Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Friday, January 24, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


రామోజీరావు కోర్టుకు రావాల్సిందే… మార్గదర్శి కేసులో మళ్లీ కీలక పరిణామం !

Posted: 24 Jan 2020 03:27 AM PST

ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం విచారించింది. మార్గదర్శి చిట్ ఫండ్  చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్‌ చేయడాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ చేస్తూ పిటీషన్‌ వేశారు. దీంతో ఈ పిటీషన్‌ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ సర్కార్‌ను ప్రతివాదిగా […]

మొన్న రిజిస్ట్రేషన్ శాఖ పై…. నేడు రెవెన్యూ ఆఫీసులపై ఏసీబీ దాడులు

Posted: 24 Jan 2020 02:42 AM PST

రవాణాశాఖ కమిషనర్ గా ఉన్న సమయంలో సీతారామాంజనేయులు తన పనితీరుతో జగన్ ను ఆకర్షించారు. ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై ఉక్కుపాదం మోపారు. తన రాజకీయ పలుకుబడితో, అహంకారంతో ఏ అధికారులనూ పట్టించుకోని రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ ఆటకట్టించారు. అక్రమంగా నడుస్తున్న జేసీ బస్సులను సీజ్ చేసి సంచలనం సృష్టించారు. గడిచిన కొన్నేళ్లుగా బస్సుల సామ్రాజ్యాన్ని నిర్మించి అక్రమాలకు ఆలవాలంగా రాజకీయ అండదండలతో నిర్మించిన జేసీ దివాకర్ రెడ్డి […]

‘డిస్కో రాజా’ సినిమా రివ్యూ

Posted: 24 Jan 2020 02:24 AM PST

రివ్యూ :డిస్కో రాజా రేటింగ్ : 2/5 తారాగణం : రవి తేజ, పాయల్ రాజ్ పుత్, నభా నటేష్,  తాన్యా హోప్, బాబీ సింహ, వెన్నెల కిషోర్, సునీల్,  సత్య,  అన్నపూర్ణ, తదితరులు సంగీతం: ఎస్ ఎస్ థమన్ నిర్మాత : రామ్ తాళ్లూరి దర్శకత్వం : వి ఐ ఆనంద్ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రవితేజ ఇప్పుడు ‘డిస్కో రాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వం […]

ఢిల్లీ బీజేపీ ఆఫీసులో అలీ… చేరిక ఖాయమేనా?

Posted: 24 Jan 2020 02:00 AM PST

చంద్రబాబు ప్రభుత్వం చివరి రోజులవీ.. ఎన్నికల వేళ ప్రతిపక్ష వైసీపీకి అండగా కదిలివచ్చారు కొందరు సినీ ప్రముఖులు. టాలీవుడ్ పెద్దలంతా చంద్రబాబు వెంట ఉంటే.. ఫృథ్వీ, అలీ, జీవిత రాజశేఖర్, పోసాని లాంటి కొందరు మాత్రం జగన్ సీఎం కావాలని పాటుపడి ఆయన కోసం ప్రచారం కూడా చేశారు. ఇక కమెడియన్ అలీ ఎన్నికలకు నెల రోజుల ముందు జగన్ కు జై కొట్టారు. ఎవరు మంత్రి పదవి ఇస్తే వారి పార్టీలోనే చేరుతానని ప్రకటించి పార్టీల […]

మీ పిల్లలకు ఫిబ్రవరి 1 చివరి రోజు… ఆఖరి చూపులకు రండి!

Posted: 24 Jan 2020 01:33 AM PST

నిర్భయ కేసులో దోషులకు రోజులు దగ్గర పడుతున్నాయి. రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఫలితాన్ని ఇవ్వని తరుణంతో.. ఫిబ్రవరి 1న వారి ఉరితీతకు ముహూర్తం ఖరారైంది. తిహార్ జైలులో వారి ఉరితీతకు.. ఇప్పటికే ఇసుక బస్తాలతో రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి. ఇలా.. ఉరితీత ఖాయమైన నేపథ్యంలో దోషుల కుటుంబీకులకు జైలు అధికారులు సమాచారం పంపారు. 'మీ పిల్లలకు ఫిబ్రవరి 1 చివరి రోజు. ఆ రోజు ఉరి తీస్తున్నాం. చివరి చూపునకు రండి' అని ఆనవాయితీ […]

‘మండలి రద్దు’ పరిణామాలపై… ఆసక్తికర విషయాలు

Posted: 23 Jan 2020 10:43 PM PST

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో జరిగిన పరిణామాలపై.. జగన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం… తర్వాత సభలో సుదీర్ఘ చర్చ జరగడం మనం చూశాం. ఈ నేపథ్యంలో… మండలి కథ కంచికే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన మీడియా స్రవంతిలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథ ఎక్కడివరకూ వెళ్తుందన్నది ఇప్పుడు అప్రస్తుతం. కానీ.. గతంలో మండలి రద్దు, తర్వాత పునరుద్ధరణ, మళ్లీ తాజా పరిణామాలు గమనిస్తుంటే.. మన మండలి గమనం ఏంటి.. ఎప్పుడు ఏర్పాటైంది.. అన్న విషయాలు చర్చలోకి […]

జగన్‌ తీసుకున్నది మంచి నిర్ణయం – మాజీ కేంద్రమంత్రి

Posted: 23 Jan 2020 10:40 PM PST

విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు. ఈరోజు ఉదయం తిరుమలను దర్శించుకున్న ఆయన… అనంతరం మూడు రాజధానుల విషయంపై స్పందించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ గా ఎంచుకోవడం మంచి నిర్ణయమని దానిని తాను స్వాగతిస్తున్నానన్నారు. రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు శివరామకృష్ణన్‌ నివేదికను తుంగలో తొక్కారని… తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికోసం రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కృషిచేయాలని కోరారు.

సోమవారం నాటికి…. తేలనున్న మండలి భవితవ్యం

Posted: 23 Jan 2020 10:40 PM PST

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసమండలిలో బ్రేకులు పడడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వంగా తాము రూపొందించిన బిల్లులపై సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాల్సిన మండలి.. ఇలా అడ్డుకోవడం ఏంటని.. ఆగ్రహించింది. ఈ విషయమై.. నిన్న శాసనసభలో కాస్త సుదీర్ఘంగానే చర్చ జరిగింది. ముఖ్యమంత్రి జగన్ సహా.. మంత్రులు బుగ్గన, ధర్మాన.. మరికొందరు తమ అభిప్రాయాలను విస్పష్టం చేశారు. ఏటా శాసనమండలికి 60 కోట్లు ఖర్చు పెడుతున్నామని.. నిర్వహణ, జీత భత్యాల కోసం ఈ ఖర్చు తప్పడం […]