Translate

Friday, November 1, 2019

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


లక్ష్మణ రేఖ ఉండాలని రామోజీరావు కూడా అంగీకరించారు…

Posted: 01 Nov 2019 09:17 AM PDT

మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా లేదా అన్న దానిపై చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ జర్నలిస్ట్‌ అమర్. ప్రభుత్వం మీడియా స్వేచ్చను హరిస్తోందంటూ టీడీపీ అనుకూల పత్రికలు పెద్దెత్తున కథనాలు రాస్తున్న నేపథ్యంలో… అమర్ మీడియా సమావేశం నిర్వహించారు. 2005లోనే మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా వద్దా అంశంపై ఏపీ ప్రెస్‌ అకాడమీ జాతీయ సదస్సును నిర్వహించిందన్నారు. ఆ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ […]

నేడు కష్టాల్లో ఉండొచ్చు… కానీ ఏపీకి మంచి రోజులు వస్తాయ్…

Posted: 01 Nov 2019 08:48 AM PDT

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడ ఇందిరాగాంధీ స్డేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులతో పాటు పలువురు మహానుభావుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ప్రసంగించిన జగన్‌ మోహన్ రెడ్డి… గతంలో చెప్పినట్టుగా నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఊహించని పరిణామాలు జరిగాయన్నారు. ఇలా రాష్ట్రం విడిపోతుందని ఎప్పుడూ […]

పేర్లు చెప్పకుండా ఫిక్షన్‌ రాస్తున్నారు… వారే ఇప్పుడు భయపడాలి…

Posted: 01 Nov 2019 04:23 AM PDT

ఆంధ్రప్రదేశ్‌లో అసమ్మతిని సృష్టించడం, అసమ్మతిని పోగేయడం వంటి పనుల్లో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు, సీనియర్‌ జర్నలిస్ట్‌ రామచంద్రమూర్తి వ్యాఖ్యానించారు. ఇలా చేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. కానీ ప్రభుత్వం గురించి అవాస్తవాలను కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు చేరవేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలకు వాస్తవాలు చేరితే వారే సరైన నిర్ణయం తీసుకుంటారని.. అందుకే వాస్తవాలను ప్రజలకు చేరవేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం […]

72 పింక్ బాల్స్ తో డే-నైట్ టెస్ట్

Posted: 01 Nov 2019 04:20 AM PDT

భారత గడ్డపై మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ కు కౌంట్ డౌన్ క్రికెట్ క్రేజీ భారత గడ్డపై మరికొద్ది వారాల్లో జరిగే మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించాడనికి ఆతిధ్య బీసీసీఐ…మొత్తం 72 గులాబీ రంగు బంతులకు ఆర్డర్ ఇచ్చింది. ఎస్ జీ బ్రాండ్ క్రికెట్ బాల్స్ తయారు చేసే సంస్థకు సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని బీసీసీఐ ఇండెంట్ పంపింది. 22 నుంచి ఈడెన్ గార్డెన్స్ లో డే-నైట్ టెస్ట్ గత కొద్ది దశాబ్దాలుగా పట్టపగలు…సహజసిద్ధమైన వెలుగులో జరుగుతున్న సాంప్రదాయ […]

టీ-20 మహిళా ప్రపంచకప్ ఆవిష్కరణ

Posted: 01 Nov 2019 04:01 AM PDT

మెల్బోర్న్ లో ట్రోఫీని ఆవిష్కరించిన కరీనాకపూర్ ఫిబ్రవరి 21 నుంచి మహిళా టీ-20 ప్రపంచకప్ ఆస్ట్ర్రేలియా వేదికగా ఫిబ్రవరి 21 న ప్రారంభమయ్యే 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ట్రోఫీని బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఆవిష్కరించింది. మెల్బో్ర్న్ లో నిర్వహించిన ప్రపంచ కప్ కౌంట్ డౌన్ కార్యక్రమంలో కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా పాల్గొంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకూ జరిగే ఈ టోర్నీలో తలపడే వివిధ దేశాల జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. థాయ్ […]

ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం….. స్కూళ్ళకు సెలవులు

Posted: 01 Nov 2019 03:59 AM PDT

దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో కాలుష్యం చేరింది. దాంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి కాలుష్యం సూచి 582కు పెరిగింది. గాలి కాలుష్యం సూచి సాధారణంగా 0-50 వరకు మంచి వాతావరణం అని లెక్క. 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్తంగా భావిస్తారు. 301-400 మధ్య ఉండే ఏమాత్రం సరైన గాలి కాదు అని అర్థం. సూచి 401-500 మధ్య ఉంటే ప్రమాదకరమైన గాలిగా భావిస్తారు. […]

‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా రివ్యూ

Posted: 01 Nov 2019 02:42 AM PDT

రివ్యూ : మీకు మాత్రమే చెప్తా రేటింగ్ : 2.25/5 తారాగణం :  తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అనసూయ భరద్వాజ్‌, అభినవ్‌ గౌతమ్‌, పావని, నవీన్‌ జార్జ్‌, అవంతిక మిశ్రా తదితరులు సంగీతం : శివకుమార్‌ నిర్మాత : విజయ్ దేవరకొండ దర్శకత్వం : షమ్మీర్‌ సుల్తాన్‌ విజయ్ దేవరకొండ నిర్మాత గా మారి చేసిన తొలి ప్రయత్నం మీకు మాత్రమే చెప్తా అనే సినిమా. ఈ సినిమా లో దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫుల్ లెన్త్ హీరో పాత్ర ని పోషించాడు. హీరోయిన్ గా వాణి నటించింది. […]

ఆంధ్రుల మెగా స్వప్నాన్ని నిజం చేస్తున్న ‘మేఘా’

Posted: 01 Nov 2019 02:09 AM PDT

ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం పోలవరం. ఆ కలను సాక్షాత్కారం చేయబోతోంది మేఘా ఇంజనీరింగ్. దశాబ్దాల తరబడి పెండింగ్ లో వున్న పోలవరం ప్రాజెక్టు ను రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని నూతన సంకల్పానికి మేఘా శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేస్తూ రికార్డులు సాధిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్త ఇప్పుడు పోలవరంను కూడా లక్ష్యం మేరకు నిర్మించేందుకు […]