Translate

Tuesday, January 7, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


నారాయణ.. నారాయణ.. మీ తీరు మారదా?

Posted: 07 Jan 2020 04:32 PM PST

సీపీఐ, సీపీఎం నాయకులు.. అమరావతి విషయంలో అనుసరిస్తున్న వైఖరి.. అయోమయంగా కొనసాగుతోంది. ఇందుకు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమరావతి పరిధిలో జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం తెలియజేస్తున్న ఆయన.. ఇటీవల అయోమయ పూరితంగా మాట్లాడారు. అమరావతికే తమ మద్దతు.. అని నారాయణ అన్నంత వరకూ బాగానే ఉంది. అమరావతినే సంపూర్ణ రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పేవరకూ ఆందోళన ఆపేది లేదన్నది కూడా బాగానే ఉంది. కానీ.. ఓ వైపు అమరావతికే […]

2020 మొదటి చంద్ర గ్రహణం…. పేరు కూడా పెట్టేశారు…

Posted: 07 Jan 2020 04:00 PM PST

ఈ కొత్త సంవత్సరం లోనే కాదు… ఈ కొత్త దశాబ్దం లోనే మొదటగా దర్శనం ఇచ్చే చంద్ర గ్రహణం గురించి నాసా శాస్త్రవేత్తలు సమాచారం విడుదల చేశారు. 2020 మొదటి చంద్ర గ్రహణం జనవరి 10న ఏర్పడనుంది. ఈ ఖగోళ సంఘటన ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 'వూల్ఫ్ మూన్ ఎక్లిప్స్' అని పేరు పెట్టింది. ఇది ఈసారి భారతదేశంలో కనిపిస్తుంది. వాస్తవానికి, ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లోని దేశాలు కూడా చంద్ర గ్రహణాన్ని చూడగలుగుతాయి. […]

తిరుమలేశుడి సాక్షిగా కేటీఆర్ వర్సెస్ హరీష్!

Posted: 07 Jan 2020 04:00 PM PST

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అడుగులు.. కొంత కాలంగా తన తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే వైపు నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయానికి మరింత ఊతం ఇచ్చేలా.. చర్చను మరింత పెంచేలా మరో సందర్భం టీఆర్ఎస్ లో ఏర్పడింది. ఈ మధ్య.. వైకుంఠ ఏకాదశికి కేటీఆర్ కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో.. మరో సీనియర్ నాయకుడు.. టీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఒకరు అయిన హరీష్ […]

బట్టతల వేధించింది… బలవంతంగా ప్రాణం తీసుకునేలా చేసింది

Posted: 07 Jan 2020 03:30 PM PST

కేవలం 18 ఏళ్ల వయసు.. ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపాటుకు అవకాశం ఎక్కువ. ఆ తొందరపాటుతోనే.. ఘోరాలు జరిగే అవకాశం ఉంది. పూడ్చుకోలేనంత నష్టాన్ని మిగిల్చే అవకాశమూ ఉంది. హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్ లో ఇదే జరిగింది. అణుచుకోలేకపోయిన ఆవేశం.. బలవంతంగా ప్రాణం తీసేలా చేసింది. ఆవేశ్ (పేరు మార్చాం) వయసు 18 ఏళ్లు. తండ్రి మాదాపూర్ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆవేశ్ కు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. ఆప్యాయంగా చూసుకునే తల్లి.. మంచి […]

‘సరిలేరు నీకెవ్వరు’…. ఈ సినిమాలకు కాపీనట !

Posted: 07 Jan 2020 06:57 AM PST

మహేష్ బాబు  'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ కు మంచి స్పందనే వస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలిచి 10లక్షల వ్యూస్ కు చేరువైంది. ట్రైలర్ చూస్తే మొదట కామెడీ టోన్ తోనే సినిమా సాగుతుందని అర్థమైంది. అయితే ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రేమికులు ఈ మూవీ కథాంశంపై కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, మోహన్ బాబు ల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'మేజర్ చంద్రకాంత్ 'తో పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ పాత్ర […]

రష్మిక చేతిలో ఒకే ఒక్క సినిమా

Posted: 07 Jan 2020 04:30 AM PST

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్లు ఎవరంటే ఇద్దరంటే ఇద్దరి పేర్లు మాత్రం గుర్తొస్తాయి. వాళ్లలో ఒకరు పూజా హెగ్డే, రెండు రష్మిక. వీళ్లిద్దరికీ ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉంది. చేతినిండా సినిమాలున్నది కూడా వీళ్లిద్దరికే. అయితే ఇక్కడే చిన్న షాక్ ఇస్తోంది రష్మిక. భారీ క్రేజ్ పెట్టుకొని కూడా చేతిలో ఒకే ఒక్క సినిమా ఉందని ప్రకటించింది ఈ బ్యూటీ. అవును.. సరిలేరు నీకెవ్వరు సినిమాను మినహాయిస్తే, రష్మిక చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా […]

ట్రయిలర్ రివ్యూ: ‘అలా..’ కానిచ్చారు

Posted: 07 Jan 2020 01:46 AM PST

బన్నీలో ఫుల్ ఎనర్జీ ఉంటుంది. త్రివిక్రమ్ రైటింగ్ లో ఓ రకమైన సెటైర్ ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేస్తే మంచి సినిమా తయారవుతుంది. సరిగ్గా అల వైకుంఠపురములో సినిమా ఇలాంటి ఫ్లేవర్ తోనే తెరకెక్కింది. రాత్రి రిలీజైన ఈ ట్రయిలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బన్నీ స్టయిల్, త్రివిక్రమ్ పంచ్ లు ట్రైలర్ లో బాగానే దట్టించారు. అంతా బాగుంది కానీ, ఎందుకో ఈ ట్రయిలర్ చూస్తున్నంతసేపు త్రివిక్రమ్ పాత సినిమాలు “అలా..అలా” […]

రాళ్లు వేయించడం కాదు… మగాళ్లైతే నువ్వు లేదా నీకొడుకు లోకేష్‌ రండి… తేల్చుకుందాం…

Posted: 07 Jan 2020 01:13 AM PST

తనపై దాడి చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. చినకాకాని వద్ద టీడీపీ కార్యకర్తలు తన కారుపై రాళ్ల దాడి చేయడంపై స్పందించిన పిన్నెల్లి… వ్యక్తిగతంగా తనపై దాడి చేయాలనుకుంటే టైం చెప్పాలని తానే వస్తానన్నారు. చంద్రబాబు వస్తారో, ఆయన కుమారుడు వస్తాడో, టీడీపీ నేతలెవరొస్తారో తేల్చుకునేందుకు తాను సిద్ధమన్నారు. విజయవాడ వెళ్తున్న సమయంలో ప్రధాన రహదారిపై టీడీపీ వారు ధర్నా చేస్తుంటే తాను పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు మీద […]