Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Saturday, February 8, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


నాగశౌర్య మనోభావాలు దెబ్బతీశాడా?

Posted: 08 Feb 2020 05:30 AM PST

మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు నాగశౌర్య. ఈసారి ఏపీ, తెలంగాణ డ్రైవర్ల సంఘం అతడిపై కోపం వ్యక్తంచేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య తమ మనోభావాలు కించపరిచాడని ఆరోపిస్తోంది డ్రైవర్ ల సంఘం. ఈ మేరకు మానవ హక్కుల సంఘంలో నాగశౌర్యపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. అశ్వథ్థామ సినిమాలో డ్రైవర్లను అసభ్యంగా, నీచులుగా చూపించాడట నాగశౌర్య. అది సినిమా కాబట్టి దానిపై తమకు ఎలాంటి కంప్లయింట్స్ లేవంటున్నారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. […]

“అల” సల్మాన్ సెట్ అవుతాడేమో!

Posted: 08 Feb 2020 02:42 AM PST

తెలుగులో సూపర్ హిట్టయింది అల వైకుంఠపురములో సినిమా. నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సౌత్ నుంచి ఓ సినిమా హిట్టయిందంటే చాలు ఆటోమేటిగ్గా సల్మాన్ ఖాన్ కన్ను దానిపై పడుతుంది. ఈ సినిమాపై కూడా అలానే ఫోకస్ పెట్టాడు సల్మాన్ ఖాన్. సినిమా గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశాడు. ఓవైపు సల్మాన్ ఎంక్వయిరీ స్టార్ట్ చేయడమే ఆలస్యం, మరోవైపు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ హాట్ కేక్ లా అమ్ముడుపోయాయి. అల వైకుంఠపురములో […]

సుప్రీం కోర్టుకే మస్కా కొట్టిన జేసీ బ్రదర్స్‌

Posted: 08 Feb 2020 12:50 AM PST

పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీం కోర్టు 2017 మార్చి 29వ తేదీన కొత్త నిబంధనలను అమలులోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2017 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లే బిఎస్‌-3 వాహనాలను నిషేధిస్తూ…. బిఎస్‌-4 వాహనాలు మాత్రమే ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సుప్రీం కోర్టు నిబంధనలకు తూట్లు పొడుస్తూ జేసీ బ్రదర్స్‌… కర్నాటక, ఉత్తరాఖండ్‌ లో అశోక్‌ లేల్యాండ్‌ నుంచి బిఎస్‌-3 వాహనాలను […]

ప్రభాస్ సినిమాకు 2 టైటిల్స్

Posted: 07 Feb 2020 11:30 PM PST

మొన్నటివరకు జాన్ అనే టైటిల్ తోనే కిందామీదా పడ్డారు. ఆల్రెడీ దిల్ రాజు ఆ టైటిల్ వాడేయడంతో, ఇప్పుడు అదే టైటిల్ ను మరోసారి వాడుకోవడం ఎలా అంటూ ఆలోచించారు. కట్ చేస్తే, ఇప్పుడా టైటిల్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. అంతేకాదు.. ఈసారి 2 టైటిల్స్ పిక్ చేసుకున్నారు. ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు జాన్ అనే టైటిల్ పెట్టాలనే నిర్ణయం నుంచి నిర్మాతలు పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడా […]

పవన్ సరసన పూజా హెగ్డే…

Posted: 07 Feb 2020 10:04 PM PST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబో ఫిక్స్ అయింది. మూవీ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. కథ ఆల్రెడీ లాక్ అయింది. ఇప్పుడీ సినిమాకు కాస్ట్ & క్రూను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ను సెలక్ట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. ఇందులో భాగంగా పూజా హెగ్డేను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడట ఈ డైరక్టర్. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో […]

ప్రధాని మోడీ మాటలు కట్ చేసిన రాజ్యసభ ఛైర్మన్

Posted: 07 Feb 2020 10:01 PM PST

జమ్మూకశ్మీర్ కు ఇన్నాళ్లూ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయంపై.. రాజ్యసభలో ఇటీవల వాడీ వేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాస్త ఆవేశంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. సంచలన కామెంట్లు చేశారు. ఆ నాడు జవహర్ లాల్ నెహ్రూ కోసమే దేశాన్ని విభజించారని అన్నారు. అప్పటి నుంచే సమస్య మొదలైందని చెప్పారు. తర్వాత.. తెలంగాణ ఏర్పాటు తీరునూ ప్రస్తావించారు. పార్లమెంటు తలుపులు మూసేసి.. ఆంధ్రప్రదేశ్ ను విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు […]

మీరు ఓటేస్తామంటే…. మేము ఫ్రీగా తీసుకువెళ్తాం!

Posted: 07 Feb 2020 09:55 PM PST

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో…. ప్రజా రవాణా విభాగానికి సంబంధించిన ప్రైవేటు సంస్థలు సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాయి. ఉచితంగా రైడ్ అవకాశాన్ని కల్పిస్తూ ఓటు వేసేందుకు జనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు రాయితీలతో కూడిన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అభీ బస్ డాట్ కామ్ వాళ్లు.. ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదాన్ని ప్రమోట్ చేస్తూ.. ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 5 నుంచి 10 వరకూ ఈ అవకాశాన్ని కల్పించింది. ఇక.. […]

శివాజీ మళ్లీ వచ్చాడు… ఆవేశంగా అయినా నిజమే చెప్పాడు

Posted: 07 Feb 2020 09:48 PM PST

అప్పట్లో ఆపరేషన్ గరుడతో పరేషాన్ చేసిన సినీ నటుడు శివాజీ.. మళ్లీ ఆన్ స్క్రీన్ సందడి చేశాడు. తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. మీడియా ముందుకు వచ్చాడు. ఈ సారి అమరావతి గురించి మాట్లాడాడు. పరిపాలన ఎక్కడినుంచైనా చేసుకోవచ్చు.. కానీ ఆంధ్రుల రాజధాని అమరావతి మాత్రమే అని స్పష్టం చేశాడు. ఇది తథ్యమని అన్నాడు. అంతా బానే ఉంది కానీ.. 2019 శాసనసభ ఎన్నికలకు ముందు.. టీవీల్లో విస్తృతంగా కనిపించి.. ఆపరేషన్ గరుడ అంటూ లేనిపోని ప్రచారాలు […]