Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Thursday, January 2, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


జాన్ షూటింగ్ అప్ డేట్స్

Posted: 02 Jan 2020 01:30 AM PST

ఏడాది కిందట ఆగిపోయిన జాన్ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 7 నెలల కిందటే ఆగిపోయింది. ఇక ఆ సినిమా రాదని అంతా ఫిక్స్ అయిపోయిన టైమ్ లో మరోసారి యూనిట్ నుంచి అప్ డేట్ వచ్చింది. జాన్ షూటింగ్ ఈ వారంలోనే మొదలవుతుంది. సాహోతో పాటు జాన్ షూటింగ్ స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పారిస్ లో […]

బాబు ఆవేదన…. కమ్మ జనాభే లేదట

Posted: 02 Jan 2020 12:06 AM PST

మొన్నటి ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడి సామాజికవర్గం నాయకుల ఆధిపత్యం, ద్వేషపూరిత వ్యాఖ్యల వల్లే ఇతర కులాల వారిలో ఆగ్రహం పెల్లుబుకి చంద్రబాబు ఓడిపోయారని.. ఇది ఓ కారణమన్న వాదన వినిపించింది. తాజాగా అమరావతిలో పర్యటించిన చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిని కమ్మ నగరంగా ముద్రవేస్తున్నారని.. కులం పేరుతో విద్వేషం సృష్టిస్తున్నారని… చంద్రబాబు పర్యటించిన ఎర్రబాలెం గ్రామంలో మొత్తం 8000 జనాభా ఉంటే కేవలం 100 మంది మాత్రమే కమ్మవారు ఉన్నారని కులాల వారీగా లెక్కలు […]

ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు…. కాబోయే సీఎం కేటీఆరే

Posted: 02 Jan 2020 12:02 AM PST

ఇప్పటికే మంత్రి శ్రీనివాసగౌడ్ రేపిన మాటల వేడి చల్లారలేదు.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తానే తెలంగాణ ముఖ్యమంత్రి అని.. కేటీఆర్ కు ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా… రెస్ట్ తీసుకున్నా… తర్వాత సీఎం కేటీఆరేనని మంత్రి శ్రీనివాసగౌడ్ స్పష్టం చేశారు. దీనిపై ఇంటా బయటా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు మరో గొంతు బయటకు వచ్చింది. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ […]

రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ

Posted: 01 Jan 2020 09:48 PM PST

బన్నీ-మహేష్ మధ్య మరోసారి పోటీ మొదలైందని అంతా అనుకున్నారు. అనుకున్న తేదీ 12న కాకుండా.. 2 రోజుల ముందే అంటే 10వ తేదీకే బన్నీ సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అదే కనుక జరిగితే, మహేష్ కూడా తగ్గడని, తన సినిమాను కూడా 10వ తేదీకే విడుదల చేస్తాడంటూ ప్రచారం కూడా సాగింది. ఎట్టకేలకు ఈ వివాదం సమసిపోయింది. ఇంతకుముందు అనుకున్న తేదీలకే రెండు సినిమాలూ వస్తున్నాయి. బన్నీ సినిమా ఇంతకుముందు ప్రకటించినట్టుగానే 12వ తేదీనే […]

ఇవ్వాల్సింది బంగారు గాజులు కాదు… హెరిటేజ్ భూములు – భువనేశ్వరికి డిప్యూటీ సీఎం కౌంటర్

Posted: 01 Jan 2020 09:24 PM PST

చంద్రబాబు ఓ ఎత్తు వేస్తే అధికార వైసీపీ నేతలు అంతకుమించిన ఎత్తులు వేస్తున్నారు. తన భార్యతో సెంటిమెంట్ పండించిన చంద్రబాబుకు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అదిరిపోయే కౌంటర్లతో బెంబేలెత్తించారు. తాజాగా తన భార్యతో కలిసి అమరావతిలో పర్యటించారు చంద్రబాబు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తన చేతులకు ఉన్న బంగారు గాజులను ఆ మహిళా రైతులకు ఇచ్చారు. అయితే తాజాగా దీనిపై కౌంటర్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ […]

కొహ్లీ, స్మిత్ లను మించిన మార్నుస్

Posted: 01 Jan 2020 09:22 PM PST

2019 లో వెయ్యి పరుగుల ఏకైక క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో 2019 సీజన్ ముగిసింది. సరికొత్త సీజన్ కు తెరలేచింది. అయితే…గత ఏడాదికాలంలో క్రికెట్ అత్యుత్తమ ఆటగాడిగా భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ.. టాప్ ర్యాంక్ నిలబెట్టుకొన్న వెయ్యి పరుగుల ఘనతను సాధించలేకపోయాడు. ఈ ఘనతను ఆస్ట్ర్రేలియా యువసంచలనం మార్నుస్ లాబ్ చేంజ్ దక్కించుకొన్నాడు. 2019 సీజన్లో అత్యంత విజయవంతమైన, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మార్నుస్ మొత్తం 11 టెస్టులు 16 ఇన్నింగ్స్ లో 1104 పరుగులతో […]

సంక్రాంతి సినిమాల నిడివి ఫిక్స్

Posted: 01 Jan 2020 08:54 PM PST

సరిలేరు నీకెవ్వరు – 2 గంటల 48 నిమిషాలు అల వైకుంఠపురములో – 2 గంటల 36 నిమిషాలు ఎంత మంచివాడవురా – 2 గంటల 22 నిమిషాలు సంక్రాంతి సినిమాల రన్ టైమ్స్ ఇవి. ఇంకా సెన్సార్ పూర్తికాని ఈ సినిమాలకు సంబంధించి ప్రస్తుతానికి ఈ నిడివి ఫిక్స్ చేశారు. వీటిలో ఏ సినిమా పరిస్థితి ఏంటనేది ఓసారి చేద్దాం… సరిలేరు నీకెవ్వరు నిడివి ఇప్పటికే లిమిట్ దాటిపోయింది. ఆల్రెడీ షకలక శంకర్ కామెడీ ట్రాక్ […]

మ‌ద్యం అమ్మ‌కాల రికార్డు…!

Posted: 01 Jan 2020 08:11 PM PST

ఓ వైపు ఆర్ధిక‌మాంద్యం అంటున్నారు. కానీ డిసెంబ‌ర్ 31 నాడు జ‌రిగిన మ‌ద్యం అమ్మ‌కాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోయేలా సేల్స్ పెరిగాయి. ఆర్ధిక‌మాంద్యంలో కూడా ఎక్సైజ్ శాఖ కు డిసెంబ‌ర్ 31 కాసులు కురిపించింది. రికార్డు స్థాయిలో ఈ సారి మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. డిసెంబ‌ర్ 31 నుంచి జనవరి 1 వరకు దాదాపు 210 కోట్ల రూపాయల మ‌ద్యం అమ్ముడుపోయిన‌ట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. సాధార‌ణ రోజుల్లో 25 నుంచి 30 కోట్ల రూపాయ‌ల మందు […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan