Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Monday, January 6, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


జగన్‌ పుట్టక ముందే ఆ కంపెనీని సృష్టించాడట

Posted: 06 Jan 2020 08:15 AM PST

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని వికేంద్రీకరించడమే మంచిదంటూ నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్‌ గ్రూప్‌- బీసీజీ సంస్థపైనా కొందరు రగిలిపోతున్నారు. 57 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఏపీకి సంబంధించి బీసీజీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ సంస్థపై సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్‌గా ప్రచారం మొదలుపెట్టారు. ఆ సంస్థకు చెందిన వికీపీడియా పేజ్‌పైనా దండయాత్ర చేశారు. జనవరి 3, 4 తేదీల్లో కొందరు వ్యక్తులు బీసీజీకి చెందిన వివరాలను వికీపీడియాలో ఇష్టానికి మార్చేశారు. […]

నేను జగన్​ను కాదనుకోలేదు…. మోడీతో ఏం మాట్లాడాననేది చెప్పను!

Posted: 06 Jan 2020 07:25 AM PST

ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడంపై.. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వివరణ ఇచ్చారు. తాను ఆర్నెల్లుగా వైకాపాను సమర్థించానని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ ఇప్పటివరకు బాగానే పరిపాలించినట్టు తాను భావిస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని.. అందుకే మోదీ, అమిత్ షాను కలిసినట్టు చెప్పారు. దేశానికి ప్రధానిగా మోదీ నాయకత్వం అవసరమని అన్నారు. ”అనంతరం ప్రధాని మోడీతో ఏం మాట్లాడారు.. అమిత్ షా తో ఏం […]

కల్యాణ్ రామ్ సినిమా కూడా రెడీ

Posted: 06 Jan 2020 07:11 AM PST

సంక్రాంతి బరిలో నిలిచిన మహేష్, అల్లు అర్జున్ సినిమాలు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి కల్యాణ్ రామ్ మూవీ కూడా చేరింది. ఎంత మంచివాడవురా సినిమా కూడా ఈ లాంఛనం పూర్తిచేసుకుంది. ఈరోజు సినిమాను చూసిన సెన్సార్ అధికారులు మూవీకి క్లీన్-U సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం ఇదేననే విషయం సెన్సార్ సర్టిఫికేట్ చూస్తే అర్థమైపోతుంది. ఇక సెన్సార్ టాక్ విషయానికొస్తే.. కల్యాణ్ రామ్, మెహ్రీన్ జంటగా నటించిన […]

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల…. ఫిబ్రవరి 8న పోలింగ్

Posted: 06 Jan 2020 05:07 AM PST

దేశం యావత్తూ అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునిల్ అరోరా ఇవాళ సాయంత్రం 3.30 గంటలకు ఢిల్లీలో ఈ ప్రకటనను వెలువరించారు. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జనవరి 14న ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందని.. జనవరి 21తో నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ అని సీఈసీ అరోరా వెల్లడించారు. […]

మోహన్ బాబుకు ఏమైంది… జగన్ ను కాదనుకున్నట్టేనా?

Posted: 06 Jan 2020 02:07 AM PST

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం.. తమకు నచ్చకుంటే మరో పార్టీలోకి వెళ్లిపోవడం మామూలే. వేళ్లపై లెక్కించగలిగినంత నేతలు తప్ప.. చాలామంది ఇలానే ఓ పార్టీలో చేరి.. అవకాశం రాగానే మరో గూటికి చేరిపోతుంటారు. చిరంజీవి అంతటి వ్యక్తే.. ప్రజారాజ్యాన్ని స్థాపించి.. చివరికి పార్టీ నడిపించలేక తన రాజకీయ సంస్థానాన్ని సమస్తం కాంగ్రెస్ లో కలిపేశారు. కేంద్ర మంత్రి పదవితో సంతృప్తి పొంది.. మళ్లీ సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా.. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ అడుగులు.. […]

చేసిన పొరపాటే.. మళ్లీ మళ్లీ చేస్తున్న చంద్రబాబు

Posted: 06 Jan 2020 01:59 AM PST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మంచి విజన్ ఉన్న నాయకుడు అని చాలామంది చెబుతుంటారు. కొన్ని విషయాల్లో అది నిజమే అనుకోవచ్చు. ఈ దిశగా ఆయన పాటించే కొన్ని విధానాలు మాత్రం.. చాలాసార్లు విమర్శలపాలయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో… చంద్రబాబు వ్యవహార శైలి కూడా ఇలానే మారుతోంది. పదే పదే హైదరాబాద్ తో పోలిక పెడుతూ.. అమరావతి గురించి వ్యాఖ్యలు చేయడాన్ని కొందరు టీడీపీ ప్రేమికులు తప్ప.. మెజారిటీ ప్రజలు హర్షించలేకపోతున్నారు. తాజాగా.. […]

సీఎం చెప్పినా బేఖాతరు… పేషీల్లో ఇంకా పాత వాసనలే…

Posted: 06 Jan 2020 01:10 AM PST

పాలనపై తనదైన ముద్ర వేయడంతో పాటు అవినీతి విమర్శలకు తావు ఉండకూడదని తొలి నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు. అందుకు తగ్గట్టు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వాటిని ఆచరించే విషయంలో మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం మాటను కూడా లెక్క చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రులు, కీలక అధికారుల పేషీల్లో ఇంకా పాత వారే పాతుకుపోయి కూర్చున్నారు. ఏళ్ల తరబడి పేషీల్లో పాగా వేసి మొత్తం వారి గ్రిప్‌లో ఉంచుకుని ఇష్టానికి వ్యవహారాలు […]

కొడాలి నాని సారథ్యంలో మంత్రుల బృందం… ఆందోళనల సంగతి తేల్చేస్తారట…

Posted: 06 Jan 2020 01:08 AM PST

అమరావతి రైతుల ఆందోళన నిగ్గు తేల్చేందుకు సీఎం జగన్ రెడీ అయినట్లు తెలిసింది. అసలు రైతులు ఆందోళనలు చేస్తున్నారా? లేక దీని వెనుక టీడీపీ నేతలు, రియల్టర్లు ఉన్నారా? అనే విషయంపై నిజాలు నిగ్గు తేల్చి ఎండగట్టేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా మంత్రి కొడాలి నాని సారథ్యంలో మంత్రుల బృందానికి రాజధాని రైతుల సమస్యలపై చర్చించాలని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కొడాలి నాని తాజాగా విలేకరుల సమావేశంలో రాజధాని రైతులకు పిలుపునిచ్చారు. రైతులను చర్చలకు […]