Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Thursday, January 16, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


అభిమానికి క్లాస్ పీకిన పూజా హెగ్డే

Posted: 16 Jan 2020 07:30 AM PST

తనను కలవడానికి వచ్చిన ఓ అభిమానికి క్లాస్ పీకింది హీరోయిన్ పూజా హెగ్డే. అయితే ఇదంతా సీరియస్ గా కాదు, కేవలం అభిమానంతోనే ఈ పని చేసింది ఈ బుట్టబొమ్మ. ఈ ఘటన ముంబయిలో జరిగింది. పూజా హెగ్డే చేతిలో చివాట్లు తిన్న ఆ అభిమాని పేరు భాస్కర రావు. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం. పూజా హెగ్డేను చూడడం కోసం, ఆమెను కలవడం కోసం చాలా దూరం నుంచి ముంబయికి వచ్చాడు ఈ భాస్కర రావు. […]

సరిలేకు నీకెవ్వరు 5 రోజుల వసూళ్లు

Posted: 16 Jan 2020 04:45 AM PST

సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. నిన్నటితో 5 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 68 కోట్ల 22 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ 5 రోజుల్లో సినిమా 80శాతం రికవర్ అయినట్టు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 76 కోట్ల రూపాయలకు అమ్మారు. సో.. ఈ వీకెండ్ నాటికి దాదాపు అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ దాటి లాభాల బాట […]

విశ్వవిద్యాలయాలు ఆలోచనా నిలయాలు

Posted: 16 Jan 2020 04:43 AM PST

విశ్వవిద్యాలయాలు వ్యవస్థలుగా తమంతట తాము ప్రస్థానం సాగించవు. విశ్వవిద్యాలయాల ఆలోచన ఆకట్టుకునేట్టుగా ఉంటే అవి ప్రఖ్యాతిలోకి వస్తాయి. అందుకే విశ్వవిద్యాలయాలంటే కేవలం భవనాలు కావు. అంకెలు కావు. విశ్వవిద్యాలయాలు వాస్తవానికి వ్యవస్థాగతమైన భావ సముచ్ఛయాలు. ఆ భావాలలో మానవీయ విలువలు ఉంటాయి. విశ్వవిద్యాలయాలకు సూత్రప్రాయమైన భావాలు ఉంటాయి. ఇలాంటి విలువలతో కూడిన భావాలను సంస్థాగతం చేయడం, ఆలోచనలకు నెలవులుగా మార్చడం అవి నిర్వర్తించవలసిన బాధ్యత. ఆదర్శవంతంగా నిలవాల్సిన విశ్వవిద్యాలయాలు సృజనాత్మక ఆలోచనలను, ఆ ఆలోచనలు చేసే వారిని […]

ఎంత మంచివాడవరు మొదటి రోజు వసూళ్లు

Posted: 16 Jan 2020 04:40 AM PST

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా ఎంత మంచివాడవురా. సంక్రాంతి సీజన్ లో ఆఖరి చిత్రంగా వచ్చిన ఈ మూవీ నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ, సంక్రాంతి సీజన్ కావడంతో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అలా ఎంత మంచివాడవురా మూవీకి వరల్డ్ వైడ్ 4 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఫస్ట్ […]

“అలా” అత్యుత్సాహం చూపిన బన్నీ

Posted: 16 Jan 2020 04:25 AM PST

అల వైకుంఠపురములో సినిమా వచ్చి నిన్నటితో 4 రోజులు పూర్తయింది. ఈ 4 రోజులకే నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ అయినట్టు ప్రకటించుకున్నాడు అల్లు అర్జున్. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇది కాస్త అత్యుత్సాహమే అవుతుంది. సైరా, సాహో, రంగస్థలం లాంటి సినిమాల్ని కాదని, 4 రోజులకే వాటిని అధిగమిస్తూ.. నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేశామని యూనిట్ ప్రకటించడమే నిజంగా తొందరపాటు చర్యే అవుతుంది. సాధారణంగా కలెక్షన్ల విషయంలో మేకర్స్ నేరుగా జోక్యం చేసుకోరు. ఎంత కలెక్ట్ […]

ఈ ప్రశ్నకు కేసీఆరే జవాబు చెప్పాలి…

Posted: 16 Jan 2020 02:47 AM PST

'రాననుకున్నారా.. రాలేననుకున్నారా?' అని చిరంజీవి ఇంద్ర సినిమాలో చెప్పిన ఓ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఈ డైలాగ్ కు కాస్త అర్థం మార్చి.. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన అభిమానులు, సామాన్యులు కొందరు ఓ ప్రశ్న వేస్తున్నారు. రావద్దనుకున్నారా.. రావద్దని ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు.. కేసీఆర్ ప్రచారం చేయరు.. అంతా నాదే బాధ్యత.. ఈ ఎన్నికల్లో […]

చంద్రబాబు సవాల్ కు మంత్రి అవంతి ప్రతి సవాల్….

Posted: 15 Jan 2020 09:31 PM PST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన 3 రాజధానుల ప్రతిపాదనపై ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు 3 రాజధానులకే అనుకూలంగా నిర్ణయం ఇస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఈ సవాల్ పై.. అటు తెలుగుదేశంలోనూ ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనూ చర్చ బాగానే జరిగింది. ఇంతలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ విషయంలో […]

కొహ్లీ ఖాతాలో పరమచెత్త రికార్డు

Posted: 15 Jan 2020 09:30 PM PST

10 వికెట్ల ఓటమి పొందిన భారత తొలి కెప్టెన్ భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎన్నో గొప్పగొప్ప రికార్డులు సాధించిన కెప్టెన్ విరాట్ కొహ్లీ…తొలిసారిగా తనపేరుతో ఓ చెత్తరికార్డును సైతం మూటగట్టుకోవాల్సి వచ్చింది. వన్డే క్రికెట్ నాలుగో ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో 10 వికెట్ల పరాజయం పొందిన భారతజట్టుకు విరాట్ కొహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. గతంలో భారతజట్టు 1981లో న్యూజిలాండ్, 1997లో వెస్టిండీస్, 2000లో సౌతాఫ్రికా, 2005లో సౌతాఫ్రికా జట్లపైన […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan