telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


దిగడమే భారీగా దిగుతున్న బన్నీ

Posted: 29 Feb 2020 09:36 AM PST

అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. అతడి కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అలా మొన్నటివరకు ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాపై దృష్టిపెట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో ఓ మాస్ సినిమా చేసేందుకు బన్నీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడా మూవీ కోసం మేకోవర్ అయ్యే పని మొదలుపెట్టాడు బన్నీ. […]

సీఎం జగన్ తో ముఖేష్ అంబానీ భేటీ… ఏం మాట్లాడారంటే?

Posted: 29 Feb 2020 04:36 AM PST

పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. ఆంధ్రాకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ వీరితో ఉన్నారు. వీరి మధ్య ఏం చర్చ జరిగింది.. అసలు జగన్, అంబానీ ఏం మాట్లాడుకున్నారు… పెట్టుబడుల విషయంలో ఏమైనా మాట్లాడుకున్నారా.. ముఖేష్ అంబానీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారా.. అన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తమ వ్యాపారాలను విస్తరించేందుకు ముఖేష్ అంబానీ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు పరిశీలించేందుకే […]

హిట్ మొదటి రోజు వసూళ్లు

Posted: 29 Feb 2020 04:29 AM PST

సినిమాకు సంబంధించి మన జానర్ ప్రేక్షకులు ఎవరో తెలుసుకోవడం చాలా అవసరం. మన హీరో మార్కెట్ ఎంతో తెలుసుకోవడం ఇంకా అవసరం. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని బడ్జెట్ పెడితే నష్టాలనేవి దాదాపు రావు. నాని ఇదే పని చేశాడు. విశ్వక్ సేన్ మార్కెట్ పై అతడికి ఓ అంచనా ఉంది. పైగా అతడు తీసిన హిట్ సినిమా జానర్ పై కూడా పూర్తి క్లారిటీ ఉంది. అందుకే రిలీజ్ కు తగ్గట్టే ఈ సినిమాకు వసూళ్లు […]

శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేస్తామంటున్నారు…. దర్శకుడి ఫిర్యాదు

Posted: 29 Feb 2020 04:25 AM PST

తనను శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని.. ఫోన్లు చేసి చంపేస్తామంటున్నారని దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ బంజారాహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ విలేకరుతో మాట్లాడుతూ తాను 1500 సినిమాలకు కొరియాగ్రాఫర్ గా చేశానని.. ప్రస్తుతం ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపాడు. గత నెల 29న శ్రీరెడ్డి తనను యూట్యూబ్, ఫేస్ బుక్ లో చంపుతానని బెదిరించిందని.. ఆమె మనుషులతో ఫోన్లు చేయిస్తూ బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ ఆధారాల వీడియోలను […]

అమరావతిపై బీజేపీ వాదనతో…. టీడీపీలో అయోమయం

Posted: 28 Feb 2020 11:30 PM PST

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో బీజేపీ అడుగులు.. ప్రతిపక్ష టీడీపీని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. అమరావతే ఆంధ్రుల రాజధాని అంటూ బీజేపీ రాష్ట్ర నేతలు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. కానీ.. విశాఖ, కర్నూలును రాజధానిగా ఒప్పుకొనేది లేదు అని మాత్రం వారు చెప్పడం లేదు. అంతే కాదు.. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని కేంద్రం చెప్పింది. […]

‘గడువు 16 నెలలే…. పోలవరాన్ని పూర్తి చేయాల్సిందే’

Posted: 28 Feb 2020 08:55 PM PST

ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుపై….  రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్.. వచ్చే ఏడాది జూన్ లోపు నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సత్వర అనుమతుల కోసం ఢిల్లీలో ఓ అధికారి అందుబాటులో ఉండాలని.. నిధులను అందించే బాధ్యత తాము తీసుకుంటామని సీఎం చెప్పారు. పునరావాస, సహాయ కార్యక్రమాలపైనా ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. నిధులు కావాలంటే పూర్తి వివరాలతో రావాలని.. సత్వరమే […]

క్రీడారంగంలో కరోనా కల్లోలం

Posted: 28 Feb 2020 08:53 PM PST

వైరస్ తాకిడితో గందరగోళం ప్రకృతికి కోపం వస్తే, ప్రకోపిస్తే..అంతరిక్షాన్నే జయించిన మనిషి చిగురుటాకులా వణికిపోవాల్సిందేనని మరోసారి తేలిపోయింది. చైనాలో మొదలై ..ప్రపంచ దేశాలనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ తో…విశ్వక్రీడారంగం సైతం అతలాకుతలమైపోతోంది. ప్రపంచాన్నే జయించామని విర్రవీగిపోయే అమెరికాతో పాటు మిగిలిన పాశ్చాత్యదేశాలు సైతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఆధునిక మానవుడి జీవితంలో ఓ ప్రధానభాగంగా ఉన్న క్రీడారంగం సైతం కరోనా వైరస్ భయంతో విలవిలలాడి పోతోంది. ప్రపంచంలోని అతిపెద్ద దేశం, గొప్ప గ్లోబల్ మార్కెట్ చైనా…కరోనా వైరస్ […]

ఆర్భాటం లేకుండా… అనవసర ఖర్చులు లేకుండా!

Posted: 28 Feb 2020 08:50 PM PST

కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల బడ్జెట్.. పోటాపోటీగా పెరుగుతూ వస్తోంది. ఏటా.. లక్షల కోట్లలో పద్దుల చిట్టా రూపొందుతోంది. 2014లో.. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ.. ఎలాగోలా నెట్టుకుంటూ వస్తోంది. కానీ.. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లోటు బడ్జెట్.. కేంద్రం అరకొర సహాయం.. రాష్ట్రానికి దక్కని హైదరాబాద్ ఆదాయం.. ఇలా రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలోని చంద్రబాబు ప్రభుత్వం.. ఇదేదీ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అమరావతి పేరిట ఆర్భాటాలకు పోయి.. భారీ బడ్జెట్ రూపొందించి.. చేతులు కాల్చుకుందన్న […]

Comments