Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Wednesday, January 22, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


మండలిలో టీడీపీకి షాక్…. వైసీపీకి ఐదుగురు సపోర్టు

Posted: 22 Jan 2020 06:58 AM PST

శాసనసభలో ఏపీకి 3 రాజధానుల బిల్లును అడ్డుకోలేకపోయిన టీడీపీ మండలిలో మాత్రం గట్టిగా పోరాడుతోంది. అయితే ప్రతిగా వైసీపీ… టీడీపీ ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకుంటున్న వైనం టీడీపీని గుబులు పుట్టిస్తోంది. తాజాగా వైసీపీకి మద్దతుగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు ముందుకువచ్చారు. అసెంబ్లీలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా రాజధానుల బిల్లుకు మద్దతు ఇవ్వగా.. మరో ముగ్గురు ఇన్ డైరెక్టుగా టీడీపీకి షాకిచ్చారు. మొత్తం ఐదుగురు వైసీపీకి మద్దతుగా నిలవడం టీడీపీకి షాక్ కు […]

బన్నీ, మహేష్…. ఫేక్ రికార్డ్స్ తో పండుగ చేసుకుంటున్నారా?

Posted: 22 Jan 2020 03:10 AM PST

ఈ సంక్రాంతి ఫైట్ యమ రంజుగా సాగింది. మహేష్ 'సరిలేరు', బన్నీ 'అల వైకుంఠపురం' మధ్య సై అంటే సై అనేలానే వార్ నడిచింది. ఒకరిని మించి మరొకరు ప్లాన్లు చేశారు. ఈ ఫైట్ లో బన్నీ 'అల వైకుంఠపురము'కే ఎక్కువ మార్కులు పడ్డాయి. అయితే సంక్రాంతి ముగిసి విజేత ఎవరో తెలిసినా వీరి మధ్య కలెక్షన్ల యుద్ధం మాత్రం ముగియడం లేదు. తాజాగా బాక్సాఫీస్ వద్ద బన్నీ సినిమా రికార్డులు ఆగడం లేదంటూ ఊదరగొట్టేస్తున్నారు. మహేష్ […]

మళ్లీ రీమేక్ బాట పట్టిన వెంకీ

Posted: 22 Jan 2020 03:05 AM PST

వెంకటేష్ కు రీమేక్స్ కొత్తకాదు. తెలుగు హీరోల్లో అత్యథిక రీమేక్స్ చేసిన హీరో ఇతడే. అయితే ఈమధ్య రీమేక్స్ కాస్త తగ్గించాడు. ఎఫ్2, వెంకీమామ అంటూ స్ట్రయిట్ సినిమాలు చేశాడు. ఇప్పుడు తిరిగి తన పాత ఫార్మాట్ లోకి వచ్చేశాడు వెంకీ. తమిళ్ లో హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు ఈ దగ్గుబాటి హీరో. ఇవాళ్టి నుంచి ఈ సినిమా మొదలైంది. ఈ సినిమాకు నారప్ప అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అనంతపురంలో […]

కీర్తిసురేష్ స్థానంలో ప్రియమణి

Posted: 22 Jan 2020 03:00 AM PST

కీర్తిసురేష్ బాలీవుడ్ సినిమాకు సెలక్ట్ అయిందనేది పాత వార్త. ఇప్పుడు అదే బాలీవుడ్ నుంచి ఆమెను తప్పించారనేది లేటెస్ట్ న్యూస్. అవును.. ప్రతిష్టాత్మక హిందీ ప్రాజెక్టు నుంచి కీర్తిసురేష్ ను తప్పించారు. అజయ్ దేవగన్ సరసన 'మైదాన్' సినిమాలో ఫిక్సయింది కీర్తి సురేష్. 1950 బ్యాక్ డ్రాప్ లో ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జస్ట్ గ్లామరస్ హీరోయిన్ గానే కాదు, తల్లిగా కూడా నటించాల్సి ఉంది. […]

మళ్ళీ తప్పులో కాలేసిన లోకేష్‌

Posted: 22 Jan 2020 01:58 AM PST

వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సందర్భంలో మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు లోకేష్‌ జోక్యం చేసుకుంటూ నవరత్నాల అమలుకోసం ఆలయాలు, చర్చిలు, మసీదుల విలువైన భూములను విక్రయించాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని ప్రభుత్వాన్ని విమర్శించాడు. దీనికి ప్రతిస్పందించిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి శాసనమండలిలో కూడా లోకేష్‌ అబద్ధాలు చెబుతున్నాడని, ప్రభుత్వం అలాంటి జీవోని ఏదీ ఇవ్వలేదని…. లోకేష్‌ ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భంగా ఆ జీవో కాపీలు చూపాలని లేదా కనీసం […]

మళ్లీ విదేశాలకు మహేష్….

Posted: 22 Jan 2020 01:47 AM PST

ఖాళీ సమయాల్లో ఎవరైనా సినిమాలు చూస్తారు, పుస్తకాలు చదువుకుంటారు, క్రికెట్ ఆడతారు, లేదంటే నిద్రపోతారు. కానీ మహేష్ బాబు మాత్రం విదేశాలకు వెళ్లిపోతాడు. అవును.. అటుఇటుగా 4 రోజులు గ్యాప్ దొరికినా చాలు, ఏదో ఒక దేశం చుట్టేస్తుంటాడు ఈహీరో. అలాంటిది ఈసారి ఏకంగా 2 నెలలు గ్యాప్ దొరికేసింది. ఇక ఊరుకుంటాడా? మరోసారి సూట్ కేస్ సర్దేశాడు. ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్లిపోయాడు. Wishing the woman of the house, the woman in […]

వికేంద్రీకరణను స్వాగతించిన బీజేపీ

Posted: 22 Jan 2020 01:41 AM PST

చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు శాసనమండలిలో పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పాలనా వికేంద్రీకరణను బీజేపీ తరపున తాము స్వాగతిస్తున్నామని, ఈ బిల్లులో ప్రాంతీయ బోర్డులు కూడా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. కర్నూలును రాజధానిగా స్వాగతిస్తున్నామని అన్నారు. గతంలో హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని, రాష్ట్రం విడిపోయాక కూడా చంద్రబాబు అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలని ప్రయత్నిస్తున్నారని వీర్రాజు విమర్శించారు. నాడు ప్రధాని మోదీ బొమ్మను […]

సీఏఏపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ…. రాజ్యాంగ ధర్మాసనానికి పిటీషన్లు

Posted: 22 Jan 2020 01:20 AM PST

దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్న పౌరసత్వసవరణ చట్టం (సీఏఏ) అమలు పై సుప్రీం కోర్టు తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కేంద్రంలోని బీజేపీకి ఊరట లభించింది.  కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం పిటీషన్ లతోపాటు దాదాపు 140మంది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్ లను సుప్రీం కోర్టు బుధవారం విచారించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన […]