Translate

Sunday, January 5, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


మరో భారీ సెట్ కు రెడీ అవుతున్న సుకుమార్

Posted: 05 Jan 2020 04:30 AM PST

రంగస్థలం సినిమా కోసం ఏకంగా రంగస్థలం అనే ఊరునే సెట్ గా వేశాడు సుకుమార్. సినిమాలో చాలా భాగం షూటింగ్ అక్కడే జరిగింది. ఇప్పుడు మరోసారి అదే పద్ధతి ఫాలో అవ్వబోతున్నాడు. ఈసారి అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా అడవి సెట్ వేయబోతున్నాడట ఈ దర్శకుడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతోంది బన్నీ-సుక్కూ సినిమా. ఈ సినిమాలో చాలా భాగం శేషాచలం అడవుల్లో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే అలా చేస్తే రెండు సమస్యలు. ఒకటి […]

టీ కప్పులో తుపాను సమసిపోయింది

Posted: 04 Jan 2020 11:56 PM PST

అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాల మధ్య నడిచిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందం తమకు అంగీకారం కాదంటూ బన్నీ బ్యాచ్ తెరపైకి రావడంతో అసలు వివాదం మొదలైంది. దీనికి తోడు తమ సినిమాను మహేష్ మూవీ కంటే ముందే 10వ తేదీకి రిలీజ్ చేస్తామంటూ ఫీలర్లు వదలడంతో మరోసారి రచ్చ రాజుకుంది. ఎట్టకేలకు దిల్ రాజు చొరవతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముగిసింది. ఇంతకుముందు అనుకున్న ప్రకారమే బన్నీ […]

అనీల్ కు పుత్రోత్సాహం

Posted: 04 Jan 2020 11:55 PM PST

ఓవైపు కెరీర్ లోనే అతిపెద్ద సినిమా చేస్తున్నాడు. మరో 6 రోజుల్లో అది రిలీజ్ అవ్వబోతోంది. ఈ ఆనందంలో ఉంటుండగానే మరో ఆనందాన్ని అందుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈరోజు అనీల్ రావిపూడికి కొడుకు పుట్టాడు. ఇటు సినిమా రిలీజ్, అటు కొడుకు పుట్టడం.. ఇలా ఒకే వారంలో డబుల్ ఆనందాన్ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. అనీల్ రావిపూడికి ఇది రెండో సంతానం. ఇంతకుముందు అనీల్ దంపతులకు పాప పుట్టింది. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ తో, […]

ఇదేమిటి…. యనమల ఇలా మాట్లాడుతున్నాడు

Posted: 04 Jan 2020 11:51 PM PST

యనమల మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. గతంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశాడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రజలకు ఒక అవగాహన కలిగించేలా మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఆయన మాటలు వింటుంటే అంతా అయోమయం గందరగోళం. యనమల ఇలా మాట్లాడుతున్నాడేమిటీ అంటూ…. టీడీపీ వాళ్ళు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా ఉద్యోగుల జీతాలకు, పెన్షన్‌లకే సరిపోతుందని ఇంకేం మిగలడం లేదని ఆయన […]

చేతులారా చేసుకుంటున్న చంద్రబాబు?

Posted: 04 Jan 2020 11:24 PM PST

తాను చేస్తే సంసారం… ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉంటోంది. అధికార పార్టీ ఏది చేసినా ఒంటికాలిపై లేచి మరీ గగ్గోలు పెడుతున్నారు. రాష్ర్టాభివృద్దికోసం పరిపాలనను సైతం వికేంద్రీకరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. జి.ఎన్.రావు కమిటీ, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను సైతం చంద్రబాబు తూర్పార పడుతున్నారు. వాటిని చిత్తు కాగితాలతో పోలుస్తున్నారు. జి.ఎన్.రావు […]

పీఎస్‌ఆర్‌ చేతికి ఏసీబీ

Posted: 04 Jan 2020 10:57 PM PST

ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలను అప్పగించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు రవాణా శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సీతారామాంజనేయులుకు ఈ రెండు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ పనితీరు కనపరచకపోవడంతో ఇప్పటివరకు […]

కేటీఆర్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ ను చంపేస్తారేమో – రేవంత్ 

Posted: 04 Jan 2020 10:50 PM PST

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు. ప్రతీసారి కేసీఆర్ అంటేనే ఉవ్వెత్తున లేచే రేవంత్ తాజాగా కేటీఆర్ మీద పడ్డారు. కేటీఆర్ సీఎం అంటూ జరుగుతున్న ప్రచారం చూసి కొంప దీసి కేసీఆర్ ను చంపేస్తారేమో.. కేటీఆర్ తో కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంటనే కేటీఆర్ ను ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గడ్డి అన్నారం […]

పౌరసత్వ సవరణ బిల్లుపై కొహ్లీ నో కామెంట్

Posted: 04 Jan 2020 09:58 PM PST

విషయం తెలియకుండా మాట్లాడటం తగదన్న కెప్టెన్ పౌరసత్వ సవరణబిల్లుపై ఓవైపు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంటే…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం నో కామెంట్ అంటూ తప్పించుకొన్నాడు. శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ లోని తొలి మ్యాచ్ గౌహతి బారస్పారా స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్యభారత రాష్ట్ర్రాలు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చే్స్తున్నాయి. అయితే…పౌరసత్వసవరణ బిల్లుపై తాను మాట్లాడేదేమీలేదని…ఆ బిల్లు పట్ల తనకు తగిన అవగాహనలేదని భారత కెప్టెన్ విరాట్ కొహ్లీవ్యాఖ్యానించాడు. […]