Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Wednesday, January 29, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


సిక్స్ ప్యాక్ విలన్ అవుతా

Posted: 29 Jan 2020 06:21 AM PST

సునీల్ కు విలన్ అవ్వాలనే కోరిక ఇప్పటికి కాదు. నిజానికి అదే ఆశయంతో ఇండస్ట్రీకి వచ్చాడు. కాకపోతే అతడొకటి తలిస్తే విధి మరొకటి తలచింది. అలా విలన్ అవ్వాలనుకున్న వ్యక్తి కాస్తా కమెడియన్ అయిపోయాడు. అయితే హాస్యనటుడిగా మారినా సునీల్ మనసులో కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరింది కూడా. డిస్కోరాజా సినిమాలో విలన్ గా కనిపిస్తాడు సునీల్. సినిమా మొత్తం పాత సునీలే కనిపించినప్పటికీ, క్లైమాక్స్ లో మాత్రం విలన్ సునీల్ […]

సెన్సార్ పూర్తిచేసుకున్న అశ్వథ్థామ

Posted: 29 Jan 2020 04:19 AM PST

మరో 2 రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది అశ్వథ్థామ సినిమా. నాగశౌర్య-మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. అయితే ఇక్కడ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న అంశం సినిమా రన్ టైమ్. అవును.. ఈ సినిమా కేవలం 133 నిమిషాల నిడివి మాత్రమే ఉంది. స్మోకింగ్ యాడ్స్ కూడా తీసేస్తే, సినిమా నిడివి ఇంకా తక్కువన్నమాట. ఇంత తక్కువ నిడివితో అశ్వథ్థామ వస్తోందంటే, కచ్చితంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే […]

విశాఖ రాజధాని, వైఎస్ వివేకా కేసుపై స్పందించిన వైసీపీ సర్కారు

Posted: 29 Jan 2020 04:11 AM PST

విశాఖ రాజధానిగా అనువు కాదని జీఎన్ రావు కమిటీ సూచించిందని.. తుఫాన్లు వస్తే విశాఖ మునిగిపోతుందని.. అది రాజధానిగా పనికిరాదని టీడీపీ అనుకూల మీడియా, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపై అధికారికంగా స్పందించారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘తుపాన్లు వస్తే మాత్రం విశాఖ కొట్టుకుపోతుందా?… తుఫాన్లతో విశాఖకు పెద్దగా నష్టం ఉండదు'  అని స్పష్టం చేశారు. […]

ఉరి ఎలా వేసుకోవాలో చూపించబోయాడు… అతనే బలయ్యాడు!

Posted: 29 Jan 2020 03:59 AM PST

సరదాగా.. చేసిన ఓ ప్రయత్నం ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యకు ఓ కొత్త విషయం చెబుదామని చేసిన యత్నం.. విషాదాంతమైంది. భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు పడిన ఆరాటం.. వృథా ప్రయాసే అయ్యింది. ఈ విషాద ఘటన.. తమిళనాడులోని మదురై జిల్లా చోళైయళగుపురంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చోళైయళగుపురానికి చెందిన మహ్మద్ అలీకి రెండు నెలల క్రితం పెళ్లయ్యింది. అతని వయస్సు కేవలం 22 ఏళ్లే. తన భార్యతో ఓ సందర్బంలో సరదాగా మాట్లాడుతున్న అతను.. […]

చైనాలో చిక్కుకుపోయిన 58 మంది ఆంధ్రులు…

Posted: 29 Jan 2020 03:50 AM PST

చైనాలో ఉన్న తెలుగు వాళ్లు.. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే.. వైరస్ సోకి మాత్రం కాదు. చైనాలో అమల్లో ఉన్న నిబంధనల వల్ల. అసలు విషయం ఏంటంటే.. చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నగరాల్లో ఉహాన్ నగరం కూడా ఒకటి. అక్కడే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన 96 మంది యువ ఇంజినీర్లు విధి నిర్వహణ నిమిత్తం అక్కడే ఉంటున్నారు. ఓ సంస్థకు సిబ్బందిగా ఎంపికై అక్కడ పని చేస్తున్నారు. గత ఏడాది […]

ఫ్యాన్స్ కు షాకిచ్చిన రాజమౌళి…. 2021కి ఆర్ఆర్ఆర్ వాయిదా

Posted: 29 Jan 2020 01:25 AM PST

దాదాపు 400 కోట్ల సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' తర్వాత తీస్తున్న మూవీ. దీనిపై ఎన్నో అంచనాలున్నాయి. అలాంటి సినిమాను సీజన్ లేనప్పుడు విడుదల చేస్తే నిర్మాతకు నష్టాలే. ఇన్నేళ్ల వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆర్ఆర్ఆర్ మూవీని అందరూ అనుకున్న జూలై 31న కాకుండా… 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్టు సమాచారం. ఇందుకు సహేతుక కారణం కూడా రాజమౌళి చెబుతున్నాడట. […]

నాకేం కాలేదు.. అధైర్య పడకండి.. నేను బాగానే ఉన్నా..!

Posted: 28 Jan 2020 10:36 PM PST

మ్యాన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంటరీ చిత్ర షూటింగ్ సమయంలో.. సూపర్ స్టార్ రజనీకాంత్ కు తీవ్ర గాయాలైనట్టు వచ్చిన వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. రజనీకి ఏమైందన్న ఆలోచన.. అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ చర్చకు వచ్చింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది.. అన్న ప్రశ్నే అంతటా వినిపించింది. అభిమానుల్లో ఆందోళనలు పెరుగుతున్న విషయం తెలిసి స్వయంగా రజనీకాంతే స్పందించారు. తనకు ముళ్లు గీసుకున్నాయి తప్ప.. పెద్దగా ప్రమాదం కాలేదని చెప్పారు. ఎవరూ ఆందోళన పడవద్దన్నారు. […]

మండలి కథ… ఇక్కడ ముగిసింది… అక్కడే మిగిలింది!

Posted: 28 Jan 2020 10:36 PM PST

శాసనమండలి రద్దును ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానం.. కేంద్రానికి చేరింది. శాసనసభలో జరిగిన పరిణామాలను.. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు క్రోడీకరించారు. అనంతరం ప్రభుత్వ అనుమతితో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తీర్మానాన్ని చేరవేశారు. ఈ ప్రక్రియతో.. దాదాపుగా శాసనమండలి రద్దు ప్రక్రియ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ముగిసింది. ఈ విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం నడిచినా.. చివరికి ప్రభుత్వం తను అనుకున్న పనిని మాత్రం పూర్తి చేసింది. ప్రజలకు మేలు చేసే […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan