Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Sunday, February 2, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


నిఖిల్ నిశ్చితార్థం

Posted: 02 Feb 2020 07:32 AM PST

అవును.. మీరు చదివింది నిజమే. ఎలాంటి చడీచప్పుడు లేకుండా, ముందస్తు ప్రకటన చేయకుండా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్నాడు నిఖిల్. తన కాబోయే భార్యతో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం.. కొన్నాళ్లుగా నిఖిల్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు ఉన్నాయి. ఓ తెలుగమ్మాయితో అతడు డేటింగ్ చేస్తున్నాడనే ఊహాగానాలు ఏడాదిగా నలుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ రూమర్లు నిజమయ్యాయి. నిఖిల్ ఆ అమ్మాయితోనే పెళ్లికి సిద్ధమౌతున్నాడు. అమ్మాయి పేరు పల్లవి వర్మ. […]

కేవీపీకి, సుబ్బరామిరెడ్డికి మ‌ళ్లీ చాన్స్ ఇస్తారా ?

Posted: 02 Feb 2020 04:30 AM PST

కేవీపీ రామచంద్రారావు, టి.సుబ్బరామిరెడ్డి. రాజ్యసభ సభ్యులు. వీరి రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం మార్చి నెలతో ముగుస్తోంది. దీంతో మళ్లీ ఈ ఇద్దరు నేతలు పెద్దల సభకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. కేవీపీ రామచంద్రారావు ఈ మధ్య కాంగ్రెస్‌ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఎక్స్‌ ఆఫిషియో ఓటు వేసేందుకు నేరేడుచర్ల వెళ్లారు. అయితే అక్కడ గులాబీ దళం వేసిన ఎత్తుతో ఆయన చిత్తయ్యారు. ఆయన తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. […]

ఈ నెల 6న సీఎం జగన్ తో చిరంజీవి భేటీ?

Posted: 01 Feb 2020 11:56 PM PST

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన ఊహాగానం.. హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఈ నెల 6న.. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారన్న సమాచారం.. అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే.. సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా.. జగన్ ను స్వయంగా కలిసిన చిరంజీవి.. తన సినిమా చూడాలని ఆహ్వానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత.. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ విడుదల సందర్భంగా కూడా.. చిరంజీవి.. ముఖ్యమంత్రి […]

చంద్రబాబు స్వగ్రామంలో ఉద్రిక్తత…

Posted: 01 Feb 2020 11:40 PM PST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వగ్రామం.. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతలు.. పోటాపోటీగా ప్రజా సదస్సులు నిర్వహిస్తుండడమే ఇందుకు కారణమైంది. 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సహజంగానే.. ఈ ప్రయత్నం టీడీపీ నేతలను చికాకుపరిచింది. వారు వైసీపీ నేతల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీకి పోటీగా.. నారావారిపల్లెలో టీడీపీ నేతలు కూడా సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 3 రాజధానుల […]

పాపం కర్నూలు అమ్మాయి… 14న పెళ్లి… చైనాలో చిక్కుకుంది!

Posted: 01 Feb 2020 11:30 PM PST

కరోనా ప్రభావం.. ఆరోగ్యాలమీదే కాదు.. పెళ్లి ముహూర్తాలపైనా ప్రభావం చూపిస్తోంది. కర్నూలు జిల్లా ఈర్ణపాడుకు చెందిన అమ్మాయి శృతి విషయంలో జరిగిన ఈ ఘటన.. వారి కుటుంబాన్ని ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తోంది. అసలు విషయం ఏంటంటే.. టీసీఎల్ సంస్థలో ఉద్యోగానికి ఎంపికైన శృతి.. మూడు నెలల శిక్షణ కోసం వుహాన్ పట్టణానికి వెళ్లింది. ఆమెకు జ్వరం సోకడంతో.. భారత్ పంపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో పరీక్షిస్తున్నారు. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే.. ఈ […]

కేంద్రంతో పోరాటానికి సిద్ధం…. జగన్ అనుమతే ఆలస్యం

Posted: 01 Feb 2020 10:57 PM PST

రాష్ట్రానికి బడ్జెట్ లో కేటాయింపులపై.. వైసీపీ ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు.. కేంద్రానికి తమ నిరసనను వ్యక్తం చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని.. అసలు కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్న ఆలోచనలో ఉన్న వైసీపీ ఎంపీలు.. అవసరమైతే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ నిర్ణయించాలని భావిస్తున్నారు. కానీ.. ఈ సమావేశం నిర్వహించేందుకు వారు అధినేత జగన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఆలోచనలను జగన్ కు వివరించి.. ఆయన ఇచ్చే […]

మోడీ భద్రతకు 600 కోట్లా?

Posted: 01 Feb 2020 10:55 PM PST

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశాన్ని ఆర్థిక మాంద్యం చుట్టేసింది. ఉద్యోగ, ఉపాధి లేక వందలాది మంది రోడ్డున పడుతున్నారు. ఆటోమొబైల్ సహా పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రగతి చక్రాన్ని పట్టాలెక్కించాల్సిన బడ్జెట్ నిరాశను కలిగించిందని అందరూ ఆడిపోసుకుంటున్నారు. మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి స్టాక్ మార్కెట్ 1000 పాయింట్లు కుప్పకూలింది. ఇలా దేశాన్ని కమ్ముకున్న ఆర్థిక మాంద్యాన్ని పక్కనపెట్టి మోడీ తన సొంత అవసరాలకు […]

మరో వివాదం లో యాంకర్ ప్రదీప్ !

Posted: 01 Feb 2020 09:57 PM PST

యాంకర్‌ ప్రదీప్‌పై ఓ యువ దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన వారు సినిమాలో న‌టించ‌డం నేరం. ఈ నిబంధ‌న ప్ర‌కారం ప్రదీప్ కూడా సినిమాలో న‌టించొద్ద‌ని అంటున్నాడు ఈ యువ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ప్ర‌దీప్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని …ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో దర్శకుడు శ్రీ రామోజు సునిశిత్ […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan