Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Friday, February 7, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఈ నేరంలో జేసీ బ్రదర్స్‌కు శిక్ష తప్పదా?

Posted: 07 Feb 2020 03:24 AM PST

అనంతపురం జిల్లాలో ఒక సామ్రాజ్యాన్నే నిర్మించుకున్న జేసీ బ్రదర్స్‌ మొట్టమొదటిసారి పరిటాల రవికి భయపడ్డారు. రవి పేరు చెబితేనే వణికిపోయిన వీళ్ళు… పరిటాల రవి మరణానంతరం మళ్ళీ విజృంభించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరాక…. అనంతపురం జిల్లాలో వీళ్ళు ఆడిందే ఆట… పాడిందే పాట. వీళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ప్రశ్నించేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. బస్సులను అడ్డగోలుగా తిప్పారు. ఒక బస్సుకు ఒక నెంబర్‌ తో పర్మిట్‌ తీసుకుని… అదే […]

‘జాను’ సినిమా రివ్యూ

Posted: 07 Feb 2020 02:38 AM PST

రివ్యూ :జాను రేటింగ్ : 3/5 తారాగణం : శర్వానంద్, సమంత, గౌరి జి కిషన్, సాయి కిరణ్ కుమార్, వెన్నెల కిషోర్, శరణ్య ప్రదీప్, రఘు బాబు తదితరులు సంగీతం : గోవింద్ వసంత నిర్మాత : దిల్ రాజు దర్శకత్వం : సి ప్రేమ్ కుమార్ యువ హీరో శర్వానంద్, వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కలిసి తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన […]

ఉడాన్ సేవలు విస్తరిస్తున్న ట్రూజెట్‌, నెట్‌వర్క్‌ పరిధిలోకి కొత్తగా బీదర్‌

Posted: 07 Feb 2020 12:32 AM PST

• బీదర్‌ వాసులకు చేరువకానున్న బెంగళూరు • బెంగళూరు-బీదర్‌-బెంగళూరు ట్రూజెట్‌ విమాన సర్వీసును ప్రారంభించిన కర్ణాటక సీఎం బి.ఎస్‌.యడ్యూరప్ప • ట్రూజెట్‌ నెట్‌వర్క్‌లో 24వ పట్టణంగా బీదర్‌ • ప్రతీ రోజు బెంగళూరు-బీదర్‌-బెంగళూరు మధ్య విమాన సేవలు • ట్రూజెట్‌ విమానంలో బెంగళూరు నుంచి బీదర్‌ వరకు ప్రయాణించిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మంత్రులు ఉడాన్‌ నెట్‌వర్క్‌ సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రూజెట్‌ కొత్తగా ఈశాన్య కర్ణాటకలోని బీదర్‌ నుంచి విమానసేవలు […]

లోకేష్‌ పై ఐటీ ఉచ్చు? సన్నిహితుల ఇంట్లో రెండో రోజూ సోదాలు

Posted: 06 Feb 2020 11:18 PM PST

తెలుగుదేశంలో ఐటీ కలకలం మొదలైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు, మాజీ పీఏ శ్రీనివాస్ తో పాటు లోకేష్‌ సన్నిహితుడు రాజేష్‌ ఇంట్లో రెండు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు, హైద్రాబాద్ తో పాటు, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన సోదాలు… ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ కు సంబంధించిన గాయత్రినగర్ లోని కంచుకోట అపార్ట్ మెంట్ మూడో […]

‘ఆర్ఆర్ఆర్’…. నైజాం హక్కులకు దిల్ రాజు రికార్డు ధర!

Posted: 06 Feb 2020 10:49 PM PST

బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మల్లీస్టారర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2021న విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించాడు. అయితే ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందో చూడకుండా… రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ కోసం అగ్ర శ్రేణి పంపిణీదారులు మూవీ పంపిణీ హక్కులను పొందడానికి పోటీపడుతున్నారు. దిల్ రాజు తాజాగా ఆర్ఆర్ఆర్ నిజాం హక్కుల కోసం రాజమౌళి టీం కోసం భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 75కోట్లను నైజాం […]

బాలకృష్ణ అల్లుడికి… ఆస్తుల జప్తు నోటీస్

Posted: 06 Feb 2020 10:12 PM PST

టీడీపీ నేత, బాలకృష్ణ అల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీ భరత్ కు షాక్ ఇచ్చింది కరూర్ వైశ్యా బ్యాంక్.  హైదరాబాద్‌ అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంక్ కు సుమారు 125 కోట్లు చెల్లించాల్సిన కేసులో భరత్‌ కుటుంబీకులకు…. ముఖ్యంగా ఆయన తండ్రి పట్టాభి రామారావు, బంధువు లక్ష్మణరావు తదితరులకు బ్యాంకు నోటీసులు జారీ చేసింది. టెక్నో యూనిక్ ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట తీసుకున్న రుణం ఎగవేశారని… అసలు, వడ్డీ కలిపి సుమారు 125 […]

పబ్లిసిటీ లేకుండా…. ఏపీకి 8 నెలల్లోనే 1,252 కంపెనీల యూనిట్లు

Posted: 06 Feb 2020 10:10 PM PST

కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా రెండు మూడు రోజులుగా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.. చంద్రబాబు అయితే బట్టలు చింపుకుంటున్నట్టు మీడియాల ఎదుట కియా విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం కంపెనీని తరిమేస్తోందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇవన్నీ తాను కష్టపడి తెచ్చానని దుఖి:స్తున్నాడు. చంద్రబాబు మొదటి నుంచి మీడియాను గుప్పిట పట్టి ఉచిత పబ్లిసిటీ చేయించుకోవడంలో… తిమ్మిని బమ్మిని చేయడంలో… దిట్ట. […]

విరాట్ కొహ్లీ బ్రాండ్ విలువ పై పైకి…

Posted: 06 Feb 2020 09:56 PM PST

39 శాతం పెరిగిన బ్రాండ్ వాల్యూ క్రికెటర్ గా మాత్రమే వార్తల్లో నిలిచే భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…బ్రాండ్ మార్కెట్లోనూ ప్రముఖంగా కనిపిస్తున్నాడు. తన బ్రాండ్ విలువను ఏడాది ఏడాదికీ పెంచుకొంటూ తనకుతానే సాటిగా నిలుస్తూ వస్తున్నాడు. గత మూడేళ్ల కాలంగా భారత బ్రాండ్ మార్కెట్లో నంబర్ వన్ గా నిలుస్తూ వచ్చిన విరాట్ కొహ్లీ…మార్కెట్ తాజా అంచనాల ప్రకారం…తన బ్రాండ్ విలువను 39 శాతం మేర పెంచుకోగలిగినట్లు గ్లోబల్ సలహా సంస్థ డుఫ్ అండ్ ఫెల్ప్స్ వెల్లడించింది. విరాట్ […]