Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Wednesday, January 8, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


దర్బార్ పై కేసు.. హైకోర్టులో క్లియరెన్స్

Posted: 07 Jan 2020 10:03 PM PST

సరిగ్గా విడుదలకు 48 గంటల ముందు దర్బార్ సినిమాపై కేసు పడింది. అయితే దీనిపై ఎలాంటి వాయిదాలకు పోకుండా వెంటనే మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో వివాదం సమసిపోయింది. టీ కప్పులో తుపానులా చెలరేగిన ఈ వివాదం కోలీవుడ్ లో ఓ చిన్న సైజు ప్రకంపన సృష్టించింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. దర్బార్ సినిమా విడుదలను ఆపేయాలంటూ మలేషియాకు చెందిన ఓ పంపిణీ సంస్థ హైకోర్టులో కేసు వేసింది. గతంలో 2.O రిలీజ్ టైమ్ లో లైకా […]

జగన్‌ నీ రేటు చెప్పు… కొనుక్కుంటాం – రాజధాని మహిళలు

Posted: 07 Jan 2020 09:56 PM PST

ఇలా అన్న మహిళల పేర్లు అయితే ప్రత్యేకంగా రాయలేదు గానీ… టీడీపీ పత్రిక మాత్రం రాజధాని మహిళల పేరుతో ఒక కథనాన్ని రాసింది. ధర్నాల్లో కూర్చుంటున్న వారంతా ఫెయిడ్ ఆర్టిస్టులని, వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ధర్నాలో కూర్చునేందుకు సిద్ధమైతే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారంటూ… కొందరు వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై రాజధాని మహిళలు ఏమంటున్నారు? అన్న దానిపై ఆ పత్రిక ఈ కథనం రాసింది. తాము ఫెయిడ్ ఆర్టిస్టులమైతే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కూడా వచ్చి […]

లోకేష్‌ను అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశావ్‌… అమరావతి కోసం సీమ నుంచి తరలివస్తాం…

Posted: 07 Jan 2020 09:54 PM PST

రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే వైసీపీ వారికి ఎలా రాత్రి నిద్రపడుతోందో అర్థం కావడం లేదన్నారు టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ . రైతులపై కక్షసాధిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనన్నారు. అమరావతి రైతుల బాధ చూస్తుంటే రాయలసీమ రైతులు కూడా బాధపడుతున్నారన్నారు. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టినా రాయలసీమ రైతులు స్పందించరు అన్న భావనతో ప్రభుత్వం ఉందన్నారు. రోడ్ల మీద మహిళలు ధర్నాలు చేస్తూ పోలీసులతో కేసులు పెట్టించుకుంటున్నారన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే అమరావతి ప్రాంతాన్ని […]

30 నిముషాల ముందుగానే ఐపీఎల్ షో

Posted: 07 Jan 2020 09:44 PM PST

మే 24న 2020 ఐపీఎల్ టైటిల్ ఫైట్ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 13వ సీజన్ పోటీలను ..గత 12 సీజన్లకు భిన్నంగా 30 నిముషాల ముందుగానే ప్రారంభించాలని ఐపీఎల్ బోర్డు నిర్ణయించింది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి 8 గంటలకు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని రాత్రి 7 గంటల 30నిముషాలకే మ్యాచ్ లు మొదలుపెట్టాలని ని్ర్ణయించారు. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా మార్చి […]

నారా లోకేషే సెటిల్ చేశారు – కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్

Posted: 07 Jan 2020 09:35 PM PST

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు స్వీకరించి ఎగ్గొట్టిన కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో నారా లోకేష్ ప్రమేయం కూడా ఉన్నట్టు కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ మధుసూదన్‌ రెడ్డి వివరించారు. డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నం చేద్దామని తాను చెబుతుంటే అందుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన బంధువులు బెదిరిస్తున్నారని.. చంపేస్తామంటున్నారని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి మధుసూదన్ రెడ్డి వివరించారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి వియ్యంకుడైన కేశవరెడ్డి తన విద్యాసంస్థల పేరుతో 700 […]

ఇండోర్ టీ-20లో భారత్ జోరు

Posted: 07 Jan 2020 09:30 PM PST

7 వికెట్లతో అలవోకగా నెగ్గిన విరాట్ సేన శ్రీలంకతో మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో ఆతిథ్య భారత్ బోణీ కొట్టింది. తన విజయాల అడ్డా ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో టీ-20లో భారత్ 7 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సంపాదించింది. గౌహతీవేదికగా జరిగిన తొలివన్డే వానదెబ్బతో రద్దు కావడంతో..ఈ రెండోవన్డే రెండుజట్లకూ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్… ప్రత్యర్థి శ్రీలంకను 20 ఓవర్లలో 142 […]

13న కేసీఆర్‌, జగన్ భేటీ

Posted: 07 Jan 2020 09:28 PM PST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నారు. ఈనెల 13న కేసీఆర్‌, జగన్‌మోహన్ రెడ్డిలు హైదరాబాద్‌ వేదికగా భేటీ కాబోతున్నారు. ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో… విభజన చట్టంలోని అంశాలపైనా చర్చించనున్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం జఠిలంగా మారడంతో… ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాలపైనా ఈ భేటీలో చర్చ జరగవచ్చు. ఆర్టీసీ ఆస్తుల అంశం కూడా ఎజెండాలో ప్రధాన అంశంగా ఉండనుంది. నదీ జలాల వినియోగం పైనా చర్చ […]