Translate

Saturday, January 4, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


లారెన్స్ కు సర్దిచెప్పిన అక్షయ్ కుమార్

Posted: 04 Jan 2020 06:45 AM PST

ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అక్షయ్ కుమార్. దీనికి ‘లక్ష్మీబాంబ్’ అనే పేరుపెట్టారు. సౌత్ లో సూపర్ హిట్టయిన కాంచన సినిమాకు రీమేక్ ఇది. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంతా సజావుగా సాగుతున్న టైమ్ లో ఈ సినిమా నుంచి హఠాత్తుగా తప్పుకున్నాడు దర్శకుడు లారెన్స్. సినిమాకు సంబంధించి దర్శకుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అతడి అభిప్రాయం కూడా తీసుకోకుండా సినిమా నుంచి ఓ స్టిల్ ను ఫస్ట్ లుక్ గా […]

డబ్బింగ్ పూర్తిచేసిన నాగశౌర్య

Posted: 04 Jan 2020 05:40 AM PST

తన సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా ప్రతి పనిని పూర్తిచేస్తున్నాడు నాగశౌర్య. సొంత సినిమా కావడం, స్వయంగా తనే కథ రాసుకోవడంతో.. అశ్వథ్థామపై చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి డబ్బింగ్ పూర్తిచేశాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాతో ఆశించిన స్థాయిలో ప్రమోషన్ అందుకోలేకపోతున్నాడు శౌర్య… దీనికి కారణం సంక్రాంతి సినిమాలే. సంక్రాంతి బరిలో ఉన్న మహేష్, […]

సగటున సంవత్సరంలో 1800 గంటలు ఫోన్ తోనే….

Posted: 04 Jan 2020 05:33 AM PST

సైబర్ మీడియా రీసెర్చ్ (సిఎంఆర్) సహకారంతో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో చేసిన పరిశోధన నివేదిక ప్రకారం… ప్రతి భారతీయుడు సంవత్సరంలో సగటున 1800 గంటలు మొబైల్‌తో గడుపుతున్నాడు. సైబర్‌మీడియా రీసెర్చ్ (సిఎంఆర్) పరిశోధనలో సగానికి పైగా ప్రజలు మొబైల్ ఫోన్‌ల వ్యసనం బారిన పడ్డారని, అది లేకుండా జీవించలేక పోతున్నారని తేలింది. 'స్మార్ట్‌ఫోన్ మానవ సంబంధాలపై దాని ప్రభావం' అనే పేరుతో విడుదలైన నివేదిక…భారతీయ వినియోగదారులపై మొబైల్ ఫోన్ ల ప్రభావాన్ని చక్కగా వివరించింది. స్మార్ట్ […]

ఈ తల్లి కోతి ఫొటో…. కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది…

Posted: 04 Jan 2020 05:23 AM PST

అమ్మ ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుంది? రోడ్డు ప్రమాదం లో తల పగిలిపోయి రక్తం ఓడుతున్నా ఓ తల్లి తన పిల్లను అక్కున చేర్చుకుని పాలివ్వడం చూపరులను కన్నీటి పర్యంతం చేసింది. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్-హైదరాబాదు హై వే అడవి గుండా సాగుతుంది. కోతుల్లాంటి చిన్న చిన్న జంతువులు ఈ రహదారిపైకి వచ్చి ప్రయాణీకులు ఇచ్చే తినుబండారాలను తీసుకుని తింటూ ఉంటాయి. ఇది మామూలు సంగతే. అడవిలో తిండి దొరక్క ఆకలితో అలమటిస్తూ తినడానికి ఏమైనా […]

తెలంగాణ సీఎస్ పోస్టింగ్ లో క్విడ్ ప్రోకో…

Posted: 04 Jan 2020 12:42 AM PST

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియామకం తెలంగాణ ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమేశ్ కుమార్ కంటే సీనియర్లు చాలా మంది ఉన్నా అందరికంటే జూనియర్ అయిన నాలుగేళ్లు సర్వీసు ఉన్న సోమేష్ ను నియమించడంలో అర్థమేంటి అని ఐఏఎస్ లు చర్చించుకుంటున్నారట. సీఎం కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించి క్విడ్ ప్రోకోలో ఈ డీల్ కుదుర్చుకున్నారని తాజాగా కాంగ్రెస్ ఆరోపించడం ఆసక్తి రేపుతోంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ అధికార ప్రతినిధి […]

ఈ ఇద్దరిపై… దిల్ రాజు 60కోట్లు పెట్టాడా?

Posted: 04 Jan 2020 12:14 AM PST

కరవకంటే పాముకు కోపం.. విడవకంటే కప్పకు కోపం అన్నట్టుగా తయారైందట టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కలా ఇప్పుడు కోట్లు పెట్టుబడి పెట్టి… తేడా వస్తే నిండా మునిగేందుకు రెడీ అయ్యారన్న టాక్ టాలీవుడ్ నుంచి వినిపిస్తోంది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వురు' సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామి. ఇక అల్లు అర్జున్ హీరోగా వస్తున్న 'అల వైకుంఠపురం' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజే తీసుకున్నారు. ఈ రెండు తెలుగు […]

అమరావతి బంద్… డిఫెన్స్ లో పడిపోయిన చంద్రబాబు

Posted: 03 Jan 2020 10:46 PM PST

నాడు ఉమ్మడి ఏపీలో రెండు కళ్ల సిద్ధాంతం పేరిట అటు తెలంగాణలో ఒక అడుగు.. ఇటు ఏపీలో మరో అడుగు వేసి తాను అందరి వాడినని చంద్రబాబు చెప్పుకున్నారు. ఇప్పుడు జగన్ విసిరిన 3 రాజధానుల పాచికలో మాత్రం చంద్రబాబు ఒకే కన్నుతో చూస్తున్నారు… చంద్రబాబును ఏపీ సీఎం జగన్ డిఫెన్స్ లోకి నెట్టారు. తాజాగా రాజధానిపై బీసీజీ సంస్థ జగన్ కు నివేదికను అందజేసింది. విశాఖను రాజధానిగా చేస్తే బెటర్ అంటూ నివేదిక ఇచ్చింది. దీంతో […]

ఈ ఏడాదిలోనే బ్లాక్ బస్టర్ సీక్వెల్

Posted: 03 Jan 2020 09:30 PM PST

గత సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఎఫ్2 మాత్రమే. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్స్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎఁటర్ టైనర్ గా తెరకెక్కిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ చేస్తామంటూ అప్పట్లోనే యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే, అందులో నటించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెంకీ, వరుణ్ కూడా ప్రకటించారు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. ఈ ఏడాదిలోనే ఎఫ్2కు […]