Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Saturday, March 14, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా గండం?

Posted: 14 Mar 2020 05:30 AM PDT

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చంద్రబాబుకు, టీడీపీకి గట్టి షాకిస్తూ వైసీపీకి మద్దతు పలికారు. ఈ పరిణామంతో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు ఆ పదవీ గండం ప్రారంభమైందని మీడియాలో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం ఏపీలో 23మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా పొందారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 175మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో పదోవంతు సీట్లు దక్కించుకుంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంటే 18మంది ఎమ్మెల్యేలు దాటితే ప్రతిపక్ష హోదా […]

ఈ సారైనా హిట్ కొడతాడా?

Posted: 14 Mar 2020 05:30 AM PDT

భారీ అంచనాల మధ్య దర్శకుడిగా మారాడు వక్కంతం వంశీ. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. అయితే ఆ అంచనాల్ని ఆ సినిమా అందుకోలేకపోయింది. దర్శకుడిగా వక్కంతం అక్కడే ఆగిపోయాడు. ఇక బన్నీ కెరీర్ కైతే అది భారీ బ్రేకులేసిందనే చెప్పాలి. ఆ మూవీ తర్వాత బన్నీ మరో సినిమా స్టార్ట్ చేయడానికి ఏడాదికి పైగా టైం తీసుకున్నాడు. అలా దర్శకుడిగా డెడ్ బ్లాక్ అయిన వక్కంతం వంశీ ఇప్పుడు కోలుకున్నాడు. […]

మాట నెగ్గించుకున్న బైరెడ్డి…. నందికొట్కూరులో రాజీ ఫార్ములా !

Posted: 14 Mar 2020 03:06 AM PDT

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ నందికొట్కూరులో ఆధిప‌త్య పోరు తీవ్ర‌స్థాయికి చేరింది. బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ మ‌ధ్య తీవ్ర‌మైన ఫైట్ న‌డిచింది. త‌న‌కు గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని ఎమ్మెల్యే ఆర్ద‌ర్ విమ‌ర్శ‌ల‌కు దిగారు. దీనికి ప్ర‌తిగా బైరెడ్డి కూడా ఎన్నిక‌ల ముందు వ‌చ్చిన‌వారికి వ‌ర్గం ఉంటుందా? అని గ‌ట్టి కౌంట‌ర్లు ఇచ్చారు. దీంతో అధిష్టానం, జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ రంగంలోకి దిగారు. ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చారు. నందికొట్కూరు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు […]

కరోనాపై ట్రంప్ సంచలన నిర్ణయం… హెల్త్ ఎమర్జెన్సీ

Posted: 14 Mar 2020 03:04 AM PDT

కరోనా కల్లోలానికి అమెరికా సైతం బెంబేలెత్తిపోతోంది. ఇన్నాళ్లు… చైనాలో పుట్టిన ఈ వైరస్ తమను ఏం చేస్తుందని నింపాదిగా ఉన్న అమెరికాలో నిన్న ఒక్కరోజే 7మంది చనిపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 2009 స్వైన్ ఫ్లూ తర్వాత దేశంలో మరోసారి నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. అమెరికాలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. తాజాగా ఏడుగురు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య అమెరికాలో ఏకంగా 48మందికి […]

చిరంజీవికి టాటా చెప్పిన త్రిష

Posted: 14 Mar 2020 03:00 AM PDT

1ఓవైపు ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఇన్ని రోజులైనా త్రిష సెట్స్ పైకి రాలేదు. అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడా అనుమానాలే నిజమయ్యాయి. ఆచార్య సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా త్రిష ప్రకటించింది. “అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. కొన్ని సార్లు మనం చేయాలనుకున్నవి సాధ్యం కావు. సృజనాత్మక విభేధాల వల్ల చిరంజీవి సినిమాలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాను. ఆ సినిమా యూనిట్ కు నా శుభాకాంక్షలు. ఇక నా ప్రియమైన […]

నంద్యాలలో మ‌ళ్లీ సీట్ ఫైట్ !

Posted: 14 Mar 2020 02:36 AM PDT

నంద్యాల మున్సిప‌ల్ రాజ‌కీయం మ‌ళ్లీ ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ సీటు ఎవ‌రికి ఇస్తార‌నేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఇక్క‌డ పోటాపోటీగా నేత‌లు ట్రై చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఎవ‌రి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. నంద్యాల మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి వైసీపీ నేత మ‌ల్కిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి భార్య ల‌లిత‌మ్మ నామినేష‌న్ వేశారు. జ‌గ‌న్ కూడా ఛైర్మ‌న్ అభ్య‌ర్థిగా రాజ‌గోపాల్‌రెడ్డి ఫ్యామిలీకి చాన్స్ ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే […]

కరోనా వల్ల నాని సినిమా వాయిదా

Posted: 14 Mar 2020 02:36 AM PDT

అంతా భయపడినట్టే జరిగింది. కరోనా సెగ నాని సినిమాకు కూడా తగిలింది. భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన V సినిమాను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ మేరకు ఓ లెటర్ కూడా విడుదల చేశాడు. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ లో సినిమాను విడుదల చేస్తామంటున్నాడు రాజు. తెలుగు రాష్ట్రాలకు కరోనా పాకింది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణపై గట్టిగానే పడింది. ఇప్పటికే థియేటర్లన్నీ ఖాళీ అయిపోయాయి. ప్రజలెవరూ […]

భారత క్రీడారంగంలో కరోనా ఎమర్జెన్సీ

Posted: 14 Mar 2020 02:33 AM PDT

ఐపీఎల్ వాయిదా, సఫారీలతో వన్డే సిరీస్ రద్దు భారత క్రీడాసంఘాలు, క్రికెట్ నియంత్రణమండలి…తమకు ఆటల కంటే భద్రతే ముఖ్యమని ప్రకటించాయి. కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి ముందు జాగ్రత్త చర్యగా..కరోనా ఎమర్జెన్సీని ప్రకటించాయి. మార్చి 29 నుంచి ముంబై వేదికగా ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో జరగాల్సిన కీలక సమావేశానికి ముందే […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan