telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఓవర్సీస్ లో ఆల్ టైమ్ టాప్-5లో “అల”

Posted: 25 Jan 2020 05:30 AM PST

సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్ వచ్చిందో కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ వసూళ్లను ఇష్టమొచ్చినట్టు మార్చేస్తుంటారు. ఇక్కడంతా వీళ్ల చేతుల్లో పని. కానీ ఓవర్సీస్ లో అలా కాదు. అక్కడ వసూళ్లన్నీ పక్కాగా ట్రాక్ చేస్తారు. కాబట్టి వాటిని నమ్మొచ్చు. సో… ఎలా చూసుకున్నా అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ లో సూపర్ హిట్ అయిందనేది మాత్రం వాస్తవం. కళ్లముందే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ఈ […]

కమెడియన్ సునీల్.. కోలుకున్నాడు.. మాట్లాడాడు

Posted: 25 Jan 2020 05:14 AM PST

అల వైకుంఠపురంలో, డిస్కోరాజా సినిమాల్లో కీలక పాత్రలతో మళ్లీ యాక్టివ్ అయిన కమెడియన్ కమ్ హీరో సునీల్.. ఈ మధ్య తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. యాంటీ బయోటిక్స్ ను ఎక్కువ మోతాదులో తీసుకున్న కారణంగానే ఇంతటి అవస్థకు సునీల్ గురైనట్టు వార్తలు వచ్చాయి. ఇంకొందరైతే సునీల్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందంటూ లీకులు ఇచ్చారు. చివరికి.. వాటన్నిటినీ పటా పంచలు చేస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తూ.. సునీల్ మాట్లాడాడు. కాస్త కోలుకున్నాడు. ఇన్ […]

బీజేపీ.. జనసేన లాంగ్ మార్చ్ లేనట్టే!

Posted: 25 Jan 2020 05:07 AM PST

ఆంధ్రప్రదేశ్ లో కలిసి రాజకీయాలు చేయాలని అంగీకారానికి వచ్చిన బీజేపీ, జనసేన పార్టీలు.. ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేశాయి. మూడు రాజధానులంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా… రాజధాని రైతులకు మద్దతుగా… ఫిబ్రవరి 2న ఇరు పార్టీలు కలిసి కవాతు చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటన సందర్భంగా… జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. ఇంతలోనే.. ఈ రెండు పార్టీలు మనసు మార్చుకున్నట్టున్నాయి. కవాతు అంటూ ఏదీ చేయడం లేదని.. […]

మున్సిపల్ ఫలితాలపై… హరీష్, రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..!

Posted: 25 Jan 2020 04:44 AM PST

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యాన్ని.. ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దాదాపు 90 శాతం స్థానాలను సొంతం చేసుకుని.. తిరుగులేని రాజకీయ శక్తిగా తన శక్తి సామర్థ్యాలు ఏంటో మరోసారి చాటింది. ఈ నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.. ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు… ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ […]

తెలంగాణలో మళ్లీ.. సారు కారు.. సర్కారుదే హవా

Posted: 25 Jan 2020 04:32 AM PST

తెలంగాణలో మరోసారి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి హవా కనిపించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా బీజేపీ తదితర పార్టీల పాత్ర నామమాత్రమైంది. వందకు పైగా మున్సిపాలిటీల్లోనే కాక.. సింహ భాగం కార్పొరేషన్ లనూ టీఆర్ఎస్ కే అందించారు తెలంగాణ ప్రజలు. ఇతర పార్టీలను అందనంత దూరంలో నిలిపారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే.. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. వారి ఆలోచనలకు తగ్గట్టే.. ఫలితాలు రావడం తెలంగాణ […]

హరీష్ శంకర్-అఖిల్ సినిమా నిజమేనా?

Posted: 25 Jan 2020 03:30 AM PST

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ అక్కినేని హీరో ఓ సినిమా చేస్తాడంటూ కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తుున్నాయి. ఇందులో సగం నిజం ఉంది, ఇంకాస్త అబద్ధం కూడా ఉంది. గద్దలకొండ గణేష్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా చేయాలి హరీష్ శంకర్. ఈ మేరకు అతడు అడ్వాన్స్ అందుకున్నాడు. వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ […]

ఆర్ఆర్ఆర్ నుంచి మరో వీడియో లీక్

Posted: 25 Jan 2020 12:44 AM PST

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటికే ఓ వీడియో లీక్ అయింది. అరకు షెడ్యూల్ లో ఎన్టీఆర్ తలపాగా పెట్టుకొని నటిస్తున్న ఓ సీన్ ను ఎవరో షూట్ చేసి లీక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆర్ఆర్ఆర్ నుంచి మరో వీడియో లీక్ అయింది. ఈసారి కూడా ఎన్టీఆర్ నటించిన సన్నివేశమే కావడం ఆశ్చర్యం. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కు ఓ పులి ఫైట్ పెట్టాడు దర్శకుడు రాజమౌళి. ఈ సీక్వెన్స్ […]

మరో బిడ్డకు జన్మనిచ్చిన స్నేహ

Posted: 24 Jan 2020 11:21 PM PST

హోమ్లీ హీరోయిన్ స్నేహ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న మధ్యాహ్నం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో స్నేహకు ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని ఆమె భర్త ప్రసన్న అధికారికంగా వెల్లడించాడు. తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నట్టు ప్రకటించాడు. పెళ్లయినా సినిమాలు కంటిన్యూ చేస్తోంది స్నేహ. ప్రసన్నను వివాహం చేసుకున్న తర్వాత కూడా పలు తమిళ, తెలుగు, కన్నడ సినిమాలు చేసింది. అదే టైమ్ లో ఆమె గర్భవతి అయింది. ఓ కొడుక్కి జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన తర్వాత […]

Comments