Translate

Wednesday, October 2, 2019

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


శుక్రవారం మోడీని కలవనున్న కేసీఆర్

Posted: 02 Oct 2019 04:15 AM PDT

రెండోసారి అటు కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండోసారి గెలిచారు. అయితే ఎన్నికల సంగ్రామంలో మోడీ, కేసీఆర్ ల మాటల తూటాలు.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేయడంతో మోడీ గుస్సా అయిపోయి కేసీఆర్ ను దూరం పెట్టారన్న ప్రచారం సాగింది. అప్పటినుంచి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరినా మోడీ ఇవ్వలేదన్న టాక్ నడిచింది. తాజాగా మోడీతో కేసీఆర్ భేటికి ముహూర్తం కుదిరింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధానితో కేసీఆర్ […]

చర్చలు విఫలం: తెలంగాణలో ఈనెల 5 నుంచి ఆర్టీసీ సమ్మె

Posted: 02 Oct 2019 04:12 AM PDT

తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. కార్మికులు లేవనెత్తిన 26 డిమాండ్లను కమిటీ ముందు ఉంచగా.. వాటిపై సమయం కావాలని కోరారు ప్రభుత్వ అధికారులు.. జేఏసీ నేతలు కాస్త ఓపిక పట్టాలని కోరడంతో ఒప్పుకోని కార్మిక నేతలు ఈనెల 5నుంచి సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని డిమాండ్ మొదలు పెట్టారు. ఇందుకోసం ఈనెల […]

తనపై విమర్శలకు త్వరలో సమాధానం చెప్పనున్న లోకేష్

Posted: 02 Oct 2019 02:30 AM PDT

లక్ష్మీపార్వతి విమర్శలు బాగా పనిచేసినట్టున్నాయి. ట్విట్టర్ లో మాత్రమే కూసే కొడుకును కన్నావ్ చంద్రబాబు అని మొన్న లక్ష్మీపార్వతి ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో టీడీపీ అధ్యక్షుడయ్యే నేత ఎట్టకేలకు విలేకరులను డైరెక్ట్ గా ఎదుర్కొనేందుకు మీడియా ముందుకు రాబోతున్నాడు. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టు విలేకరులకు కబురు పంపారు. టీడీపీ భావి నాయకుడు.. నడిపించే నేత ఇలా మీడియా ముందు భయపడడం ఏంటని తెగ ప్రిపేర్ అయిపోయినట్టు ఉన్నారు. తాజాగా చంద్రబాబు తన […]

‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా రివ్యూ

Posted: 02 Oct 2019 01:38 AM PDT

రివ్యూ : సై రా నరసింహా రెడ్డి రేటింగ్ : 3/5 తారాగణం : చిరంజీవి, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ కిచ్చా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, బ్రహ్మాజీ తదితరులు సంగీతం : అమిత్ త్రివేది నిర్మాత : రామ్ చరణ్ (కొణిదెల ప్రొడక్షన్స్) దర్శకత్వం : సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. స్వాతంత్ర్య సమర యోధుడు […]

గ్రామ వాలంటీర్లు మీ పెద్ద కొడుకులా సేవ చేస్తారు

Posted: 02 Oct 2019 12:43 AM PDT

రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ సేవల కోసం కూడా సామాన్యుడు గ్రామ స్థాయి అధికారుల నుంచి కలెక్టరేట్ వరకు తిరుగుతున్న పరిస్థితులను పాదయాత్రలో తాను గమనించానన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో గ్రామాల్లో పాలన కనిపించలేదన్నారు. అందుకే పాదయాత్ర సమయంలోనే గ్రామ సచివాలయాల ద్వారా పాలనను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 13వేల 610 మందికి […]

”చంద్రబాబు మాటలు విని నేను పరీక్ష రాయలేదు”- బోరున విలపించిన విద్యార్థిని

Posted: 02 Oct 2019 12:01 AM PDT

గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో ఏదో జరిగిందని టీడీపీ మీడియా, చంద్రబాబు పెద్దెత్తున విమర్శలు చేసినా అవేవి నిలబడడం లేదు. గ్రామాల్లో ఉద్యోగాలు వచ్చిన వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారు. జనసేన కుటుంబాలకు చెందిన పిల్లలు ఉద్యోగాలు సాధించారు. గుంటూరు జిల్లాలో టీడీపీ పత్రిక విలేకరి కుమార్తె గ్రామ సచివాలయం ఉద్యోగం సాధించింది. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనివెళ్ల గ్రామ టీడీపీ నేత వెంకటకోటయ్య కుమార్తె పంచాయతీ కార్యదర్శి పోస్ట్ సాధించింది. టీడీపీ కార్యక్రమాల్లో డప్పు […]

డ్యూటీ ఎగ్గొట్టి ”సైరా”కు వెళ్లిన ఆరుగురు ఎస్‌ఐలపై వేటు వేసిన ఎస్పీ

Posted: 01 Oct 2019 11:58 PM PDT

సైరా నరసింహారెడ్డి సినిమా ఆరుగురు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపించింది. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. సైరా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెల్లవారుజామునే జిల్లాలో ఆరుగురు ఎస్‌ఐలు సినిమాకు వెళ్లారు. డ్యూటీ ఎగ్గొట్టి మరీ ఈ పనిచేశారు. లీవ్‌ పెట్టకుండా, ముందస్తు అనుమతి కూడా తీసుకోకుండా కోవెలకుంట్లలో బెన్‌ఫిట్‌ షోకు ఆరుగురు ఎస్‌ఐలు వెళ్లారన్న విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తీవ్రంగా స్పందించారు. ఆరుగురు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇలా చెప్పాపెట్టకుండా […]

వెబ్ సిరీస్ ట్రైలర్ తో ఆకట్టుకున్న సత్యదేవ్

Posted: 01 Oct 2019 11:21 PM PDT

‘బ్లఫ్ మాస్టర్’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాలో కనిపించిన సత్యదేవ్ ఇప్పుడు త్వరలో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి (G.O.D) అనే ఒక వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నటుడు అనీష్ కురువిల్లా ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యపాత్ర పోషించడం మాత్రమే కాక దర్శకత్వం కూడా వహించాడు. రాజ్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో శ్రుతి మరియు చాందిని చౌదరి లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ […]