-ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ లో తన హోంగ్రౌండ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా…మార్చి 3 నుంచి సురేష్ రైనా, అంబటి రాయుడు లాంటి […]

అనుమతి లేకుండా…. ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు !

Posted: 15 Mar 2020 06:35 AM PDT

కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొందరు హైదరాబాద్ లో నివాసం ఉంటుండడం సరికాదని.. రాష్ట్ర విభజన తర్వాత ఆరేళ్లు గడిచిందని ఆమె గుర్తు చేస్తున్నారు. వారాంతాల్లో హైదరాబాద్ లో ఉండడం.. కాదంటే ఢిల్లీకి వెళ్లడం లాంటి చర్యలను ఇక ఆపాల్సిందిగా ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అతి సున్నితమైన పరిస్థితులు ఉండడానికి తోడు.. స్థానిక సంస్థల ఎన్నికల […]

ఐపీఎల్ వాయిదాతో ఎంత నష్టం?

Posted: 15 Mar 2020 06:30 AM PDT

కరోనా వైరస్ దెబ్బతో కోట్ల రూపాయల దెబ్బ కంటికి ఏమాత్రం కనిపించని కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ ఆర్థికవ్యవస్థలు మాత్రమే కాదు…అగ్రరాజ్యాలు అమెరికా, ఫ్రాన్స్, చైనా, జపాన్, ఇంగ్లండ్ తో పాటు… భారత్, ఇరాన్ లాంటి దేశాలు సైతం కుదేలైపోతున్నాయి. ఇంతకాలమూ గ్లోబలైజేషన్ అంటూ సరిహద్దులు బార్లా తెరిచిన దేశాలన్నీ… కరోనా వైరస్ తమ తమ దేశాలలోకి ఏ రూపంలో చొరబడుతుందోనన్న భయంతో ఇప్పుడు తలుపులు మూసేసుకొంటున్నాయి. విమాన సర్వీసులు రద్దు చేయటమే కాదు… విదేశీయులకు వీసాలు ఇవ్వటాన్ని […]

కరోనా ఎఫెక్ట్: మాజీ సీఎం కొడుకు పెళ్లి రద్దు?

Posted: 15 Mar 2020 06:25 AM PDT

కరోనా వైరస్ భారత్ కు వచ్చేసింది. కర్ణాటకలో తొలి కరోనా మృతి సంభవించింది. ఢిల్లీలో రెండో మరణం నమోదైంది. 97మందికి పైగా దేశంలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు. అన్నింటికి సెలవులు ఇచ్చేశారు. కరోనా కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ ఎఫెక్ట్ తాజాగా మాజీ సీఎం కుమారుడి వివాహానికి కూడా తాకింది. జేడీయూ అధినేత దేవే గౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి రద్దు చేయాలని దాదాపు […]

ఇండియన్ సాకర్ లీగ్ లో ఏటీకే హ్యాట్రిక్

Posted: 15 Mar 2020 06:20 AM PDT

ఫైనల్స్ లో చెన్నైయాన్ పై 3-1 గోల్స్ తో గెలుపు ఇండియన్ సాకర్ లీగ్ 2020 సీజన్ విజేతగా సౌరవ్ గంగూలీకి చెందిన అట్లెటికో కోల్ కతా మూడోసారి నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. గోవాలోని ఫడోద్రా నెహ్రూ స్టేడియం గేట్లు మూసి, అభిమానులు లేకుండా నిర్వహించిన ఫైనల్సో మాజీ చాంపియన్ చెన్నైయాన్ ను 3-1 గోల్స్ తో కోల్ కతా చిత్తు చేసింది. ఏకఫక్షంగా సాగిన ఈ టైటిల్ సమరంలో కోల్ కతా జట్టుకు ఎదురేలేకపోయింది. ఆట 10వ […]

ఈ సినిమాలు చెల్లాచెదురయ్యాయి

Posted: 15 Mar 2020 05:30 AM PDT

ఎన్నోసార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది నిశ్శబ్దం. మరోవైపు మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమౌతున్న ‘ఉప్పెన’ కూడా సిద్ధమైంది. అటు చాలా కష్టపడి రానా చేసి ‘అరణ్య్’ కూడా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబైంది. వీటితో పాటు రామ్ ‘రెడ్’ కూడా రెడీ ఫర్ రిలీజ్ అంటోంది. ఏప్రిల్ లో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలన్నీ ఇప్పుడు చెల్లాచెదురయ్యాయి. అవును.. కరోనా వల్ల మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన V, ఒరేయ్ బుజ్జిగా, […]

తెలుగు సినిమాపై కరోనా దెబ్బ

Posted: 15 Mar 2020 12:51 AM PDT

ఈనెల 21 వరకు సినిమా హాళ్లు మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కువ మల్టీప్లెక్సులు ఉన్నది తెలంగాణలోనే కాబట్టి సినిమా పరిశ్రమకు ఇది పెద్ద నష్టం తీసుకురావడం గ్యారెంటీ. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక్కటే కాదు, కరోనా ప్రభావంతో చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మరికొన్ని షూటింగ్స్ ఆపేశాయి. మొత్తంగా టాలీవుడ్ పై కరోనా దెబ్బ గట్టిగా పడింది. కరోనా ప్రభావంతో తన సినిమా ఆపేస్తున్నట్టు ప్రకటించారు చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమా […]

Comments