Translate

Wednesday, January 15, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


‘ఎంత మంచివాడవురా!’ సినిమా రివ్యూ

Posted: 15 Jan 2020 02:40 AM PST

రివ్యూ : ఎంత మంచివాడవురా రేటింగ్ : 2/5 తారాగణం : కళ్యాణ్ రామ్, మెహరీన్, తనికెళ్ళ భరణి, శరత్ బాబు, సుహాసిని, విజయకుమార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు సంగీతం: గోపి సుందర్ నిర్మాత : ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త దర్శకత్వం :  సతీష్ వేగేశ్న ‘118’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మొట్టమొదటిసారిగా ఒక పూర్తి ఫ్యామిలీ కథ చిత్రం అయిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో ప్రేక్షకుల […]

భారతీయ ‘జనసేన’ సమితి…. రేపే ముహూర్తం?

Posted: 14 Jan 2020 11:01 PM PST

చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన షాక్ నుంచి చాలామంది ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పుడు అంతటి నిర్ణయం కాకున్నా.. ఆ పరిణామానికి దగ్గర్లో.. అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. రాజధాని కోసం అమరావతిలోని కొందరు రైతుల పోరాటం.. ఇటు మూడు రాజధానుల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నం… వీటి నడుమ రాష్ట్రం రాజకీయంగా రగులుతున్న వేళ.. దిల్లీ వెళ్లడం.. బీజేపీతో 'అవగాహన' కుదుర్చుకోవడం లాంటి పనులు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ […]

రీ-ఎంట్రీలో సానియా విజయారంభం

Posted: 14 Jan 2020 11:00 PM PST

2017 తర్వాత సానియా తొలివిజయం అంతర్జాతీయ టెన్నిస్ లో సానియా ఓ మధురమైన విజయాన్ని సొంతం చేసుకొంది. ఓ బిడ్డకు తల్లిగా తొలివిజయం సాధించింది. మాతృత్వం కోసం గత రెండేళ్లుగా టెన్నిస్ నుంచి విరామం తీసుకొన్న సానియా 2020 సీజన్ రీఎంట్రీని విజయంతో మొదలుపెట్టింది. ఆస్ట్ర్రేలియన్ మహిళల డబుల్స్ కు సన్నాహాలలో భాగంగా…ఉక్రెయిన్ ప్లేయర్ నాడియా కిచెనాక్ తో జంటగా …హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ బరిలోకి దిగిన సానియాజోడీ గట్టి పోటీ ఎదుర్కొని తొలివిజయంతో క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగారు. గంటా […]

తెలుగు దేశం ఎమ్మెల్యేలూ…. మీరెక్కడ?

Posted: 14 Jan 2020 10:58 PM PST

ప్రభుత్వ తీరుపై.. చంద్రబాబు విపరీతంగా పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు. ఇంకా చేస్తానని చెబుతున్నారు కూడా. కానీ.. తెలుగుదేశానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మాత్రం.. చంద్రబాబు, లోకేశ్ వెంట నడవడం లేదు. కేశినేని నాని, గల్లా జయదేవ్ లాంటి 'అమరావతి పరిధి'లోని నేతలు తప్ప.. మరెవరూ చంద్రబాబు వెంట కనిపించడం లేదు. వాళ్లు ఎందుకిలా చేస్తున్నారన్నది వాళ్లకే తెలియాలి. ఇప్పటికే గంటా వంటి ఎమ్మెల్యేలు.. 3 రాజధానుల ప్రతిపాదనకు జై కొట్టారు. మరికొందరు టీడీపీ […]

భారత రౌతు ఫవాద్ మీర్జా సరికొత్త చరిత్ర

Posted: 14 Jan 2020 10:50 PM PST

టోక్యో ఒలింపిక్స్ కు మీర్జా అర్హత అశ్వక్రీడలో భారత సంచలనం ఫవాద్ మీర్జా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గత రెండుదశాబ్దాల కాలంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత అశ్వక్రీడ తొలి క్రీడాకారుడిగా రికార్డుల్లో చేరాడు. 1996, 2000 ఒలింపిక్స్ ఈక్వెష్ట్ర్రియన్ (అశ్వక్రీడ)లో భారత రౌతులు చివరిసారిగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒలింపిక్స్ అశ్వక్రీడకు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. జకార్తా ఆసియా క్రీడల ఈక్వెష్ట్ర్రియన్ వ్యక్తిగత, టీమ్ విభాగాలలో ఫవాద్ మీర్జా రెండు రజతపతకాలు సాధించాడు. అంతేకాదు…ఆసియా-ఓషియానా […]

బాబు పవన్ వెంట… పవన్ బీజేపీ వెంట!

Posted: 14 Jan 2020 09:06 PM PST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జీవితంలో ఎన్నడూ పడని ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తన పార్టీని రాజకీయంగా బతికించుకునేందుకు అవసరమైన అన్ని దారుల్లోనూ నడుస్తున్నారు. ఒకేసారి రెండు మూడు రకాల ప్రయత్నాలు చేస్తూ.. తనలోని పూర్తి రాజకీయ నాయకుడిని బయటపెడుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమినుంచి పార్టీని బయటకు తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన.. గత ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితం అయ్యింది. అలాంటి పార్టీ వెంట బాబు పడుతున్న తీరు చూసి.. తెలుగు తమ్ముళ్లే […]

ముంబై వన్డేలో భారత్ కు ఆస్ట్ర్రేలియా షాక్

Posted: 14 Jan 2020 06:49 PM PST

వాంఖెడీలో తేలిపోయిన విరాట్ సేన వార్నర్- ఫించ్ సెంచరీలతో 10 వికెట్ల గెలుపు విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు వరుస విజయాలు బలుపుకాదు…వాపని తేలిపోయింది. కొత్తసంవత్సరం తొలిమ్యాచ్ లోనే వన్డే క్రికెట్ రెండోర్యాంకర్ భారత్ కు మింగుడుపడని ఫలితం ఎదురయ్యింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో 4వ ర్యాంక్ ఆస్ట్ర్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది. దిగ్గజాల సమరంలా సాగుతుందనుకొన్న ఈ […]