Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Tuesday, December 31, 2019

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


మహేష్ కు షాక్ ఇవ్వబోతున్న బన్నీ

Posted: 31 Dec 2019 10:25 AM PST

సంక్రాంతి సినిమాలకు సంబంధించి మరో భారీ ట్విస్ట్. ఈసారి బన్నీ, మహేష్ కు కాస్త గట్టిగానే షాక్ ఇవ్వబోతున్నాడు. మహేష్ మూవీ కంటే ఒక రోజు ముందే తన సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అంటే, ఇంతకుముందు అనుకుంటున్నట్టు 12న కాకుండా, 10వ తేదీకే వచ్చేయాలనేది బన్నీ ప్లాన్. ఇది నిజంగా మహేష్ కు గట్టి షాక్. నిజానికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రెండింటినీ 12కే ప్లాన్ చేశారు. ఇద్దరు హీరోలు పోటాపోటీగా […]

చిరు సరసన సాయితేజ్ హీరోయిన్

Posted: 31 Dec 2019 08:10 AM PST

చిరంజీవి సినిమా మెల్లమెల్లగా ఓ షేప్ తీసుకుంటోంది. ఇన్నాళ్లూ స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్న కొరటాల, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆర్టిస్టుల్ని ఫైనలైజ్ చేస్తున్నాడు. హీరోయిన్ గా త్రిషను తీసుకున్న కొరటాల.. రెండు కీలక పాత్రల కోసం రావు రమేష్, ప్రకాష్ రాజ్ లను ఎంపిక చేసుకున్నాడు. ఇదే ఊపులో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ ను కూడా సెలక్ట్ చేశాడు. అవును.. చిరు-కొరటాల సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాటను మణిశర్మ […]

నేను సినిమా చూశాను…. గర్వంగా ఉంది

Posted: 31 Dec 2019 06:07 AM PST

సరిలేరు నీకెవ్వరు ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించాడు నిర్మాత అనీల్ సుంకర. మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా ముందుగా తనే ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడమే కాకుండా.. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిందని ప్రకటించాడు. “నేను నిన్ననే సినిమా చూశాను. బయటికి వచ్చాక చాలా గర్వంగా అన్పించింది. ఇంతవరకూ అనీల్‌ రావిపూడిని ఒక యాంగిల్‌లో చూశారు. ఈ సినిమా విడుదలయ్యాక కంప్లీట్‌గా వేరే లీగ్‌లోకి వెళతారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ వదలకుండా మహేష్‌ లాంటి హీరో ఉన్నప్పుడు […]

తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్

Posted: 31 Dec 2019 04:42 AM PST

ఊగిసలాటకు తెరపడింది. తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఎస్ కే జోషి ఈవాళ రిటైర్ అయ్యారు. సోమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా రిటైర్ అయిన ఎస్ కే జోషికి కేసీఆర్ ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. […]

2019లో ఆ ఐదుగురు

Posted: 31 Dec 2019 04:40 AM PST

మేరీ, మను, హంపి, సింధు, వినేశ్ సంచలనం భారత క్రీడారంగంలో మహిళలు సైతం అపూర్వ విజయాలతో తమ ఉనికిని చాటుకొంటూ వస్తున్నారు. వివిధ క్రీడల్లో పురుషులతో సమానంగా మహిళలు సైతం రాణిస్తూ తమ సత్తా చాటుకొన్నారు. 2019 సంవత్సరాన్ని బాక్సర్ మేరీ కోమ్, షూటర్ మను బాకర్, వస్తాదు వినేశ్ పోగట్, తెలుగుతేజాలు కోనేరు హంపి, పీవీ సింధు ప్రపంచ టైటిల్ విజయాలతో చిరస్మరణీయం చేసుకోగలిగారు. ముగ్గురు బిడ్డల తల్లిగా… భారత ఎవర్ గ్రీన్ బాక్సర్ మేరీకోమ్ తన సుదీర్ఘ […]

మరో డిఫరెంట్ మూవీలో నిత్యామీనన్

Posted: 31 Dec 2019 04:07 AM PST

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎలాంటి సినిమాలు చేశామన్నది ముఖ్యం. నిత్యామీనన్ పాలసీ ఇది. అందుకే ఎన్ని అవకాశాలొచ్చినా ఆచితూచి కాల్షీట్లు ఇస్తుందీమె. మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తుంది. మరీ ముఖ్యంగా తన పాత్రకు వెయిట్ ఉన్న కథల్ని మాత్రమే ఎంచుకుంటుంది. ఇందులో భాగంగా చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ […]

రాజమౌళి కోసం మహేష్ బాబు వేచిచూడడం లేదా?

Posted: 31 Dec 2019 04:02 AM PST

బాహుబలి తర్వాత దర్శకడు రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాజాగా తన అన్న కీరవాణి కొడుకుల సినిమా ప్రమోషనల్ లో 'మహాభారతం' మూవీ గురించి కూడా తన ఇష్టాన్ని, ప్రేమను బయటపెట్టాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి ఇదివరకే ప్రకటించినట్టుగా మహేష్ బాబుతో ఒక పౌరాణిక చిత్రాన్ని తీస్తారని… లేదా కౌబాయ్ లాంటి కథను తీస్తారని ఆయన అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా చేయడానికి […]

కృష్ణపట్నం పోర్టుకు కోత పెట్టిన ప్రభుత్వం

Posted: 30 Dec 2019 10:47 PM PST

కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డుపుల్లవేస్తూ వస్తున్న కృష్ణపట్నం పోర్టు కంపెనీకి తనదైన శైలిలో ప్రభుత్వం సమాధానం చెప్పింది. ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టును నిర్మించేందుకు ప్రయత్నిస్తుండగా… కృష్ణపట్నం పోర్టు అడ్డుపుల్ల వేస్తూ వస్తోంది. గత ప్రభుత్వాలు కృష్ణపట్నంపోర్టుకు అటు 30 కిలో మీటర్లు, ఇటు 30 కిలోమీటర్లు మరో పోర్టు నిర్మించడానికి వీల్లేకుండా కృష్ణపట్నం పోర్టుకు ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఒకవేళ ఆ పరిధిలో మరో […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan