Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Thursday, January 23, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


సరిలేరు నీకెవ్వరంటూ సైలెంట్ అయ్యారు

Posted: 23 Jan 2020 03:40 AM PST

రిలీజైన మొదటి రోజు నుంచి తమ సినిమా ఇంత కలెక్ట్ చేసింది, తమ సినిమా అంత కలెక్ట్ చేసిందంటూ ఊదరగొట్టింది సరిలేరు నీకెవ్వరు యూనిట్. మరీముఖ్యంగా ప్రొడ్యూసర్ అనీల్ సుంకర రంగంలోకి దిగి మరీ వసూళ్ల పోస్టర్లు వరుసపెట్టి విడుదల చేశారు. అలా 46 కోట్ల రూపాయల షేర్ నుంచి 200 కోట్ల రూపాయల గ్రాస్ వరకు పోస్టర్లు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇలా ప్రతి రోజూ హంగామా చేసిన యూనిట్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అవును.. […]

పేరుకే పరిమితమైన గణతంత్రం

Posted: 23 Jan 2020 02:53 AM PST

దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. జనావళిలో ఎక్కువ భాగం, ప్రధానంగా అణగారిన వర్గాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ దుస్థితి యుద్ధంలాంటివాటివల్ల తలెత్తలేదు. మన దేశాన్ని ఎవరూ చుట్టుముట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఈ విపత్కర పరిస్థితికి కారణం. నింగిలోని చందమామను నేలమీదకు దింపి చేతిలో పెడతామని వాగ్దానం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అన్నింటికన్నా మించి “అత్యధిక పాలన, అతి తక్కువ ప్రభుత్వం ఉంటుంది” అని హామీ […]

కమెడియన్ సునీల్ కు తీవ్ర అస్వస్థత

Posted: 23 Jan 2020 02:23 AM PST

కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టి రాజమౌళి చలువతో 'మర్యాద రామన్న'తో హీరోగా వెలుగు వెలిగి అనంతరం అవకాశాలు లేక మరోసారి కమెడియన్ అవతారం ఎత్తిన సునీల్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే సునీల్ నటించిన 'అల వైకుంఠపురం' సినిమా రిలీజ్ అయ్యింది. 24న 'డిస్కోరాజా' కూడా విడుదలకు రెడీ అయ్యింది. కమెడియన్ గా ఫామ్ అందుకుంటున్న దశలో సునీల్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యాడు. రవితేజ హీరోగా వస్తున్న 'డిస్కోరాజా'లో సునీల్ […]

తగ్గిన ఓటింగ్… టీఆర్ఎస్ లో గుబులు

Posted: 23 Jan 2020 01:34 AM PST

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఆశ్చర్యకరంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పురపాలక సంస్థలలో ఓటింగ్ శాతం తగ్గడం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను షాక్ కు గురిచేస్తోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన నిలబడ్డ వారంతా ఓటేశారా లేదా అన్న టెన్షన్ ఆ పార్టీని పట్టిపీడిస్తోంది. అయితే తెలంగాణ జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ శాతం పెరగడం రాజకీయ వర్గాలను ఉత్సాహపరిచింది. అయితే నిజాంపేట, జవహర్ నగర్, బడాంగపేట్, మణికొండ, జల్పల్లి, […]

డిస్కోరాజాకు రిలీజ్ కు ముందే దెబ్బ

Posted: 22 Jan 2020 10:46 PM PST

రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాకు రిలీజ్ కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సంతృప్తికర స్థాయిలో థియేటర్లు దక్కలేదు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల్ని ఇంకా థియేటర్లలో కొనసాగిస్తున్నారు. దీంతో డిస్కోరాజాకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. రేపు చాలా తక్కువ థియేటర్లలో (ఏపీ, నైజాం కలిపి 250లోపే) రిలీజ్ అవుతోంది ఈ సినిమా. నిజానికి సంక్రాంతి సినిమాల్లో ఏదో ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం […]

మాఫియా డాన్ గా మహేష్

Posted: 22 Jan 2020 10:43 PM PST

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు మహేష్. కుటుంబంతో కలిసి న్యూయార్క్ వెళ్లాడు. మరో 2 నెలల వరకు అతడు సినిమాలకు దూరం. అయితే మహేష్ మూవీస్ కు దూరమైనప్పటికీ, అతడి సినిమాలకు చెందిన అప్ డేట్స్ మాత్రం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఈ ప్రాజెక్టులో మాఫియా డాన్ గా కనిపిస్తాడట మహేష్. అంటే.. మరోసారి మహేష్ ను వంశీ పైడిపల్లి మోస్ట్ […]

ఇన్ సైడర్ ట్రేడింగ్… భూముల కొనుగోలుదారులపై సీఐడీ కేసు నమోదు

Posted: 22 Jan 2020 10:34 PM PST

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డ 796 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొంతమంది ఎకరం భూమి రూ.3 కోట్లకు చొప్పున కొనుగోలు చేసినట్లుగా పక్కాగా సీఐడీ పూర్తి ఆధారాలు సేకరించినట్లు సమాచారం. అందులో భాగంగానే వీరిపై కేసునమోదు చేశారని చెబుతున్నారు. తెల్లరేషన్‌ కార్డు దారులు దాదాపు రూ.300 కోట్లతో అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. వీరితో భూములు కొనుగోలు చేయించిన వారి వివరాలు విచారణలో తేలనున్నాయి. భూములు కొనుగోలు […]

వైసీపీ స‌ర్కార్ నెక్ట్స్ ప్లానేంటి?

Posted: 22 Jan 2020 10:07 PM PST

ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ప్రభుత్వం నెక్స్ట్ ప్లానేంటి. ఊహించని విధంగా మండలి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపింది. మరి ఎలాగైనా ఈ బిల్లులను చట్టం చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్ ముందున్న ఆప్షన్లేంటి…? టీడీపీ అడ్డుకునే మార్గాలేంటి..? ఇప్పటిదాకా ఓ ఎత్తైతే… ఇక్కడ నుంచి మరో ఎత్తు. మరి ఇక నుంచి అధికార విపక్షాల మధ్య ఎత్తులు.. పైఎత్తులు ఎలా ఉండబోతున్నాయి. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు మండలికి […]