Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Monday, February 10, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఫేమస్ లవర్ కు 3 కత్తెర్లు

Posted: 10 Feb 2020 03:55 AM PST

ట్రయిలర్ రిలీజ్ అయినప్పుడే చాలామంది ఈ సినిమాపై అనుమానాలు వ్యక్తంచేశారు. మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించారు. కానీ ఆశ్చర్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కేవలం 3 కట్స్ తో పాస్ అయింది. ఆ 3 కట్స్ కూడా సెన్సార్ సూచించినవి కావు. మేకర్సే సెన్సార్ కాపీతో మ్యూట్స్ వేసి ఇచ్చారు. దీంతో యు/ఏ సర్టిఫికేట్ తో సినిమా పాస్ అయింది. విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇక సినిమా రన్ […]

కొండపైకి క్యూ కడుతున్న టాలీవుడ్ ప్రముఖులు

Posted: 10 Feb 2020 03:50 AM PST

తిరుమల కొండపై ఇప్పుడు టాలీవుడ్ సీజన్ నడుస్తున్నట్టుంది. స్టార్స్, ప్రముఖులంతా ఒక్కొక్కరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మొన్నటికిమొన్న హీరోయిన్ సమంత తిరుమల వెళ్లింది. ఎప్పట్లానే నడుచుకుంటూ కొండపైకి వెళ్లిన సమంత, శ్రీవారిని దర్శించుకుంది. అదే టైమ్ లో నిర్మాత దిల్ రాజు కూడా సమంతతో పాటు నడుకుంటూ కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు. ఈరోజు సంగీత దర్శకుడు తమన్ శ్రీవారి సేవలో తరించాడు. నిత్యం కంపోజింగ్స్ తో బిజీగా ఉండే ఈ సంగీత దర్శకుడు ఈసారి దర్శకుడు గోపీచంద్ […]

దిశ పోలీస్ స్టేషన్ లో టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

Posted: 10 Feb 2020 03:15 AM PST

జగన్ ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్ లో ఏకంగా టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.. సోషల్ మీడియాలో తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారంటూ రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భవానీకి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున దిశ పోలీస్ స్టేషన్ కు […]

కేసీఆర్ బర్త్ డేకు కేటీఆర్ ఇచ్చే కానుక ఇదే….

Posted: 10 Feb 2020 03:15 AM PST

తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే వస్తోంది. ఫిబ్రవరి 17న టీఆర్ఎస్ అధినేత 66వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. వరుస విజయాలతో వచ్చిన ఊపు.. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కేసీఆర్ బర్త్ డే నాడు శుభాకాంక్షలు, వివిధ కార్యక్రమాలు చేయడానికి గులాబీ శ్రేణులంతా రెడీ అయ్యారు. తెలంగాణ అంతటా సార్ బర్త్ డేను ఓ రేంజ్ లో చేయడానికి రెడీ అయ్యారు. అయితే తండ్రి బర్త్ డే వేడుకకు కేటీఆర్ కూడా ఓ భారీ కానుకను రెడీ చేయడం […]

కరోనా చైనాలో జనానికి సోకితే…. ఆంధ్రాలో రాజకీయాలకు సోకింది

Posted: 10 Feb 2020 02:26 AM PST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. చైనాలో వందలాది మందిని మృత్యువాత పట్టిస్తోంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు ఆ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దాదాపు ప్రతి దేశం ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది. కేరళలో అయితే హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించాల్సివచ్చింది. విచిత్రంగా.. ఈ కరోనా వైరస్ మన రాజకీయాలకూ పాకింది. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తుంటే.. ఇది నిజమే అనిపిస్తోంది. కావాలంటే మీరూ ఈ […]

బస్సుల్లో వ్యభిచారమా…. అది కూడా వారి బస్సుల్లోనా?

Posted: 10 Feb 2020 02:24 AM PST

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వ్యభిచారమా? అది కూడా సీనియర్ నాయకుడికి చెందిన బస్సుల్లో ఈ వైపరిత్యమా? చాలా మంది నిజమే అని అంటున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ దందా జరిగిందని చెబుతున్నారు. అధికారులకూ తెలిసే ఇది జరిగిందని.. ఆ సమయంలో సదరు సంస్థ నిర్వాహకులు అధికార పార్టీలో ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి జగన్ ను పరిపరివిధాలా విమర్శిస్తున్నాడు. తమ పార్టీ అధినేత మెప్పు కోసమో.. తన రాజకీయ లాభం కోసమో.. […]

లెక్క మొదలైంది…. తరలింపు కసరత్తు జరుగుతోంది

Posted: 10 Feb 2020 01:47 AM PST

మూడు రాజధానులపై అడుగు ముందుకు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సిబ్బంది కేటాయింపులోనూ వేగంగా అడుగులు వేస్తోంది. న్యాయ రాజధానిగా ఏర్పాటు కాబోతున్న కర్నూలుకు ఎంత మందిని తరలించాలి.. సిబ్బంది కేటాయింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. న్యాయ విభాగం పరిధిలో ఉండే శాఖలు.. కార్యాలయాలు.. వాటి సిబ్బంది వివరాలపై.. సచివాలయ ఉద్యోగుల సంఘంలోనూ చర్చ జరుగుతోంది. ఎవరెవరు.. అమరావతి నుంచి తరలివెళ్లేందుకు సుముఖంగా ఉన్నారన్న విషయంపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. […]

పేదలకు ఇబ్బంది లేకుండా …. విద్యుత్ చార్జీల పెంపు

Posted: 10 Feb 2020 01:38 AM PST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచింది. ఈ దిశగా పేదలను పరిగణనలోకి తీసుకుంది. ఎగువ మధ్యతరగతి, ఆపైన విభాగాలకు మాత్రమే పెంపు వర్తించేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తించి.. కాస్త ఆర్థిక వనరులు పెంచే దిశగా.. అది కూడా నిరుపేదలకు భారం కలగకుండా చూసింది. 500 యూనిట్లు పైబడి విద్యుత్ ను వినియోగించే వారిపైనే భారం మోపింది. ఇప్పటివరకూ.. 500 యూనిట్లు పైపడి విద్యుత్ వినియోగించే వారికి 9 రూపాయల 5 పైసల టారిఫ్ ను […]