Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Friday, January 17, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


నేను ముందే చెప్పాను… ఎవరూ నమ్మలేదు – పవన్ పై కేఏపాల్ సెటైర్లు

Posted: 17 Jan 2020 03:36 AM PST

చాలా రోజుల తర్వాత ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మళ్లీ ఫేస్ బుక్ లో ప్రత్యక్షమయ్యారు. తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యాన్సులు చేస్తే ఏపీకి పెట్టుబడులు వస్తాయా? అని పవన్ కళ్యాణ్ ను కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ నిజస్వరూపం ఇప్పుడే బయటపడిందని పాల్ కామెంట్స్ చేశారు. మోడీతో అత్యంత దగ్గర సంబంధాలు ఉంటే ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రజలు […]

గో మాంసం నుంచి కోడిగుడ్డు దాకా….

Posted: 17 Jan 2020 03:34 AM PST

బీజేపీ అధికారంలోకి రాగానే గో మాంస భక్షణ పై తీవ్ర ఆందోళన చేసింది. పవిత్రమైన గో మాత మాంసం ఈ దేశంలో ఎవరూ తినడానికి వీలులేదని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు హుకుం జారీ చేశారు. గోవులను తరలిస్తున్న వారిపై దాడులు చేశారు. కొంతమందిని చంపేశారు కూడా. ఇలా దాడులు చేసిన వారిలో ఓబీసీలే ఎక్కువమంది. అప్పుడు కొందరు కమ్యూనిస్టులు ఒక విమర్శ చేశారు. ఇప్పుడు గో మాంసం మీద నిషేదం విధించిన వాళ్ళు రేపు మాంసాహారం మీదే […]

భారత కుర్రాళ్లకు ప్రపంచకప్ పరీక్ష!

Posted: 17 Jan 2020 01:50 AM PST

ప్రపంచ క్రికెట్ కు చిరునామా భారత్ కొత్త దశాబ్దంలోని తొలి సంవత్సరంలోనే జూనియర్ ప్రపంచకప్ టైటిల్ కు గురిపెట్టింది. దక్షిణాఫ్రికా వేదికగా మూడువారాలపాటు సాగే సమరంలో డిఫెండింగ్ చాంపియన్ గా, హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకూ జరిగే ఈ సమరంలో 16 దేశాలకు చెందిన జట్లు ఢీ కొనబోతున్నాయి. 2020 దశాబ్దంలో తొలి అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి దక్షిణాఫ్రికాలో రంగం సిద్ధమయ్యింది. రెండుసంవత్సరాలకోసారి జరిగే […]

అంతే తేడా: చిరంజీవి కలిపేశాడు… పవన్ జతకట్టాడు

Posted: 16 Jan 2020 11:10 PM PST

రాజకీయ తెరపై సినీ అగ్ర తారలు… అన్నాదమ్ముల ప్రస్థానం ఒకేలా సాగేలా కనిపిస్తోంది. ప్రజారాజ్యం పెట్టి దూసుకొచ్చిన చిరంజీవి మొదటి ప్రయత్నంలోనే ఎన్నికల్లో 18సీట్లు సాధించి ఫర్వాలేదని అనిపించారు. అయితే తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరిగారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న కంటే ఘోరంగా 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసి రెండు చోట్లా ఓడిపోయారు. మొదట పొత్తుతో సపోర్టు చేసి బీజేపీ, టీడీపీలకు తోడ్పడ్డ పవన్.. తొలిసారి ఒంటరిగా […]

27మంది క్రికెటర్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు

Posted: 16 Jan 2020 11:04 PM PST

గ్రేడ్-ఏ ప్లస్ క్రికెటర్లుగా కొహ్లీ,రోహిత్, బుమ్రా ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు..2020 సీజన్ కు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారత ప్రధాన ఆటగాళ్లు మొత్తం 27 మందికి నాలుగు గ్రేడ్లుగా కాంట్రాక్టులను ఖరారు చేసింది. త్రీ-ఇన్-వన్ లో ముగ్గురే… సాంప్రదాయ టెస్ట్, ఇన్ స్టంట్ వన్డే, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో భారత్ కు కీలక ఆటగాళ్లుగా ఉన్న కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, యార్కర్ల […]

చివరికి శైలజానాథ్ దిక్కయ్యాడు…

Posted: 16 Jan 2020 11:02 PM PST

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ పగ్గాలు వదిలేసి.. రాజకీయాలకు సెలవు ప్రకటించేసి సుబ్బరంగా తన సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. దాదాపు 8 నెలల సుధీర్ఘ విరామం తరువాత ఏపీలో స్తబ్దుగా మారిన కాంగ్రెస్ పార్టీకి ఒక చీఫ్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఏఐసీసీ గురువారం ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి, సీమ సీనియర్ నాయకుడు శైలజానాథ్ ను నియమించింది. కాంగ్రెస్ సీనియర్ […]

ధోనీకి కాంట్రాక్టులేకపోడం పై బీసీసీఐ వివరణ

Posted: 16 Jan 2020 10:52 PM PST

జట్టులో చోటుకు కాంట్రాక్టుతో పనిలేదన్న బీసీసీఐ భారత ఎవర్ గ్రీన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి..2019-2020 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కకపోడం గురించి బీసీసీఐ వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఆరుమాసాలపాటు క్రికెట్ కు దూరమైన క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో చోటు ఉండదని…ఆ కారణంగానే ధోనీకి గ్రేడింగ్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాంట్రాక్టు లేని కారణంగా టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో ధోనీ చోటుకు ఎలాంటి ఇబ్బందీలేదని వివరణ ఇచ్చింది. 2020 ఐపీఎల్ సీజన్లో.. ధోనీస్థాయికి తగ్గట్టుగా […]

కలెక్షన్ల యుద్ధం: మహేష్, బన్నీ అతడి నుంచి నేర్చుకోవాల్సిందేనా?

Posted: 16 Jan 2020 10:35 PM PST

టాలీవుడ్ లో ఇప్పుడు కలెక్షన్ల యుద్ధం నడుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన మహేష్ బాబు 'సరిలేరు, అల్లు అర్జున్ 'అల వైకుంఠపురం' రెండు హిట్ కావడంతో కలెక్షన్లపై కాకిలెక్కలు చెబుతూ తామే సంక్రాంతి విన్నర్ లు అంటూ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ అని… ఇన్ని మిలియన్లు వసూలు చేసిందంటూ… ఏకంగా పోస్టర్లు విడుదల చేస్తుండడం విశేషం. అయితే ఈ ధోరణి అభిమానులను, ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రొడక్షన్ హౌస్ లు విడుదల చేసే […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan