Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Tuesday, January 14, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


“అలా” డ్రీమ్ రన్ కొనసాగుతోంది

Posted: 14 Jan 2020 04:22 AM PST

అల వైకుంఠపురములో… సినిమా హిట్ అవుతుందని యూనిట్ భావించింది కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని వాళ్లు ఊహించలేదు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇంత క్రేజ్ వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ప్రీమియర్స్ కు కూడా టిక్కెట్ రేట్లు పెంచకుండా విడుదల చేశారు. అయినప్పటికీ ప్రీమియర్స్ లో ఈ సినిమాకు 8 లక్షల డాలర్లు వచ్చాయి. అలా ఊహించని విధంగా ఓవర్సీస్ లో సక్సెస్ అయిన ఈ సినిమా తాజాగా 1.5 మిలియన్ డాలర్లు ఆర్జించి […]

3 రోజుల్లో 50 కోట్లు

Posted: 14 Jan 2020 04:19 AM PST

తెలుగు రాష్ట్రాల్లో మహేష్ మూవీ హవా కొనసాగుతోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా వరుసగా మూడో రోజు కూడా మంచి వసూళ్లు సాధించింది. విడుదలైన ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా 50 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అలా 3 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ అందుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు మహేష్. అటు గుంటూరులో మహేష్ మేనియా కొనసాగుతోంది. 3 రోజుల్లో ఏకంగా కోటి రూపాయల షేర్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి […]

తెలుగుదేశంలో నాయకత్వ సమస్య? ఎందుకీ అవస్థ?

Posted: 14 Jan 2020 04:10 AM PST

పార్టీ స్థాపించిన నాటి నుంచి.. ఎన్నడూ లేనంత రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో ఇప్పటికే దాదాపుగా టీడీపీ కనుమరుగై.. చరిత్రలో కలిసిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీకి అలాంటి పరిస్థితే రానుందా అని ప్రశ్నిస్తే…. తెలుగుదేశం నేతల నుంచి.. కాదు అన్న సమాధానం అయితే రావడం లేదు. ఇంతలా.. తెలుగుదేశం పరిస్థితి దిగజారడానికి కారణాలు అనేకంగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు మొదలైనప్పుడే టీడీపీ పతనం మొదలైంది. ఎప్పుడైతే […]

జగన్ కొత్త చట్టం.. ఇక ఏపీ రాజధాని ఉండదట…

Posted: 14 Jan 2020 04:08 AM PST

ఏపీకి 3 రాజధానుల ప్రతిపాదన చేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించడానికి రెడీ అవుతున్నారు. ఒక్క ప్రాంతానికి పరిమితం చేయకుండా ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. ఏపీ అసెంబ్లీ ఈనెల 20న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలోనే ఏపీ రాజధానిపై నిర్ణయం ప్రకటించబోతోంది. సీఎం జగన్ ఈ అసెంబ్లీలోనే 'ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ-ప్రాంతాల సమానాభివృద్ధి చట్టం 2020' ను ప్రవేశపెట్టబోతున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ చట్టం […]

నేడే చూడండి.. మీ అభిమాన చానల్ లో ‘దర్బార్’!

Posted: 14 Jan 2020 04:03 AM PST

థియేటర్ లో బొమ్మ పడి వారం కూడా కాలేదు. అప్పుడే టీవీలోనా.. అని ఆలోచించకండి. ఈ విషయం వెనక పెద్ద కథే ఉంది. తమిళనాడులోని శరణ్య అనే టీవీ చానల్ వారు చేసిన ఈ ఘన కార్యం.. ఇప్పుడు లీగల్ ఇష్యూగా మారింది. పైరసీ భూతం సినీ పరిశ్రమను ఎంతగా పట్టి పీడిస్తోందో.. అందరకీ తెలిసిందే. అలాంటి పైరసీకి వ్యతిరేకంగా ఉండాల్సిన టీవీ మీడియానే.. అదే పైరసీ కాపీని తమ చానల్ లో ప్రసారం చేస్తే ఎలా […]

పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి ఇది?

Posted: 14 Jan 2020 04:00 AM PST

నితిన్ పెళ్లి గురించి రూమర్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. దాదాపు ఐదేళ్లుగా నితిన్ పెళ్లిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి అవి పుకార్లు కావు. అన్నీ నిజాలే. అవును.. 2020లో నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి జరగనుంది. ఈ విషయాలన్నీ కొన్ని రోజుల కిందటే బయటకొచ్చాయి. తాజాగా పెళ్లి కూతురు ఎవరనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. షాలినీ అనే అమ్మాయిని పెళ్లి […]

అంతగా ఇష్టమైతే… విశ్రాంతి తీసుకోవచ్చుగా బాబూ!

Posted: 14 Jan 2020 03:59 AM PST

అమరావతి చుట్టూనే ఏం చేసినా. రాష్ట్రంలో ఇంకో సమస్యే లేదన్నట్టుగా.. ప్రజలకు మరేదీ సమస్యే కాదనట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలి కనిపిస్తోంది. ఎప్పుడైతే ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చిందో.. ఆ నాటి నుంచి చంద్రబాబు తన విపరీత పోకడలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. జనాన్ని తన వైపు చూసేలా రకరకాల ఎత్తులు, పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా.. మనం రాజధాని ప్రాంత రైతుల గురించి.. వారి ఆవేదన గురించి.. ఆవేశం […]

ఆడియన్స్ తొలిసారి నా డాన్స్ చూశారు

Posted: 14 Jan 2020 03:52 AM PST

సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది రష్మిక. పైగా తను చేసిన డాన్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మరింత ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగు ప్రేక్షకులు తన డాన్స్ చూశారంటున్న రష్మిక.. అసలు తనకు డాన్స్ వచ్చా రాదా అనే సందేహం యూనిట్ లో కూడా ఉండేదని, యూనిట్ లో అందరి ముందు డాన్స్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది రష్మిక. “మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ షూటింగ్ రోజు ఈ అమ్మాయికి […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan