Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Tuesday, January 21, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


టీడీపీ గుండెల్లో…. వల్లభనేని వంశీ గునపాలు

Posted: 21 Jan 2020 07:37 AM PST

వల్లభనేని వంశీ. ఈ పేరు చెబితే చాలు… తెలుగుదేశం నేతలు చికాకు పడే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఇటీవలే అధినేత చంద్రబాబును చీల్చి చెండాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపించడమే కాదు… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నాటి నుంచి తెలుగుదేశానికి వల్లభనేని కొరకరాని కొయ్యగా తయారయ్యారు. తాజాగా.. అసెంబ్లీ సమావేశాల్లోనూ.. టీడీపీ నేతల వెనకే కూర్చుంటూ.. వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. ఆ పార్టీ గుండెల్లో […]

శాసన మండలి రద్దు ఖాయమే(నా?)!

Posted: 21 Jan 2020 07:33 AM PST

మూడు రాజధానుల ఏర్పాటు దిశగా పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో అత్యంత సులువుగా గట్టెక్కించింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు.. శాసనసమండలి వంతు వచ్చింది. 71 రూలింగ్ నిబంధనల ప్రకారం.. శాసనమండలిలో తెలుగుదేశం సభ్యులు.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సభ ముందుకు రాకుండా అడ్డుకున్నారు. ముందుగా.. తాము డిమాండ్ చేసిన అంశాలపై చర్చకు పట్టుబట్టారు. ఇది నిబంధనలకు లోబడే ఉన్న కారణంగా.. మండలి ఛైర్మన్ బిల్లుకు బ్రేకు వేశారు. ఇక్కడే.. వైసీపీ నేతలు అంతర్మథనంలో పడ్డట్టు సమాచారం. తెలుగుదేశం […]

రచ్చకెక్కిన ‘మా’ లొల్లి…. మరో దుమారం

Posted: 21 Jan 2020 06:58 AM PST

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మరో దుమారం చెలరేగింది. ఇప్పటికే అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు జీవితా రాజశేఖర్ వర్గాలు పైసల కోసం గొడవపడి రచ్చ కెక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి సాక్షిగా రాజశేఖర్ చేసిన రచ్చను ఎవరూ మరిచిపోలేదు. అయితే తాజాగా వీరి ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. రెండు రోజులుగా వీరి మధ్య గొడవలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని మూసివేశారు. ఈ విషయంపై పెద్దలు సర్ధి చెప్పినా […]

పవన్… షూటింగ్ నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి

Posted: 21 Jan 2020 03:20 AM PST

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ తర్వాత ఇక సినిమాలు వదిలేశానని.. మొత్తం రాజకీయం అని బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు 2019 అసెంబ్లీ ఎన్నికలు పీడకలను మిగిల్చాయి. రెండు చోట్ల పోటీచేసి కూడా ఓడిపోయిన దుస్థితిని మనం చూశాం. ఇక లాభం లేదనుకుని మళ్ళీ సినిమాల మీద కూడా దృష్టి పెట్టాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు. సోమవారం తిరిగి సినిమా షూటింగ్ కు హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో జగన్ 3 రాజధానుల బిల్లును ఆమోదించడంతో షూటింగ్ […]

కదులుతున్న గణతంత్ర కుదుళ్లు

Posted: 21 Jan 2020 03:18 AM PST

మనం గణతంత్ర దేశంగా అవతరించి వచ్చే జనవరి 26కు 70 ఏళ్లు అవుతాయి. గణతంత్రంగా అవతరించడానికి ఓ నేపథ్యం ఉంది. మనం నిర్దిష్టమైన రాజ్యాంగం సిద్ధం చేసుకున్నాం. ఈ రాజ్యాంగ రచనకు మనకు స్ఫూర్తినిచ్చిన అనేక రాజ్యాంగాలున్నాయి. వివిధ దేశాల్లోని మంచి విషయాలను మన రాజ్యాంగంలోనూ చేర్చాం. అందుకే కొందరు మన రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు. నిజమే. అతుకుల బొంత అయినా అది అందమైనదే. రాజ్యాంగ పీఠికలో మనది సార్వభౌమాధికారంగల సోషలిస్టు, సెక్యులర్, ప్రజాస్వామ్య గణతంత్రంగా […]

ఏపీకి 3 రాజధానులు… కేంద్రం జోక్యంపై క్లారిటీ వచ్చేసింది

Posted: 21 Jan 2020 01:58 AM PST

ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో బిల్ పెట్టారు.. దాన్ని ఆమోదించారు కూడా. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ దీన్ని కేంద్రంతో కలిసి నరుక్కురావడానికి రెడీ అయిపోయారు. ఈ మేరకు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. ఇంతకీ జగన్ తీసుకొచ్చిన 3 రాజధానులపై కేంద్రం ఏమనుకుంటుదనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల కాలంలో ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. […]

ఆ సినిమా టైటిల్ శేషాచలం కాదు

Posted: 21 Jan 2020 01:15 AM PST

సుకుమార్ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇదంతా శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. దీంతో ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిని దర్శకుడు సుకుమార్ ఖండించాడు. తమ సినిమాకు శేషాచలం అనే టైటిల్ పెట్టలేదని స్పష్టంచేశాడు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడనే టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాకు లారీడ్రైవర్ అనే పేరుపెట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి. వీటిని కూడా యూనిట్ […]

నిశ్శబ్దంగా వాయిదాపడింది

Posted: 21 Jan 2020 12:52 AM PST

అనుష్క సినిమా అంటే మార్కెట్లో హాట్ కేక్. ఆమె సినిమా రావడమే ఆలస్యం ఇలా బిజినెస్ అయిపోతుంది. ఫిమేల్ ఓరియంటెండ్ మూవీస్ కు ఆమె కేరాఫ్ గా మారింది. అయితే ఆశ్చర్యకరంగా అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా మాత్రం ఎందుకో స్తబ్ధుగా మారింది. లెక్కప్రకారం, ఈ సినిమా మరో 10 రోజుల్లో (జనవరి 31) విడుదలవ్వాలి. కానీ ఇప్పుడీ మూవీ వాయిదాపడింది. దీనికి కారణం సినిమా బిజినెస్ పూర్తికాకపోవడమే. అవును.. నిశ్శబ్దం సినిమా బిజినెస్ పూర్తవ్వలేదు. తెలుగులో […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan