Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Friday, January 3, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


బన్నీ సినిమా సెన్సార్ పూర్తి

Posted: 03 Jan 2020 07:12 AM PST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా నిడివి 156 నిమిషాలు ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా మరో బ్రాండ్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసింది యూనిట్. కానీ ఆశ్చర్యకరంగా రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. నిజానికి సినిమాలన్నీ సెన్సార్ కోసం ఎదురుచూస్తుంటాయి. ఎప్పుడు సెన్సార్ అయిపోతుందా, వెంటనే విడుదల తేదీని (నిబంధనల […]

ఫలించిన విజయసాయిరెడ్డి ప్రయత్నాలు

Posted: 03 Jan 2020 03:59 AM PST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నాలు ఫలించాయి. పాకిస్థాన్‌ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడిపించేందుకు విజయసాయిరెడ్డి చేసిన కృషి ఫలించింది. ఈనెల 6న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను విడుదల చేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. వాఘా సరిహద్దు వద్ద ఉత్తరాంధ్ర జాలర్లను భారత్ అధికారులకు అప్పగిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు భారత విదేశాంగ శాఖకు పాకిస్థాన్‌ ప్రభుత్వం సమాచారం అందించింది. ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులు పొట్టకూటి కోసం గుజరాత్‌ వలస వెళ్లారు. గుజరాత్‌ […]

ఆలస్యంగా అల్పాహారం పెట్టిందని… కోడలిని తుపాకితో కాల్చి చంపాడు

Posted: 03 Jan 2020 03:56 AM PST

షామ్ లాల్ అనే పంజాబ్ కి చెందిన ఓ మామ ఆలస్యంగా అల్పాహారం (టిఫిన్)పెట్టిందని కోడలిని తుపాకితో కాల్చి చంపాడు. గురువారం జరిగిన ఈ సంఘటన స్త్రీల పట్ల భారతీయ పురుషులు కొందరు ఎంత అమానవీయంగా, పెత్తందారీతనం తో వ్యవహరిస్తారో మరోసారి తెలియజేసింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ ప్రాంతానికి చెందిన షామ్ లాల్ భారత వైమానిక దళంలో పనిచేసి రిటైర్ అయ్యాడు. గురువారం నాడు ఉదయం ఆకలవుతున్నదని అల్పాహారం పెట్టమని కోడలు నీలం కుమారిని అడిగాడు. అయితే ఆ […]

బొండా నిరూపించు… రాజీనామా చేస్తా… నీకే రాసిస్తా…

Posted: 02 Jan 2020 10:54 PM PST

మంగళగిరి మండలం నీరు కొండ గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే భార్య పేరున 5 ఎకరాలు భూమి కొన్నారని… కావాలంటే ఆ విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే అఫిడవిట్‌లో చూసుకోవచ్చని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన ఆరోపణపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. తన భార్య పేరిట 5 ఎకరాలు ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు… ఆ భూమిని కూడా బోండా ఉమాకే రాసిస్తామన్నారు. అఫిడవిట్‌లో ఐదు ఎకరాలు భూమి వివరాలు […]

రాయపాటిపై ఈడీ కొరడా… రుణం రూ.8,832 కోట్లు, దారి మళ్లించింది రూ. 3,822 కోట్లు

Posted: 02 Jan 2020 10:50 PM PST

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. రెండు రోజుల క్రితం సీబీఐ ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. రాయపాటితో పాటు ఆయన కుమారుడిపైనా కేసు నమోదు చేశారు. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. రాయపాటిపై కేసు నమోదు చేసింది. భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించిన ఈడీ ఆ మేరకు కేసులు నమోదు చేసింది. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ పైనా కేసు నమోదు చేసింది ఈడీ. […]

శాటిలైట్ చెప్పిన నిజం… గోదావ‌రి జిల్లాల్లో త‌గ్గుతున్న వరి సాగు

Posted: 02 Jan 2020 10:48 PM PST

మత్స్య పరిశ్రమ విరాజిల్లుతోంది. ఫిషరీస్‌ ఇండస్ట్రీ విస్తరిస్తోంది. మత్స్య ఉత్పత్తుల రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ పేరుగడిస్తోంది. ఒకప్పుడు పంట పొలాలతో కళకళలాడిన భూములన్నీ నేడు మత్స్య ఉత్పత్తుల కేంద్రాలుగా మారాయి. గోదావరి జిల్లాలు మత్స్య పరిశ్రమకు కేరాఫ్‌ అడ్రస్‌గా వర్ధిల్లుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానానికి ఆంధ్రప్రదేశ్‌ ఎదిగింది. ఈ ఏడాది ఒక్క ఏపీ నుంచే రూ.16,372 కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేయడం విశేషం. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రోత్సాహంతో మత్స్య […]

నాగబాబు కామెంట్స్ పై…. జబర్ధస్త్ టీం కౌంటర్ అటాక్ ఇలా ప్లాన్ చేసింది….

Posted: 02 Jan 2020 10:16 PM PST

జబర్ధస్త్ ను వీడి సొంత కుంపటి పెట్టి మల్లెమాలపై తీవ్ర విమర్శలు చేసిన మెగా బ్రదర్ నాగబాబును టార్గెట్ చేసింది ఈటీవీ-మల్లెమాల టీం. తాజాగా జీతెలుగులో 'అదిరింది' ప్రోగ్రాంను జబర్ధస్త్ కు పోటీగా నిర్వహిస్తున్న నాగబాబు.. ఆ స్కిట్ లలోనూ జబర్దస్త్ ను టార్గెట్ చేస్తున్నారు. జబర్ధస్త్ లో అగ్రిమెంట్ ఉంటుందని… పేమెంట్ ఇవ్వరంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ ను నిర్వహించే మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా నాగబాబుకు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఆదివారం రాత్రి 9.30 […]

భారత్ తో టీ-20 సిరీస్… గౌహతీ చేరిన మలింగ సేన

Posted: 02 Jan 2020 09:00 PM PST

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా జనవరి 5 నుంచి భారత్ తో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో తలపడటానికి యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ నాయకత్వంలోని శ్రీలంకజట్టు సభ్యులు అసోంలోని గౌహతి చేరుకొన్నారు. పౌరసత్వబిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగుతున్న నేపధ్యంలో… గౌహతిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కొలంబో నుంచి గౌహతీ చేరిన శ్రీలంకజట్టు సభ్యులు నేరుగా తమ విడిది కోసం ఏర్పాటుచేసిన స్టార్ హోటెల్ కు వెళ్లారు. మ్యాచ్ వేదికగా ఉన్న బరాస్ పారా స్టేడియం […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan