Translate

Monday, March 4, 2019

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


చినబాబు “దేశాన్ని” ముంచుతావా?

Posted: 04 Mar 2019 09:31 AM PST

"నువ్వే చేస్తున్నావ్. అంతా నువ్వే చేస్తున్నావ్. అమెరికా అని, ఐటీ అని పెద్దపెద్ద మాటలు చెబుతుంటే ఏమో అనుకుని మురిసిపోయా. ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తుంటే తప్పు చేశానేమో అనిపిస్తుంది"అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనస్తాపం చెందుతున్నారని అంటున్నారు. ఒకవైపు పార్టీలో సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీని విడిచి వెళ్లిపోతుంటే దిక్కు తెలియ‌ని స్థితిలో ఉన్న చంద్రబాబుకు కొత్తగా తెరపైకి వచ్చిన ఈ డేటా లీక్స్ మరింత […]

డీఎల్‌ రివర్స్‌… బాబుపై సంచలన వ్యాఖ్యలు

Posted: 04 Mar 2019 08:09 AM PST

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం కడప జిల్లా ఖాజీపేటలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన డీఎల్ రవీంద్రారెడ్డి… ఏపీలో టీడీపీని భూస్థాపితం చేయాలని పిలునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు.  రాష్ట్రంలో టీడీపీని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. 2014ఎన్నికల్లో మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ తరపున డీఎల్ పనిచేశారు. కానీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్‌ పదేపదే డీఎల్‌కు […]

ఉన్మాద ప్రేమికుడి దాడిలో గాయపడిన రవళి మృతి

Posted: 04 Mar 2019 06:26 AM PST

తన ప్రేమను తిరస్కరించిందనే కోపంలో వరంగల్‌లో డిగ్రీ విద్యార్థిని రవళిపై పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. తొలుత ప్రథమ చికిత్స ఎంజీఎంలో అందించి వెంటనే సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆనాటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రవళి పరిస్థితి తీవ్ర విషమంగా మారి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. పెట్రోల్ మంటల తీవ్రతకు శ్వాసనాళాలు పూర్తిగా కాలిపోవడంతో ఆమెకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో డాక్టర్లు కృత్రిమ శ్వాస […]

ఏపీ ప్రజల బ్యాంకు అకౌంట్లను మార్చే డేటా కూడా ఉంది- సైబరాబాద్ సీపీ

Posted: 04 Mar 2019 02:12 AM PST

ఏపీ ప్రజల డేటా కుంభకోణంలో ఎంతటి పెద్దవారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు సైబరాబాద్ కమిషనర్‌ సజ్జనార్‌. దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధించిన సున్నితమై, కీలకమైన డేటా మొత్తం ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వద్ద ఉండడాన్ని గుర్తించామన్నారు. డేటా స్కాంపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులు వేధించడం సరికాదన్నారు. పబ్లిక్‌లో పెట్టడానికి వీల్లేని సున్నితమైన ఏపీ ప్రజల సమాచారం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో […]

గంగూలీ, బీజేపీ మధ్య ఇమ్రాన్ ఖాన్ ఫొటో వివాదం

Posted: 04 Mar 2019 01:14 AM PST

పుల్వామా ఘటన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రికతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దానికి పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్ సంస్థే కారణమని తెలిసి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇరుదేశాల మధ్య ఎలాంటి వివాదం నెలకొన్నా మొదట క్రీడాకారులు, కళాకారులపైనే ఆ ప్రభావం పడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని సీసీఐ (క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా) తమ రెస్టారెంట్‌లో ఉన్న మాజీ క్రికెటర్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోను తొలగించింది. […]

రిటైర్డ్‌ ఐఏఎస్‌ సత్యనారాయణపై బుగ్గన అనుమానం

Posted: 04 Mar 2019 12:45 AM PST

ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాల చోరీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అధికారులు పెద్ద పొరపాటు చేశారని… వారు దాని పర్యవసనాలను ఎదుర్కోక తప్పదన్నారు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఆధార్‌ చైర్మన్‌గా వ్యవహరించిన మాజీ ఐఏఎస్‌ సత్యనారాయణను చంద్రబాబు తెచ్చుకుని సలహాదారుడిగా పెట్టుకున్నారని బుగ్గన చెప్పారు. ఆధార్‌ సమాచారం వాడుకునేందుకే చంద్రబాబు సత్యనారాయణను తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆధార్‌ డేటా లీకేజ్‌పై తాను ఇప్పటికే ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇదే సత్యనారాయణ […]

చంద్రబాబే దొంగ… కేసు బదిలీ చేయం

Posted: 04 Mar 2019 12:40 AM PST

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ నేరం జరిగింది హైదరాబాద్‌లో కాబట్టి ఇక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. నిజంగా నేరం చేసి ఉండకపోతే ఏపీ పోలీసులు వచ్చి హైదరాబాద్‌లో ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులు టీడీపీ, చంద్రబాబే అన్నారు. ముఖ్యమంత్రే ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హుడో కాదో […]

ఆ సినిమా ఆగిపోలేదు నమ్మండి!

Posted: 04 Mar 2019 12:16 AM PST

మహేష్ లిస్ట్ లో సుకుమార్ తో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నాడు. సుకుమార్ తో సినిమా కంప్లీట్ అయిన వెంటనే లెక్కప్రకారం సందీప్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ నటించాలి. కానీ మధ్యలో అనీల్ రావిపూడి ఎంటర్ అయ్యేసరికి, సందీప్ తో చేయాల్సిన సినిమాపై అనుమానాలు పెరిగాయి. సందీప్ రెడ్డి, మహేష్ కాంబోలో రావాల్సిన సినిమా ఇక ఉండదని, ఆ ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయినట్టేనంటూ కథనాలు వచ్చాయి. దీంతో వెంటనే మహేష్ […]