Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Friday, January 31, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


జేసీ దివాకర్ రెడ్డి గనుల లీజ్‌ రద్దు

Posted: 31 Jan 2020 04:30 AM PST

అనంతపురము జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి  ప్రభుత్వం ఇచ్చిన గనుల లీజుల్ని రద్దు చేసింది. యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బి లో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజుల్ని రద్దు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు వెలువరించింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి […]

రోజా ఆడియో మెసేజ్…. వైసీపీలో కలకలం

Posted: 31 Jan 2020 04:22 AM PST

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఆడియో మెసేజ్ వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అధికార పార్టీలో అంతా సామరస్యంగా ఉందని భావించిన వారికి రోజా ఆడియో విన్నాక స్పష్టంగా మంత్రి పెద్దిరెడ్డితో ఆమెకు విభేదాలున్నాయన్న విషయం ఇట్టే తెలిసిపోతోందంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆడియో ఒకటి వైసీపీ వర్గాల్లో వైరల్ అయ్యింది. మీడియాలోనూ ఇది హైలైట్ అయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యే కార్యక్రమానికి తన నగరి నియోజకవర్గంలోని నేతలెవరూ హాజరు కావద్దని.. ఒకవేళ హాజరు […]

పవన్ పై ఈగ వాలనీయని టీడీపీ… 

Posted: 31 Jan 2020 03:12 AM PST

టీడీపీకి తెరవెనుక స్నేహితుడు పవన్ కళ్యాణ్ అని మొన్నటి ఎన్నికల వేళ అధికార వైసీపీ చేసిన విమర్శలను అందరూ లైట్ తీసుకున్నారు. పవన్ సైతం తనకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే ప్రయత్నాలు చేశారు. తాజాగా బీజేపీకి దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. ఆయన పార్టీలోని కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ తీరు నచ్చక బయటకు వెళ్లిపోయారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. […]

ఈ గుసగుసల్లో నిజమెంత?

Posted: 31 Jan 2020 02:06 AM PST

రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం అధినేత అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మండలి రద్దును ఆపేందుకూ.. ఆయన అదిరిపోయే ప్లాన్ వేశారని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే.. తన పార్టీకే చెందిన కొందరు ఎంపీలు బీజేపీలో చేరితే.. చంద్రబాబు అంత సీరియస్ గా స్పందించలేదు. పైగా.. ఆయననే వెళ్లి చేర్పించినట్టు మాట్లాడారు. ఇప్పుడు మండలి విషయంలోనూ ఇలాంటి వ్యూహాన్నే చంద్రబాబు అమలు చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. తన పార్టీకి […]

వైసీపీ ఎమ్మెల్యేకి విద్యార్ధి నాయకుల నిరసన

Posted: 30 Jan 2020 10:59 PM PST

కృష్ణాజిల్లా నందిగామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు జరిగిన నాడు-నేడు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా విద్యార్ధి నాయకులు తమ స్కూల్‌ లో అదనపు తరగతి గదులు కావాలంటూ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు చూపిస్తూ నిరసన తెలియజేశారు. ఈ జిల్లా పరిషత్‌ హై స్కూల్లో సుమారు వెయ్యి మంది విద్యార్ధులు చదువుకుంటుంటే మొత్తం 12 క్లాసు […]

జగన్‌ను కలిసిన జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌

Posted: 30 Jan 2020 10:42 PM PST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ గురువారం నాడు ఆయన కార్యాలయంలో కలిశారు. చలమేశ్వర్‌తో పాటు నర్సరావుపేట పార్లమెంట్‌ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఉన్నారు. తనను కలిసిన చలమేశ్వర్‌ కు సీఎం జగన్‌ శాలువా కప్పి సత్కరించారు. న్యాయమూర్తి కాకముందు జాస్తి చలమేశ్వర్‌ తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. స్వర్గీయ ఎన్టీరామారావుకు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత […]

దర్శకుడికి భూమి కేటాయింపు… హైకోర్టు అభ్యంతరం

Posted: 30 Jan 2020 10:32 PM PST

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తెలంగాణకు చెందిన దర్శకుడు, నిర్మాత శంకర్ అధికార టీఆర్ఎస్ తో ఎంతో సాన్నిహిత్యం నెరుపుతుంటాడు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంటాడు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం కూడా గత ఏడాది జూన్ 21న ఆయకు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలి మోకిల్లా గ్రామంలో స్టూడియోకోసం 5 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 75 జారీ చేసింది. ఎకరా 5 లక్షల చొప్పున మాత్రమే […]

విశాఖ… అమరావతి… మధ్యలో ఓ పోస్టు కార్డు

Posted: 30 Jan 2020 07:43 PM PST

విశాఖ సరే.. అమరావతి సరే.. మధ్యలో ఈ పోస్టు కార్డు ఏంటి అనుకోకండి. అసలు విషయం తెలుసుకోండి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. టీడీపీ నేతలు చాలా రోజులుగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. ఇటు.. వైసీపీ ప్రభుత్వం మాత్రం.. మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో.. తమ వాదనలో బలాన్ని నిరూపించుకునేందుకు వైసీపీ నేతలు ఓ అడుగు ముందుకు వేశారు. మంత్రి కన్నబాబు.. విశాఖ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోస్టు కార్డు ఉద్యమాన్ని […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan