Translate

Monday, January 13, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


నా 20 ఏళ్ల కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్

Posted: 13 Jan 2020 09:01 AM PST

సరిలేకు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులతో పంచుకున్నాడు మహేష్ బాబు. తన 20 ఏళ్ల కెరీర్ లో ఇప్పటివరకు చూడని అద్భుతమైన రియాక్షన్ ను కేవలం ఒకే ఒక్క పాటతో అందుకున్నానని తెలిపాడు. అదే మైండ్ బ్లాక్ సాంగ్. “నా సినిమా దేవిశ్రీ చేతిలో ఉందంటే నాకు చాలా హ్యాపీ. ప్రశాంతంగా ఉంటుంది. అతడు నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాడు. మైండ్ బ్లాక్ లాంటి పాటను కంపోజ్ చేసి, నాతో అందులో డాన్స్ […]

పృథ్వీ వ్యవహారం… అన్నీ చకచకా జరిగిపోయాయి…

Posted: 13 Jan 2020 08:46 AM PST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి…. కొందరికి నచ్చవచ్చు… మరి కొందరికి నచ్చకపోవచ్చు… అది సహజం. కానీ… ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి స్పందించిన తీరును అభినందించాల్సిందే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఆడియో టేపుల వ్యవహారంలో.. చాలా వేగంగా స్పందించిన తీరును అంతా ప్రశంసిస్తున్నారు. వివాదం వెలుగు చూసిన ఒకే ఒక్క రోజులో.. అంతా సద్దుమణిగేలా చేసి.. కఠిన చర్యలు తీసుకున్న […]

అల వైకుంఠపురములో మొదటి రోజు వసూళ్లు

Posted: 13 Jan 2020 07:30 AM PST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురం సినిమాకు మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 25 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చింది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ నంబర్ ఇది. నిజానికి ఈ సినిమా వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవి. ఒక రోజు ముందు మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు రావడంతో, థియేటర్లు దొరక్క వసూళ్లు తగ్గాయి. అయినప్పటికీ ఉదయం 4 గంటల నుంచే […]

మాకే మంచిది…. ఏపీ 3 రాజధానులపై రేవంత్ రెడ్డి కామెంట్స్

Posted: 13 Jan 2020 07:17 AM PST

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా కొత్త చర్చకు తెర తీశారని కూడా చెప్పవచ్చు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కుప్పకూలిపోయే దశలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఫలితంగా.. తెలంగాణకే మేలు జరుగుతోందని అన్నారు. తెలంగాణకు చెందినవాడిగా… తనకు ఈ పరిణామం ఆనందంగానే ఉందని కూడా వ్యాఖ్యానించారు. తెలంగాణకు చెందిన […]

కొత్త ఏడాది… ఓవర్సీస్ లో కొత్త ఆశలు

Posted: 12 Jan 2020 09:55 PM PST

గతేడాది టాలీవుడ్ కు షాకిచ్చింది ఓవర్సీస్. చాలా సినిమాల్ని యూఎస్ ప్రేక్షకులు తిప్పికొట్టారు. దీంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చాలా సినిమాలు భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఒక దశలో ఓవర్సీస్ ను అర్థం చేసుకోవడం కష్టంగా మారిందంటూ కథనాలు కూడా వచ్చాయి. అలా 2019లో కొరకరాని కొయ్యగా మారిన ఓవర్సీస్.. 2020లో మాత్రం ట్రేడ్ కు అందుబాటులోకి వచ్చింది. ఊహించని విధంగా సంక్రాంతి సినిమాలు రెండూ ఓవర్సీస్ లో క్లిక్ అయ్యాయి. అల వైకుంఠపురములో […]

కెమిస్ట్రీ చూపిస్తే బాగుండేదేమో భీష్మ

Posted: 12 Jan 2020 09:39 PM PST

భీష్మ అనే టైటిల్ పెట్టినప్పుడే అది హీరో పాత్ర పేరు అనే విషయం అర్థమైంది. అదే ఇప్పుడు నిజమైంది. భీష్మ టీజర్ లో నితిన్ పాత్ర పేరు భీష్మ. చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నప్పటికీ ఎప్పటికీ సింగిల్ అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. కానీ ఆ స్టేట్ మెంట్ కు సంబంధించిన రిఫరెన్స్ ను మాత్రం టీజర్ లో చూపించలేకపోయారు. భీష్మ టీజర్ ను కేవలం నితిన్ ఎలివేషన్స్ కు కొన్ని కామెడీ పంచ్ లకు మాత్రమే వాడుకున్నారు. నిజానికి […]

సరిలేరు నీకెవ్వరు మొదటి రోజు వసూళ్లు

Posted: 12 Jan 2020 09:37 PM PST

మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. సంక్రాంతి బరిలో నిలిచిన క్రేజీ మూవీ కావడం, థియేటర్లు కూడా భారీగా దక్కడంతో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. తొలిరోజు ఏపీ, నైజాంలో ఈ సినిమాకు ఏకంగా 32 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. టాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైమ్ టాప్-4 ఓపెనర్ గా నిలిచింది సరిలేరు నీకెవ్వరు సినిమా. దీనికితోడు ఏపీ, నైజాంలో పెంచిన టిక్కెట్ ధరలు ఈ సినిమాకు […]

బుమ్రాకు బీసీసీఐ జంట అవార్డులు

Posted: 12 Jan 2020 08:26 PM PST

శ్రీకాంత్, అంజుమ్ లకు సీకె నాయుడు పురస్కారం అత్యుత్తమ మహిళా క్రికెటర్ గా పూనమ్ యాదవ్ భారత యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా…2018-2019 సీజన్లో భారత అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ గా జంట అవార్డులు అందుకొన్నాడు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో …పురుషుల విభాగంలో జస్ ప్రీత్ బుమ్రా, మహిళల విభాగంలో లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అవార్డులు అందుకొన్నారు. భారత తురుపుముక్క బుమ్రాకు పాలీ ఉమ్రిగర్, దిలీప్ సర్దేశాయి అవార్డులను ప్రదానం చేశారు. టెస్టు క్రికెట్లో […]