telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


రీఎంట్రీ పవన్…. ఆ కల నెరవేరుతుందా?

Posted: 28 Feb 2020 04:32 PM PST

రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన పవన్ కళ్యాణ్… సినిమాల్లోకి రాను రాను అంటూనే మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. దిల్ రాజ్ తో ఒక మూవీ, క్రిష్ దర్శకత్వంలో మరో మూవీని చేస్తున్నాడు. క్రిష్ తో చేస్తున్న మూవీ వేగంగా సాగుతోంది. ఈ మూవీ కోసం భారీ సెట్లు, చాలా పెద్ద బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నారట.. ఈ సినిమాలోని అద్భుతమైన కథా కథనం దృష్ట్యా ఈ సినిమాను తెలుగులోనే కాదు.. ఇతర […]

“ఉత్తరాంధ్రలో అమరావతి” బెడిసికొట్టిందే.. ఇప్పుడేం చేద్దాం?

Posted: 28 Feb 2020 05:30 AM PST

ఉత్తారంధ్రలో పర్యటించి.. అమరావతికి అనుకూలంగా తమ వాదన వినిపించాలని అనుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆయన విశాఖకు వెళ్లడం.. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రజా సంఘాల నేతలు అడ్డుకోవడం.. తర్వాత ఆందోళనలు.. చంద్రబాబు అరెస్టు, విడుదల… వంటి చర్యలను టీడీపీ నేతలు రాజకీయం చేసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. కానీ.. వారికి కంఠశోష తప్ప మిగిలింది ఏదీ లేకుండా పోయింది. ఆఖరికి ఉత్తరాంధ్రకు చెందిన నేతలు ఒకరిద్దరు తప్ప.. మిగతా ఎవరూ అండగా […]

గంటా వారి లీలలు.. ఎటు వైపో అడుగులు?

Posted: 28 Feb 2020 03:30 AM PST

గంటా శ్రీనివాసరావు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈయన ఓ సంచలనం. ప్రతిసారి ఎన్నికల్లో స్థాన చలనం.. ఈయనకు ఓ అలవాటు. కానీ.. విజయం మాత్రం తనకే దక్కేలా రాజకీయ వ్యూహం పన్నడంలో ఆయన ఆరి తేరిన వ్యక్తి. అంతటి నాయకుడు.. తన సొంత పార్టీ అధినేత తన జిల్లాకే వస్తే.. కనీసం మాట వరసకైనా మాట్లాడలేదు. పలకరింపునకూ వెళ్లలేదు. ఏం పాపం.. అని ఆరా తీసిన నేతలకు ఓ పొంతన లేని సమాధానం వచ్చింది. తన తండ్రికి సంబంధించిన […]

మేం గాడిదలు కాయట్లేదు…. శాంతిభద్రతలు పరిరక్షిస్తున్నాం – పోలీస్ అధికారుల సంఘం

Posted: 28 Feb 2020 03:14 AM PST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది. ‘పోలీసులు గాడిదలు కాస్తున్నారా..?’ అన్న వ్యాఖ్యలపై సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని అన్నారు. అకస్మాత్తుగా చోటు చేసుకునే అనివార్య పరిస్థితుతను దృష్టిలో పెట్టుకునే పోలీసులు స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు. ఏ సందర్భంలో […]

దిశ నిందితుల కుటుంబాల పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

Posted: 28 Feb 2020 03:12 AM PST

హైదరాబాద్ శివార్లలో దారుణ అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దిశ నిందితులను అన్యాయంగా ఎన్‌కౌంటర్‌లో చంపేశారని.. ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు పిటిషన్‌లో కోరారు. అంతే కాకుండా ప్రతీ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బాబ్డే […]

ఆమ్ ఆద్మీ, బీజేపీకి తేడా అదే…. అందుకే ఆప్ గెలిచిందా?

Posted: 28 Feb 2020 01:47 AM PST

నీతులు అందరు చెప్పేవారే.. కానీ ఆచరించేవారు తక్కువ మంది ఉంటారు. నిన్నటి ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలే వీటిని రుజువు చేశాయి. బీజేపీ విలువలను ప్రవచించడం వరకు పరిమితమైతే ఆప్ ఆచరణలో చేసి చూపుతోంది. ఈ వ్యత్యాసమే ఆప్ పార్టీకి అన్నివిధాలా కలిసొచ్చేలా చేసింది. దీంతో వరుసగా ఆప్ హ్యట్రిక్ విజయాలు సాధించి ఢిల్లీ పీఠం దక్కించుకుంది. ఢిల్లీల్లో జరిగిన అల్లర్ల విషయంలో ఇది మరోసారి తేటతెల్లమైంది. ఆప్ తమ పార్టీ నాయకుడిపై ఆరోపణలు రాగానే సస్పెన్షన్ […]

మోడీ, అమిత్ షా చెప్పినా…. కేసీఆర్ సంచలనం

Posted: 28 Feb 2020 01:45 AM PST

దేశంలో పౌరసత్వ మంటలు ఆరడం లేదు. ఇక ఎన్నార్సీ , ఎన్ పీ ఆర్ పేరిట ప్రజల డేటా సేకరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ డేటాపై ముస్లిం, మైనారిటీలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో సామరస్యంగా ఉన్న హిందూ-ముస్లిం ఐక్యతను చెడగొట్టకుండా ఉండేందుకు.. ముస్లిం మైనార్టీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్ పీ ఆర్) అమలును నిలిపివేయాలని సంచలన […]

‘హిట్’ సినిమా రివ్యూ

Posted: 28 Feb 2020 01:25 AM PST

రివ్యూ : హిట్ రేటింగ్ : 3/5 తారాగణం : విశ్వక్ సేన్, రుహాని శర్మ, మురళి శర్మ తదితరులు సంగీతం : వివేక్ సాగర్ నిర్మాత :  ప్రశాంతి త్రిపురనేని దర్శకత్వం : శైలేష్ కొలను ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో హీరోగా పరిచయమైన యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. […]

Comments