Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Thursday, January 30, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


చిరంజీవితో పని పూర్తిచేసిన రెజీనా

Posted: 30 Jan 2020 07:07 AM PST

చిరంజీవి, కొరటాల శివ సినిమా సెట్స్ పైకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోకాపేటలో భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లోనే షూట్ మొదలైంది. ఇప్పుడా షెడ్యూల్ ను యూనిట్ కంప్లీట్ చేసింది. తొలి షెడ్యూల్ లో భాగంగా రెజీనాపై ఓ స్పెషల్ సాంగ్ తీశారు. చిరంజీవి-రెజీనా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారట. భాస్కరభట్ల రాసిన ఈ పాటకు మణిశర్మ మంచి ఫోక్ బీట్ అందించాడు. ఈ పాట షూటింగ్ పూర్తిచేయడంతో పాటు […]

టక్ జగదీష్ పని మొదలుపెట్టాడు

Posted: 30 Jan 2020 06:59 AM PST

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో V అనే సినిమాను ఈమధ్యే పూర్తిచేశాడు నాని. వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈరోజు నాని హీరోగా టెక్ జగదీష్ అనే సినిమా లాంఛ్ అయింది. ఇదేదో కొత్తగా ప్రకటించిన సినిమా కాదు. ఇంతకుముందే ఈ ప్రాజెక్ట్ ను టైటిల్ తో సహా ప్రకటించారు. ఆ సినిమానే ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతోంది టక్ జగదీష్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో నిన్ను కోరి అనే […]

జనసేనకు లక్ష్మీనారాయణ గుడ్‌ బై

Posted: 30 Jan 2020 06:54 AM PST

సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్‌ బై చెప్పాడు. సినిమాల్లో నటించను, ప్రజాసేవే ముఖ్యం అని చెప్పిన పవన్ ఇప్పుడు మళ్లీ క్లాప్ కొట్టడం జేడీలో అసంతృప్తిని తీసుకొచ్చినట్లు ఆయన లేఖ ద్వారా తెలుస్తోంది. నిలకడ లేని నిర్ణయాలతో ముందుకెళ్తున్న పవన్‌తో కలిసి నడవడం కష్టమని భావించి.. జనసేన నుంచి బయటకి వస్తున్నట్లు లేఖలో తెలియజేశాడు లక్ష్మీనారాయణ. పార్లమెంట్‌ ఎన్నికల టైమ్‌లో చివరి నిమిషంలో లక్ష్మీనారాయణ జనసేననలో చేరాడు. విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేశాడు… […]

బాలయ్య హిందూపూర్ పర్యటన.. రచ్చ రచ్చ

Posted: 30 Jan 2020 06:45 AM PST

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన నియోజకవర్గమైన అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించిన సందర్భం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం.. ఇరు పక్షాల మధ్య తోపులాట వరకూ వెళ్లింది. రాయలసీమ ద్రోహి బాలకృష్ణ అంటూ వైసీపీ నేతలు.. బాలయ్యకు మద్దతుగా టీడీపీ కార్యకర్తల నినాదాలతో.. హిందూపురంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రహమతపురం సర్కిల్ లో పర్యటించిన బాలకృష్ణను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. […]

రాజీనామా గుట్టు విప్పిన డొక్కా మాణిక్య వరప్రసాద్

Posted: 30 Jan 2020 06:36 AM PST

తెలుగుదేశం నేత డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తీరుపై స్పందించారు. తనకు తానుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ ఆలోచన.. తన వ్యక్తిగత ఆలోచనకు భిన్నంగా ఉన్నందునే.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అందుకే తాను ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇదే విషయమై తెలుగు దేశం పార్టీలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. టీడీపీ.. 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ విషయంలో మాత్రమే.. ప్రస్తుతం రాజకీయంగా […]

కరోనా విలయం: 17 దేశాలు… 170 దాటిన మృతులు

Posted: 30 Jan 2020 06:31 AM PST

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. క్షణక్షణానికి తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే 17 దేశాలకు విస్తరించి.. 170కి పైగా ప్రాణాలను బలితీసుకుందని లెక్కలు చెబుతున్నాయి. అంతే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మరో 17 వందల కేసులు ఈ వైరస్ బారిన పడిన వారికి సంబంధించి నమోదయ్యాయి. చైనా నేషనల్ హెల్త్ మిషన్ చెబుతున్న లెక్కలు కూడా.. కరోనా ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. రోజుకు ఏకంగా.. 1,370 కేసులు నమోదవుతున్నాయని అంటున్న ఆ లెక్కలు.. […]

ఆర్ఆర్ఆర్ కు…. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ల పారితోషికం ఎంతంటే…

Posted: 30 Jan 2020 05:55 AM PST

సినిమా తీయకముందే బేరం ఆడుకొని నాకింత, నీకింత అని నిర్మాతను పీల్చి పిప్పి చేసేకంటే.. మన టాలెంట్ తో సినిమాను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి మార్కెట్ చేసి వచ్చిన లాభాలను సమానంగా పంచుకోవాలన్న తెలివిగల నిర్ణయాలను దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసుకుంటారు. కేవలం సినిమా తీసి వదిలేయకుండా ఆ సినిమాను ఎలా మార్కెట్ చేయాలో.. ఎలా హైప్ క్రియేట్ చేయాలో.. ఎలా కోట్లు సంపాదించాలో రాజమౌళికి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటారు. ఆయన తీసిన బాహుబలి సినిమాకు […]

రాజమౌళి హిట్ ఫార్ములా ఇదే…. సీనియర్ హీరో కామెంట్స్

Posted: 30 Jan 2020 01:34 AM PST

రాజమౌళి. బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' మూవీతోనూ అదే సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యాడు. తన మొదటి సినిమా నుంచి బాహుబలి వరకు సక్సెస్ సీక్రెట్ ఏంటి? రాజమౌళి హిట్ ఫార్ములా ఏంటనేది అందరిలోనూ ఆసక్తి కలిగించే అంశమే. ఇప్పుడా హిట్ ఫార్ములాను బయటపెట్టాడు తెలుగు సీనియర్ హీరో. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోగా వెలుగు వెలిగి అనంతరం కనుమరుగై… ఇప్పుడు దక్షిణాదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుడు సుమన్ […]