Translate

Saturday, March 16, 2019

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


పొరిగింటి పుల్లకూర రుచి అని వెళ్ళా…. శిక్ష అనుభవించా…. – బుట్టా రేణుక

Posted: 16 Mar 2019 06:08 AM PDT

వైసీపీలోకి తిరిగి రావడం సొంత ఇంటికొచ్చినంత ఫీలింగ్‌ ఉందన్నారు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. టీడీపీలోకి ఫిరాయించిన ఆమె తిరిగి… వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… దూరం నుంచి చూస్తే అన్నీ బాగా కనిపిస్తాయని ఆ భ్రమతోనే తాను తప్పు చేశానని చెప్పారు. కానీ తనకు ఎక్కడ గౌరవం ఉంది, ఎక్కడ స్థానం ఉంది అన్నది రెండు పార్టీల్లో పోల్చుకున్న తర్వాత తనకు తెలిసిందన్నారు. వైసీపీలో ఉన్నంత క్లారిటీ టీడీపీలో లేదన్నారు. మాటలు మాత్రమే అక్కడ చెబుతుంటారని… కానీ స్పష్టత మాత్రం ఎవరికీ […]

హత్య వెనుక టీడీపీ ప్రమేయం లేకుంటే సీబీఐ విచారణకు భయమెందుకు? – జగన్‌

Posted: 16 Mar 2019 04:54 AM PDT

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక టీడీపీ హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించేందుకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం జగన్‌ మాట్లాడారు.  చనిపోయిన వ్యక్తి ఏమీ చిన్నవాడు కాదని.. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, రెండు సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి అని జగన్‌ అన్నారు. ఒంటరిగా ఉంటున్నారన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లి హత్య చేయడం ఏమిటని ప్రశ్నించారు. చివరకు గన్‌మెన్లు కూడా లేకుండా ఎక్కడికైనా వెళ్లే …. అజాత […]

సేఫ్ సీటు కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ సెర్చ్ ఆప‌రేష‌న్ !

Posted: 16 Mar 2019 04:50 AM PDT

టీడీపీలో నారా లోకేష్‌కి ఓ సీటు దొరికింది. మొన్న‌టి దాకా ఆయ‌న సేఫ్ సీటు కోసం తీవ్రంగా వెతికారు. ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌నే విష‌యంపై ప్రత్యేక టీముల‌తో సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. భీమిలి నుంచి పోటీ చేస్తున్నట్లు మొద‌ట లీకులు ఇచ్చారు. కుప్పం నుంచి పోటీ చేస్తార‌ని మరోసారి ప్ర‌చారం చేశారు. తరువాత కృష్ణా జిల్లా నుంచి బ‌రిలో ఉంటార‌న్న విష‌యాన్ని తెర‌పైకి తెచ్చారు. చివ‌ర‌కు రాజ‌ధాని ఏరియాలోని మంగ‌ళ‌గిరిని లోకేష్ ఎంచుకున్నారు. ఇక్క‌డ కొత్త‌గా టీడీపీ సానుభూతి […]

దక్షిణాదిన పాగాకై కాంగ్రెస్ కన్ను

Posted: 16 Mar 2019 04:14 AM PDT

ఎన్నికల వేళ… ఎత్తులకు పై ఎత్తులు వేసే వేళ… తమ రాజకీయ చతురతను బయటపెట్టాల్సిన వేళ…. అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారంలో కొనసాగాలని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పీఠం ఎక్కాలని తమ సర్వశక్తులూ ధారపోసే వేళ…. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయాన్ని చవి చూసింది. ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన కూడా ఘోరంగా ఓడిపోయింది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగురాష్ట్రాలలో మంచి పట్టుందనే చెప్పాలి. కానీ అప్పటి అధిష్టానం తీసుకున్న కొన్ని తొందరపాటు […]

నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా – ఆదాల

Posted: 16 Mar 2019 03:45 AM PDT

వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా టికెట్ సంపాదించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదివరకే వైసీపీలో ఎందుకు చేరలేదా అని అనిపించిందన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా తనకు జగన్‌ ఆదేశించారని చెప్పారు. జగన్ చెప్పినట్టు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. జగన్‌ను సీఎంగా చూడడమే తన లక్ష్యమన్నారు.

టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా….

Posted: 16 Mar 2019 03:38 AM PDT

నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి అయోమయంలో పడింది. తొలి జాబితాలో ఆయన పేరు లేదు. భూమా అఖిల ప్రియ పేరు మాత్రమే ప్రకటించిన చంద్రబాబు…. బ్రహ్మానంద రెడ్డి, ఎస్వీమోహన్ రెడ్డిలకు మాత్రం టికెట్ ఖాయం చేయలేదు. నంద్యాల టికెట్ కోసం ఏవీ సుబ్బారెడ్డి, ఎస్పీవైరెడ్డి అల్లుడు పోటీ పడుతున్నారు. వారి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుచరులతో బ్రహ్మానందరెడ్డి హడావుడిగా సమావేశం ఏర్పాటు చేశారు. రెండో జాబితాలో తన పేరు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా […]

భారత్ వేదికగా మరో ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ

Posted: 16 Mar 2019 03:30 AM PDT

2020 పీఫా అండర్ -17 మహిళా ప్రపంచకప్ కు గ్రీన్ సిగ్నల్ భారత యువ మహిళా సాకర్ జట్టుకు సువర్ణావకాశం ప్రపంచ క్రికెట్, హాకీ టోర్నీలకు మాత్రమే ఇప్పటి వరకూ ఆతిథ్యమిస్తూ వచ్చిన భారత్….ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో సైతం టోర్నీలు నిర్వహించడానికి ప్రాధాన్యమిస్తోంది. గతంలో పీఫా అండర్ -17 యూత్ ప్రపంచకప్ ను విజయవంతంగా నిర్వహించిన భారత ఫుట్ బాల్ సమాఖ్య..2020లో జరిగే మహిళల అండర్ -17 ప్రపంచకప్ టోర్నీని సైతం నిర్వహించడానికి […]

తాప్సీ నన్ను ముద్దులు పెట్టి చంపేస్తుంది

Posted: 16 Mar 2019 03:24 AM PDT

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తాప్సి పన్ను తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత కొంతకాలంగా తెలుగులో కంటే హిందీ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈమె ఇండస్ట్రీ లోనే బిజీ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఈమెకే కాకుండా సోషల్ మీడియాలో ఆమె సోదరి షాగున్ కి కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారు చాలా మందే ఉన్నారు. ఈ మధ్యనే […]