Translate

Tuesday, April 16, 2019

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


కోడెలపై కేసు నమోదు

Posted: 16 Apr 2019 05:50 AM PDT

ఎన్నికల రోజున గుంటూరు జిల్లా, రాజుపాలెం మండలం, ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ప్రవర్తన వివాదాస్పదం అయింది. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో 160వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్ళి ఆయన తలుపులకు గడియలు పెట్టేసి పోలింగ్‌ జరుగుతున్న గదిలోకి ఎవ్వరినీ రానివ్వడకుండా గంటన్నర సేపు ఆ గదిలోనే కూర్చున్నాడు. దీంతో ఓటు వేయడానికి వచ్చి బయట క్యూలో ఎదురుచూస్తున్న ఓటర్లకు చిర్రెత్తుకొచ్చింది. రిగ్గింగ్ కు పాల్పడుతున్నాడని బయట ఓటర్లు గొడవ చేశారు. తలుపు తీయాలని, కోడెలను […]

కేరళ అడవుల్లో సైరా విన్యాసాలు

Posted: 16 Apr 2019 05:30 AM PDT

చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ కేరళలో మొదలైంది. కేరళలోని అడవుల్లో ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. గొరిల్లా యుద్ధ నీతి ఆధారంగా, చెట్ల మధ్య దాక్కొని శత్రువులపై విరుచుకుపడే సన్నివేశాల్ని ఇక్కడ తీస్తున్నారు. 10 రోజుల పాటు కేరళ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో చిన్న షెడ్యూల్ ఉంటుంది. దీంతో సైరా సినిమా టోటల్ షూటింగ్ కంప్లీట్ […]

కమలంలో కలవరం…!

Posted: 16 Apr 2019 04:57 AM PDT

తొలి దశ పోలింగ్ తర్వాత కమలనాథుల్లో కలవరం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు 91 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి కనీసం ఐదు స్థానాలు అయినా దక్కవేమోననే భయం కమలనాథులను వెంటాడుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 42 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఒకటి, రెండు స్థానాలు తప్ప రావని తేలిపోయింది. అది కూడా తెలంగాణ రాజధాని హైదరాబాదులో గెలిచే […]

చంద్రబాబు పై మండిపడ్డ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు…. గవర్నర్‌ కు ఫిర్యాదు

Posted: 16 Apr 2019 04:55 AM PDT

ఏపీ చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు రిటైర్డ్‌ ఐఏఎస్‌ల బృందం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ బృందంలో ఐవైఆర్, అజయ్‌కల్లం, గోపాల్‌రావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ, ఎల్వీ సుబ్రహ్మణ్యం ల పై చంద్రబాబు నిందారోపణలు చేయడం సరికాదన్నారు. తమ నిరసనను గవర్నర్‌కు తెలిపామన్నారు మాజీ ఐఏఎస్‌ అధికారి గోపాల్‌ రావు. ఎన్నికల అధికారి, […]

నాని-వెంకీ సినిమా…. నవ్వి ఊరుకున్న వెంకీ

Posted: 16 Apr 2019 04:30 AM PDT

హీరో నానికి మల్టీస్టారర్స్ కొత్తకాదు. ఇప్పటికే నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమా చేశాడు నాని. అది మంచి సక్సెస్ సాధించింది కూడా. ఇప్పుడు వెంకీతో కూడా మల్టీస్టారర్ చేస్తానంటున్నాడు. ఈ విషయాన్ని జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో బయటపెట్టాడు ఈ హీరో. జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు వెంకటేష్. ఈ సందర్భంగా మాట్లాడిన నాని, వెంకటేష్ కు కృతజ్ఞతలు చెబుతూనే.. కుదిరితే ఆయనతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందంటూ మనసులో […]

‘జాన్’లో కూడా యాక్షన్ ఉంటుంది

Posted: 16 Apr 2019 03:30 AM PDT

సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు హీరో ప్రభాస్. ఈ మూవీకి జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. పారిస్ బ్యాక్ డ్రాప్ లో 1920ల నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇన్నాళ్లూ ఒక రొమాంటిక్ డ్రామాగా భావించారంతా. కానీ ఇది కూడా యాక్షన్ సినిమానే ఉంటున్నాడు ప్రభాస్ జాన్ సినిమాలో రొమాన్స్, లవ్ ఉన్నప్పటికీ సినిమాలో 50శాతం […]

ఫార్ములావన్ చరిత్రలో 1000వ రేస్

Posted: 16 Apr 2019 03:02 AM PDT

షాంఘై రేస్ ట్రాక్ లో ముగిసిన వెయ్యివ రేస్ చైనీస్ గ్రాండ్ ప్రీ విజేతగా లూయి హామిల్టన్ ఆరోసారి చైనీస్ గ్రాండ్ ప్రీ టైటిల్ నెగ్గిన హామిల్టన్ గంటకు 360 కిలోమీటర్ల వేగంతో సాగిపోయే ఫార్ములావన్ సర్క్కూట్ చరిత్రలో వెయ్యవ రేస్…చైనా గడ్డ షాంఘైలో ముగిసింది. 2019 చైనీస్ గ్రాండ్ ప్రీ రేస్ లో….టీమ్ మెర్సిడెస్ స్టార్ రేసర్ లూయి హామిల్టన్ విజేతగా నిలిచాడు. మెర్సిడెస్ టీమ్ కే చెందిన వాల్టెర్రీ బొట్టాస్ రెండు, టీమ్ ఫెరారీ డ్రైవర్ […]

పెళ్లిపై మరోసారి స్పందించిన రేణుదేశాయ్

Posted: 16 Apr 2019 03:00 AM PDT

ఆమధ్య పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది రేణుదేశాయ్. అప్పట్నుంచి ఈమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. పవన్ మాజీ భార్య హోదాలో ఎలా పెళ్లి చేసుకుంటావంటూ పవన్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ రేణుదేశాయ్ వెనక్కి తగ్గలేదు. తనకు మరో పెళ్లి చేసుకునే హక్కు ఉందని తెలిపిన ఆమె, చెప్పినట్టుగానే ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేసింది. తాజాగా ఇప్పుడు మరోసారి తన పెళ్లిపై స్పందించింది రేణుదేశాయ్. అలీ […]