telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


చంద్రబాబు కాన్వాయ్ పై కోడిగుడ్లు, చెప్పులతో దాడి… తీవ్ర ఉద్రిక్తత

Posted: 27 Feb 2020 01:20 AM PST

అమరావతే రాజధానిగా ఉండాలని…. విశాఖ రాజధాని ప్రకటనను వ్యతిరేకించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం విశాఖలో పర్యటించిన చంద్రబాబు కాన్వాయ్ పై కొందరు కోడిగుడ్లు, చెప్పులతో దాడులకు దిగారు. టమాటాలను విసిరారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా చైతన్యయాత్రలను' ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగానే విశాఖకు రాగా.. విశాఖను వ్యతిరేకించిన చంద్రబాబుకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు ఎయిర్ […]

రంజుగా రాజోలు ‘రాజకీయం’… జగన్ ఎవరికిస్తారు?

Posted: 27 Feb 2020 12:42 AM PST

కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలికి ప్రతిపక్ష పార్టీలన్నీ కొట్టుకుపోయాయి. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు 151సీట్లను వైసీపీ గెలచుకొని ప్రభంజనం సృష్టించిన సంగతి తెల్సిందే. టీడీపీకి 23 సీట్లు రాగా, మిగతా ఒక్క సీటు జనసేన పార్టీ గెలుచుకుంది. రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక సీటు రాజోలు కావడం విశేషం. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తొలినుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసే […]

కలకలం: ఏపీ ఆస్పత్రులపై ఏసీబీ రైడ్స్

Posted: 26 Feb 2020 11:30 PM PST

సీఎం జగన్ ఏరికోరి సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు ను ఏసీబీ చీఫ్ గా చేశారు. ఏపీలో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే పెద్ద బాధ్యతను అప్పజెప్పారు. దీంతో ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివిధ శాఖలపై వరుస దాడులతో ముందుకెళ్తున్నారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల పై ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చంద్రబాబు హయాం నుంచి మందుల కొనుగోలులో చేతివాటంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇప్పటికీ అవి […]

బాబుకు షాకిచ్చిన వైసీపీ సర్కార్…

Posted: 26 Feb 2020 10:21 PM PST

అమరావతే రాజధానిగా ఉండాలంటూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. ఇక విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అలాంటి చంద్రబాబు విశాఖ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖను రాజధానిగా ఒప్పుకోని చంద్రబాబు ఇక్కడికి రావడాన్ని ఉత్తరాంధ్ర వాసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం విశాఖ పట్నం ఎయిర్ పోర్టుకు రాగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, ఇతర ప్రజాసంఘాల నేతలు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఇక చంద్రబాబుకు […]

టెస్ట్ ర్యాంకింగ్స్ లో కొహ్లీ డౌన్, స్మిత్ అప్

Posted: 26 Feb 2020 10:20 PM PST

వరుస వైఫల్యాలతో విరాట్ కు పరీక్ష సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు విరాట్ కొహ్లీ…న్యూజిలాండ్ తో ముగిసిన తొలిటెస్ట్ వైఫల్యాలతో తన టాప్ ర్యాంక్ ను చేజార్చుకొన్నాడు. విరాట్ కొహ్లీ 906 పాయింట్లతో రెండోర్యాంక్ కు పడిపోయాడు. ఆస్ట్ర్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో టాప్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. న్యూజిలాండ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా వెలింగ్టన్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో […]

లక్ష్మీపార్వతికి అరుదైన అవకాశం…

Posted: 26 Feb 2020 10:18 PM PST

తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు భార్యగా లక్ష్మీపార్వతి ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్ చివరిరోజుల్లో టీడీపీని లాక్కున్న చంద్రబాబు ఉదంతంలో సాక్షిగా ఈమెనే ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తూ మాటల తూటాలు పేల్చుతుంటారు. అయితే లక్ష్మీపార్వతి కేవలం రాజకీయ నాయకురాలే కాదు… ఆమె ఒక సాహిత్య మేధావి, కళాకారురాలు కూడా. ఈమెకు కళలు, సాహిత్యంలో ఉన్న పట్టు చూసే ఎన్టీఆర్ భార్యగా స్వీకరించారు. ఉన్నత విద్య చదివిన లక్ష్మీపార్వతి తెలుగు లిటరేచర్ చేసి తెలుగు […]

భారత సంతతి అమ్మాయికి మాక్స్ వెల్ క్లీన్ బౌల్డ్

Posted: 26 Feb 2020 10:15 PM PST

వినీ రామన్ తో మాక్స్ వెల్ నిశ్చితార్థం ఆస్ట్ర్రేలియన్ క్రికెట్ డాషింగ్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ కీలక ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్… భారత సంతతికి చెందిన వినీ రామన్ తో నిశ్చితార్థం చేసుకొన్నట్లు ప్రకటించాడు. గతంలో మరో ఆస్ట్ర్రేలియన్ యువతితో నిశ్చితార్థం జరుపుకొన్న మాక్స్ వెల్… ఫిట్ నెస్ సమస్యలతో పాటు… మానసిక సమస్యలు సైతం ఎదుర్కొన్నాడు. తాను మానసికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో వినీ రామన్ తనకు అండగా నిలిచిందని, చెప్పలేని […]

కియా ఎక్కడికీ పోవట్లేదు… ధృవీకరించిన కొరియా..!

Posted: 26 Feb 2020 09:29 PM PST

ఏపీలోని అనంతపురం జిల్లాలో కొన్ని కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన దక్షిణ కొరియా కియా మోటార్స్ సంస్థ ఈ మధ్య తమ వాహనాలను ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఏపీలోని అనంతపురం ఫ్యాక్టరీ నుంచే వాహనాలు డెలివరీ చేస్తున్నారు. గత సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ నుంచి ఈ మధ్యే వాహనాలు కమర్షియల్‌గా మార్కెట్ లోనికి రిలీజ్ అయ్యాయి. కాగా, ఈ సంస్థ ఏపీ నుంచి తరలిపోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై దక్షిణ […]

Comments