Translate

Friday, March 15, 2019

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


వైఎస్ వివేకా హత్యపై సంచలన విషయాలు చెప్పిన జగన్

Posted: 15 Mar 2019 06:39 AM PDT

తన బాబాయి హత్య అత్యంత దారుణమైన, రాజకీయంగా నీచమైన చర్య అని జగన్ వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితం గడిపి, సౌమ్యుడిగా పేరున్నవ్యక్తిని అత్యంత కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలితో నరికి చంపడం మించిన దారుణం మరొకటి ఉండదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఎలాంటి వారో అందరికీ తెలుసన్నారు. హత్య జరిగిన తర్వాత దర్యాప్తు చేస్తున్న తీరు  చూస్తుంటే మరింత బాధగా ఉందన్నారు. చనిపోయే ముందు వివేకానంద రెడ్డి ఒక డ్రైవర్ పేరు రాసి ఒక లేఖ రాశారని పోలీసులు తనకు చూపించారన్నారు. తల […]

స్కెచ్‌ చంద్రబాబు, లోకేష్‌ది…. అమలు ఆదినారాయణరెడ్డిది

Posted: 15 Mar 2019 06:31 AM PDT

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ హత్యకు సూత్రధారులు చంద్రబాబు, నారా లోకేష్ కాగా…కుట్రను అమలు చేసింది మంత్రి ఆదినారాయణరెడ్డి అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆదినారాయణరెడ్డి మనిషి కాదని.. ఒక దుర్మార్గుడు అని అన్నారు. నీతి జాతి లేని వ్యక్తి ఆదినారాయణరెడ్డి అని ఫైర్ అయ్యారు. ఆదినారాయణ రెడ్డి మనిషి జాతికే కళంకం అన్నారు. 1998 నుంచే వైఎస్ కుటుంబాన్ని చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు. రాజారెడ్డిని హత్య చేసిన వారికి టీడీపీ ఆఫీస్‌లో ఆశ్రయం కల్పించారని […]

మా నాన్నను అందుకే చంపారు – వివేకా కుమార్తె

Posted: 15 Mar 2019 05:47 AM PDT

తన తండ్రిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని చెప్పారు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. వైఎస్ అవినాష్‌ రెడ్డితో కలిసి వెళ్ళి తన తండ్రి హత్యపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సునీత ఫిర్యాదు చేశారు. తన తండ్రి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. వైసీపీ తరపున ప్రచారం కూడా చేస్తున్నారని… వివేకానంద రెడ్డి ప్రచార కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ఈ హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఈ హత్యపై దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని ఫిర్యాదులో ఆమె కోరారు. మరోవైపు ఈ హత్య వెనుక ముమ్మాటికీ మంత్రి […]

నాని హీరోయిన్ తో సుధీర్…. సుధీర్ భామ తో నాని….!

Posted: 15 Mar 2019 05:32 AM PDT

నాని, సుధీర్ బాబు…. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో వరుస సినిమాలతో అందరికంటే ముందున్నారు. ఇప్పటికే నాని వరుస సినిమాల తో దూసుకు పోతుండగా, సుధీర్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. వీళ్ళ ఇద్దరితో ఇంతకు ముందు హిట్ సినిమాలు తీసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇప్పుడు ఇద్దరినీ పెట్టి ఒక సినిమా తియ్యాలనుకుంటున్నాడట. సమ్మోహనం సక్సెస్ తర్వాత మోహన్ కృష్ణ చిన్న బ్రేక్ తీసుకొని ఒక కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే […]

దిల్ రాజు చేతికి చిక్కిన సూర్యకాంతం

Posted: 15 Mar 2019 05:09 AM PDT

మెగా డాటర్ నిహారిక కొణిదెల నటించిన సూర్యకాంతం సినిమా విడుదలకు సిద్ధమైంది. మొన్నటివరకు రిలీజ్ కష్టాలు చూసిన ఈ మూవీకి ఇప్పుడు కంప్లీట్ గా లైన్ క్లియర్ అయింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా హక్కులు దక్కించుకున్నాడు. ఏపీ, తెలంగాణకు చెందిన పూర్తి థియేట్రికల్ రైట్స్ ఇప్పుడు దిల్ రాజు సొంతమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, సూర్యకాంతం సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ అటుఇటుగా 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. […]

పచ్చి బూతు సినిమాకు సెన్సార్ పూర్తి

Posted: 15 Mar 2019 04:35 AM PDT

తెలుగులో ఇప్పటివరకు అడల్ట్ సినిమాలు చాలానే వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే వాటన్నింటికీ తాత లాంటి సినిమా తెరకెక్కింది. దీనిపేరు చీకటి గదిలో చితక్కొట్టుడు. ఈ సినిమా ట్రయిలర్ చూసినప్పుడు చాలామంది ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి సినిమా సెన్సార్ గడప తొక్కడానికి కూడా వీల్లేదంటూ అప్పట్లో చిన్నపాటి దుమారం కూడా రేగింది. కానీ ఇప్పుడా సినిమాకు సెన్సార్ పూర్తయింది. అవును.. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాను సెన్సార్ అధికారులు చూశారు. మూవీకి A-సర్టిఫికేట్ ఇచ్చారు. 3 […]

దక్షిణాఫ్రికా వెళ్లిన మహేష్ బాబు

Posted: 15 Mar 2019 04:29 AM PDT

ఓవైపు విడుదల తేదీ తరుముకొస్తోంది. మరోవైపు షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ప్రతి ఒక్క రోజు కీలకమే. కానీ మహేష్ బాబు మాత్రం మహర్షి నుంచి పక్కకు వచ్చేశాడు. ఎంచక్కా సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయాడు. అవును.. మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం సౌతాఫ్రికా వెళ్లాడు. 5 రోజుల పాటు ఆ యాడ్ షూటింగ్ లో పాల్గొంటాడు మహేష్. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగొస్తాడు. మహేష్ రాకకోసం ప్రస్తుతం మహర్షి యూనిట్ […]

సాహో హీరోయిన్ కి అనూహ్యమైన షాక్

Posted: 15 Mar 2019 03:56 AM PDT

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం సౌత్ లో అడుగు పెట్టింది. తన మొదటి తెలుగు చిత్రం సాహో ద్వారా ఇప్పటికే వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఆమె పుట్టిన రోజు కానుక గా చిత్ర యూనిట్ ఒక వీడియోను కూడా విడుదల చేసారు. అయితే, ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ హీరోయిన్ కి ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ తాను సైనా నెహ్వాల్ బయోపిక్ చేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ లో సాహో షూట్ […]