Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Saturday, January 18, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ వసూళ్లు

Posted: 18 Jan 2020 04:31 AM PST

మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల షేర్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఆశ్చర్యకరంగా రాత్రి జరిగిన సక్సెస్ సంబరాల్లోనే ఈ పోస్టర్ ను విడుదల చేశారు. నిజానికి లెక్కలన్నీ తేలడానికి కాస్త టైమ్ పడుతుంది. కానీ 7వ రోజు రన్ పూర్తికాకుండా వంద కోట్ల షేర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సంగతి పక్కనపెడితే.. […]

వైసీపీ ఎమ్మెల్యేలకు లోకేష్‌ హెచ్చరిక

Posted: 18 Jan 2020 04:24 AM PST

అమరావతి కోసం ఉండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్‌ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్‌… గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధులకు హెచ్చరిక జారీ చేశారు. అమరావతి కోసం వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పోరాటంలో పాల్గొనాలని, తాను హెచ్చరిక జారీ చేస్తున్నానన్నారు‌. ముఖ్యమంత్రి పై ఒత్తిడి పెంచాలని… మీరు రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడితే మటుకు మీరు రెండు జిల్లాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక జారీచేస్తున్నాను అంటూ… ఆవేశంగా మాట్లాడారు […]

‘సరిలేరు’ సినిమాకు కత్తెర…. యూనిట్ షాకింగ్ నిర్ణయం?

Posted: 18 Jan 2020 12:07 AM PST

సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో విజయవంతంగా నడుస్తోంది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా. తాజాగా హీరో మహేష్ బాబు కూడా సక్సెస్ మీట్ లకు హాజరవుతూ సినిమాకు మరింత ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో, ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే సినిమా నిడివి ఎక్కువగా ఉండడం.. పలు కామెడీ సీన్లు పండకపోవడంతో ప్రేక్షకుల టాక్ ప్రకారం కొన్ని సీన్లకు కత్తెర వేయడానికి సినిమా యూనిట్ సిద్ధమైనట్టు సమాచారం. సరిలేరు సినిమా రిలీజ్ కు […]

పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్న మేధావులు

Posted: 18 Jan 2020 12:05 AM PST

పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ పంచన చేరడంతో ఆయన మీద ఆశలు పెట్టుకున్న కొందరు సోషల్ మీడియా వేదికగా తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళల్లో ఎక్కువ మంది రచయితలు, మేధావులు కావడం విశేషం. పవన్‌ కళ్యాణ్‌ గొప్పనటుడు… ఆయనకు సన్నివేశం, డైలాగ్‌ లు రాసిస్తే అవలీలగా నటించే అలవాటు ఉన్నవాడు. ఇప్పటివరకూ మంచి స్క్రిప్ట్‌లు అందిస్తూ దర్శకుడిగా, నిర్మాతగా చంద్రబాబు ఉన్నా…. ఇప్పుడు అంతకు మించి నాగపూర్‌ వాసులైన గొప్ప దర్శకుడు, నిర్మాత దొరికాడు అంటూ […]

షిర్డీ సాయి పుట్టిందెక్కడ? సరికొత్త వివాదం !

Posted: 17 Jan 2020 10:09 PM PST

సాయిబాబా జన్మ స్థలం ఎక్కడ? ఆయన షిర్డీలో పుట్టలేదా? ఇప్పుడు ఈ అంశం దేశంలో కలకలం రేపుతోంది. షిర్డి సాయిబాబా పర్బిని జిల్లాలోని పత్రిలో పుట్టారని.. ఆ ఊరును డెవలఫ్‌ చేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే ప్రకటించారు. దీంతో సాయిబాబా జన్మభూమి ఏంటి అనే దానిపై చర్చ మొదలైంది. సద్గురు సాయిబాబా జన్మస్థలం పర్బిని జిల్లాకు చెందిన 'పత్రి' అని స్థానికులు భావించి 1999లో శ్రీ సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడికి వేల సంఖ్యలో […]

ఆమెకు, ఎస్వీబీసీకి సంబంధం లేదు…

Posted: 17 Jan 2020 10:00 PM PST

బాబోయ్ మా పరువు కాపాడండీ అని వేడుకుంటున్నారు టీటీడీ ఆధీనంలోని ఎస్వీబీసీ ఛానల్‌ మహిళా ఉద్యోగులు. ఇదే విన్నపంతో ఛానల్ కార్యనిర్వాహక అధికారికి లేఖ రాశారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీతో ఫోన్ కాల్‌ లీక్‌ కావడంతో ప్రస్తుతం ఛానల్‌లో మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. మాజీ చైర్మన్‌ పృధ్వీతో ఫోన్ మాట్లాడిన మహిళను ఎప్పుడో విధుల నుంచి తప్పించారు. కానీ.. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి అది మీరేనా.. మీరేనా.. అంటూ ప్రశ్నిస్తున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు […]

రోహిత్ శర్మ 7వేల పరుగుల రికార్డు

Posted: 17 Jan 2020 09:08 PM PST

వన్డేల్లో అత్యంతవేగంగా 7వేల పరుగుల ఓపెనర్ భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 7వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా పేరుతో ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో 42 పరుగుల స్కోరు సాధించడం ద్వారా రోహిత్ ఈ […]

రాజ్ కోట వన్డేలో రాజా భారత్

Posted: 17 Jan 2020 06:32 PM PST

కంగారూలను దెబ్బకు దెబ్బతీసిన విరాట్ సేన భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఆరునూరైనా నెగ్గితీరాల్సిన రెండోవన్డేలో భారత్ 36 పరుగుల విజయం సాధించడంతో సిరీస్ రసపట్టుగా మారింది. రాజ్ కోట లోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన డూ ఆర్ డై రెండో వన్డేలో ఆతిథ్య భారత్ 36 పరుగులతో నెగ్గి సిరీస్ లో 1-1తో సమఉజ్జీగా నిలిచింది. టాస్ ఓడినా 340 స్కోరు…. బ్యాటింగ్ కు స్వర్గధామం లాంటి రాజ్ […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan